ఢాకా: ఇస్లాం మత భోధకుడు జాకీర్ నాయక్ కు చెందిన పీస్ టీవీ ఛానల్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. జులై 1 న ఢాకాలోని రెస్టారెంట్ లో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు జాకీర్ నాయక్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బంగ్లా లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అమిర్ హుస్సేన్ అము వెల్లడించారు. జాకీర్ నగదు లావాదేవీలపై దృష్టి కేంద్రీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయన్ను విచారించనున్నాయని బంగ్లా మంత్రి తెలిపారు. ఇటీవల ఢాకాలోని ఓ రెస్టారెంట్ పై జరిగిన దాడిలో దాదాపు 20 మంది విదేశీయులను అతికిరాతకం చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వారిలో ఐదుగురు దుండగులను పోలీసులు కాల్చిచంపగా, మరొకడిని సజీవంగా పట్టుకున్నారు.
టీవీ ఛానల్ ను నిషేధించిన ప్రభుత్వం
Published Sun, Jul 10 2016 6:55 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM
Advertisement
Advertisement