'ఆ దుస్తులతోనే రండి.. లేదంటే పోండి'
ఫ్రాన్స్: బీచ్ల్లోకి నిండైన ఈత వస్త్రాలతో(బుర్కినీలతో) స్విమ్మింగ్కు రాకుండా కేన్స్ మేయర్ నిషేధం విధించారు. దీంతోపాటు ఫ్రాన్స్లోని పలు ప్రాంతాల్లో బీచ్లో పూర్తి దుస్తులతో బీచ్లకు రావొద్దని గట్టిగా వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే భారీ మొత్తంలో ఫైన్ చెల్లించాలని హెచ్చరించారు. సాధారణంగా స్మిమ్మింగ్కు వెళ్లే సమయంలో కొన్ని మతాలకు చెందిన మహిళలు నిండైన వస్త్రాలతో బీచ్లకు వెళుతుంటారు.
అయితే గత నెలలో ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఓ ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాది ట్రక్కుతో ఫ్రాన్స్లో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ఉగ్రవాదులు ముసుగులు ధరించి దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హై అలర్ట్ అమలవుతున్న ఫ్రాన్స్లోని పలు బీచ్లలో ఫుల్ స్మిమ్మింగ్ సూట్ లతో వస్తే రావొద్దని వస్తే బికినీ వస్త్రాల్లో రావాలని లేదంటే బీచ్ రావొద్దని హెచ్చరిస్తున్నారు. ర్యాడికల్ ఇస్లామిస్టులు ఇలాగే ముసుగులతో వచ్చి దాడులకు పాల్పడుతుంటారని అధికారులు భావిస్తుండటం వల్లే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.