Peace TV
-
జకీర్ నాయక్ ప్రధాన అనుచరుడి అరెస్టు
శాంతి ప్రవచనాలు వల్లిస్తున్నాంటూ చెప్పుకొనే పీస్ టీవీ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ సన్నిహిత అనుచరుడిని మహారాష్ట్ర ఏటీఎస్, కేరళ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో అరెస్టు చేశారు. అర్షిద్ ఖురేషీ అనే ఈ యువకుడికి జకీర్ నాయక్ నడిపించే ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)తో సంబంధాలున్నాయని, అతడిని నవీ ముంబై ప్రాంతంలో అరెస్టు చేశారని తెలిసింది. కేరళ యువకులను ఇస్లామిక్ స్టేట్లో నియమిస్తున్నాడన్న ప్రధాన ఆరోపణతో ఖురేషీని అరెస్టు చేసినట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తో ంది. ఖురేషి మీద ఐపీసీ సెక్షన్లు 153ఎ, 34లతో పాటు 13యూఏపీఏ కింద కేసులు పెట్టారు. ఖురేషీకి ఐఆర్ఎఫ్తో సంబంధాలు పర్తిగా బయటపడితే.. జకీర్ నాయక్ సంస్థ గుట్టు మొత్తం బయటపడుతుంది. ఖురేషీని మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ప్రశ్నించిన తర్వాత అతడిని కేరళకు తీసుకెళ్తారు. -
జకీర్ టీవీపై బంగ్లాదేశ్ లో నిషేధం
ఢాకా: బంగ్లాదేశ్ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నాడనే కారణంతో వివాదాస్పద ముస్లిం మత బోధకుడు జకీర్ నాయక్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీస్ టీవీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. జూలై 1న ఢాకాపై ఉగ్రదాడిలో పాల్గొన్న యువకులకు జకీర్ ప్రసంగాలే ప్రేరణ అని వార్తలొచ్చిన నేపథ్యంలో షేక్ హసీనా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్లో శాంతిభద్రతలపై సమావేశమైన ఆ దేశ కేబినెట్.. జకీర్ నడుపుతున్న ‘పీస్ టీవీ బంగ్లా’ను నిషేధించటంతోపాటు.. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు ఇమామ్లందరూ.. అసలైన ఇస్లాంను, ఇందులోని శాంతి ప్రవచనాలను ప్రచారం చేయాలని.. యువత ఉగ్రవాదం వైపు ఆకర్శితులవకుండా ప్రభావితం చేయాలని కోరింది. బంగ్లాదేశ్లో నాయక్ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. -
టీవీ ఛానల్ ను నిషేధించిన ప్రభుత్వం
-
టీవీ ఛానల్ ను నిషేధించిన ప్రభుత్వం
ఢాకా: ఇస్లాం మత భోధకుడు జాకీర్ నాయక్ కు చెందిన పీస్ టీవీ ఛానల్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. జులై 1 న ఢాకాలోని రెస్టారెంట్ లో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు జాకీర్ నాయక్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బంగ్లా లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అమిర్ హుస్సేన్ అము వెల్లడించారు. జాకీర్ నగదు లావాదేవీలపై దృష్టి కేంద్రీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయన్ను విచారించనున్నాయని బంగ్లా మంత్రి తెలిపారు. ఇటీవల ఢాకాలోని ఓ రెస్టారెంట్ పై జరిగిన దాడిలో దాదాపు 20 మంది విదేశీయులను అతికిరాతకం చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వారిలో ఐదుగురు దుండగులను పోలీసులు కాల్చిచంపగా, మరొకడిని సజీవంగా పట్టుకున్నారు.