Cannes
-
‘కేన్స్’పై నిజాలు చెప్పండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎల్రక్టానిక్స్ దిగ్గజ సంస్థ కేన్స్ గుజరాత్‌కు తరలిపోతున్నా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి శ్రీధర్‌బాబు అసత్యాలు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూడు యూనిట్లలో కీలమైన రెండు యూనిట్లు తరలిపోతున్నాయని, కాంగ్రెస్ చేతగాని, అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడిదారుల్లో అయోమయం నెలకొందన్నారు. ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేన్స్ సంస్థ తెలంగాణలో మూడు యూనిట్లను స్థాపించేలా ఒప్పించి అన్ని అనుమతులను ఇచ్చామన్నారు. వీటిలో సాధారణ ఎల్రక్టానిక్స్ తయారీ యూనిట్‌తో పాటు మరో అత్యాధునిక యూనిట్ (ఒసాట్)ను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మరో పీసీబీ యూనిట్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు కంపెనీని ఒప్పించామని కేటీఆర్ తెలిపారు. ఒసాట్‌ను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసి ఉంటే సెమీ కండక్టర్ల రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్ ఉండేదన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రోత్సహించి, అవసరమైతే ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ సర్కస్ ఫీట్లు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారిపై చర్యలు అంటూ హంగామా చేస్తోందన్నారు. -
కేన్స్ 2024లో తళుక్కున మెరిసిన స్టార్, ఎవరీ నాన్సీ త్యాగి (ఫొటోలు)
-
Nancy Tyagi ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే కేన్స్‌లో అదరగొట్టేసింది!
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల మధ్యనుంచే తన భవిష్యత్తును నిర్మించుకుంది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్యాషన్ ప్రపంచంలో తన స్థానాన్ని పదిలపర్చుకుని ప్రశంసలను అందుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై అరంగేట్రంలోనే అందరిదృష్టినీ ఆకర్షించిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగి కేన్స్ 2024లో ఎలా చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని బర్నావా గ్రామనుంచి ఫ్రెంచ్ రివేరా పట్టణంలోని రెడ్ కార్పెట్ దాకా ప్రయాణం ఎలా సాగింది? తెలుసుకుందాం రండి.ఇంటర్ మంచి మార్కులతో పాసైన తరువాత 2020 ఐఏఎస్ అవ్వాలనే ఆశయంతో ఢిల్లీకి వచ్చిన నాన్సీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోలేకపోయింది. ఎందుకంటే సరిగ్గా అపుడు కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ ఆక్షల సమయంలో నాన్సీ తల్లి ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఇల్లు గడపడం కష్టంగా మారింది. ఇక సివిల్స్ కోచింగ్‌కి డబ్బులు కష్టం అని భావించింది. డిజైన్‌పై ఆమెకున్న తొలి ఆసక్తి , బొమ్మలకు బట్టలు కుట్టడం ద్వారా అలవడిన ఫ్యాషన్ అభిరుచిని, భవిష్యత్ కెరీర్‌కు పునాది వేసింది. అలాగే కెమెరా పట్టుకొని వీడియోలు చేయడం మొదలు పెట్టింది. కొన్నిసార్లు, వీడియోల కోసం ఆమె సోదరుడు మను ఫీజును త్యాగం చేయాల్సి వచ్చేదట. వారి గ్రామంలో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నడుపుకునే తండ్రి కూడా సహాయం చేశాడు. నాలుగేళ్ల తర్వాత ఆ కష్టమంతా ఫలించింది. అలా ఉన్నచోటనే విజయాన్ని వెతుక్కుంది. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ అయింది. ఆమె విలక్షణమైన శైలి బ్రూట్ ఇండియా దృష్టిని ఆకర్షించింది. తమ స్క్వాడ్‌లో చేరమని ఆమెను ఆహ్వానించింది. అలా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. టీంకు కూడా గర్ వకారణంగా నిలిచింది. ఆత్మవిశ్వాసం,స్థయిర్యంతోపాటు మాతృభాష (హిందీ)లో మాట్లాడి హైలైట్ అయింది.కేన్స్‌లో యువ డిజైనర్‌గా మెరిసింది. స్టన్నింగ్ లుక్స్, డిజైనర్ దుస్తుల్లో ఆమె ఇచ్చిన పోజులు వైరల్ అయ్యాయి ఫలితంగా 23 ఏళ్ల ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 7లక్షల నుండి 20 లక్షలకు పెరిగింది. అంతేనా నటి-ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ వంటివారు తమ కోసం డిజైన్ చేయమని కోరుతున్నారు. ఆమె కోసం ఒక దుస్తులను తయారు చేసేందుకు నాన్సీ సన్నద్ధమవుతోంది. ఇంకా అర్జున్ కపూర్,మసాబా గుప్తా వంటి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. జీవిత ప్రయాణం చాలా కష్టంగా సాగింది. కానీ ప్రతి క్షణం విలువైనదే అంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది.మే 14-మే 25 వరకు జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్, కార్సెట్, టెయిల్డ్ స్కర్ట్ , బ్యాక్‌లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ వీల్, పొడవాటి పల్లూతో క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ లావెండర్ చీర తదితర లుక్స్‌తో అదరగొట్టింది. అంతేకాదు తన దుస్తులను తానే స్వయంగా కుట్టుకోవడం ప్రత్యేకత. కేన్స్ కోసం, నాన్సీ నాలుగు దుస్తులను డిజైన్ చేసుకుంది. ఇందుకు ఆమెకు రెండు నెలలు పట్టింది. 30 రోజుల్లో 1,000 మీటర్ల ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన అందమైన 20 కిలోల గులాబీ రంగు గౌనుతో ఆమె ఫస్ట్ లుక్‌ని రూపొందించింది.ఆ ఆ తర్వాతి నెలలో, ఆమె మిగిలిన మూడింటిని సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండవలుక్ కోసం దేశీయ చీరను ఎంచుకుంది. వెస్ట్రన్ టచ్‌తో ఆమె ధరించిన చీర ఆడియెన్స్‌తోపాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా వీపరీతంగా నచ్చేసింది.ఈ చీరను 100 శాతం ఆర్గానిక్ కాటన్, సస్టైనబుల్ ఫాబ్రిక్ నుండి తయారు చేసానని స్వయంగా చెప్పంది. అలాగే తాను ఎక్కువగా సోదరుడి సలహాలను తీసుకుంటానని కూడా వెల్లడించింది. ఈ సారి కూడా డిజైన్ల నుంచి దుస్తుల రంగు వరకు అన్నీ మా అన్నయ్య ఆలోచనలే అని తెలిపింది మురిపెంగా. ఇంత పాపులారిటీ వచ్చింది కదా నటిస్తారా అంటే.. తనకు నటన అంటే పెద్దగా తెలియదు కాబట్టిన నో అని చెప్పేసింది. కల నిజమైంది అంటూ తనకు మద్దతిచ్చి, స్ఫూర్తినిచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. తన ఫ్యాషన్‌తో మరింత అబ్బుర పర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. -
Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్‌లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ, ఫ్యాషన్ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 12-రోజుల ఈ వేడుకులో ఫ్యాషన్ స్టయిల్, బ్యూటిఫుల్ ఫ్యాషన్ గేమ్, లుక్స్‌తో అదరగొట్టేస్తున్నారు. 77వ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, ప్రీతి జింటా, దీప్తి సాధ్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ తళుక్కున మెరిసారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికూడా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అయితే వీరిలో మరింత స్పెషల్‌గా నిలుస్తోంది నటి, మోడల్ ఊర్వశి రౌతేలా.ఊర్వశీ రౌతేలా ఖరీదైన ఫ్యాషన్ దుస్తులతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ ధరలు ఏకంగా రూ.105 కోట్లు. ముఖ్యంగా ఫస్ట్ డే ధరించిన పూల పింక్ గౌన్ స్పెషల్‌గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ.47 కోట్లు అని తెలుస్తోంది. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు. సో.. మొత్తంగా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందనేది హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఐశ్వర్య, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రీతి జింటా లాంటి తారలు ధరించిన డ్రెస్‌ల ధరలు లక్షల్లో ఉంటుందిట. తరువాత రోజుల్లో కూడా తనదైన స్టయిల్లో అదర గొడుతోంది ఈ భామ.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
అందాల ఐశ్వర్యం, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన లేటెస్ట్ లుక్‌తో ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. తాజాగా కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ట్రోలర్స్‌కు షాకిచ్చింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన లుక్స్‌పై విపరీతంగా ట్రోల్ చేసినవాళ్లకు లేటెస్ట్ ఫోటోస్‌తో తగిన సమాధానం చెప్పింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ప్రతిష్టాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి హాజరైన ఐషూ రెడ్ కార్పెట్ లుక్‌తో వార్తల్లో నిలిచింది. అయితే కొంతమంది నెటిజన్లు ఆమె లుక్‌పై దారుణంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో కేన్స్ 2024 కోసం సిద్ధమవుతున్నప్పటి ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది. తన కొత్త హెయిర్‌స్టైల్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన అందమైన లుక్‌తో అందరినీ మంత్రముగ్దులను చేసింది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ ఒక రేంజ్లో సాగాయి. "రెడ్ కార్పెట్‌పై ఇలా దర్శనమిచ్చి ఉండి ఉంటే ఉచకోతే’’ అని ఒకరు, "కేన్స్ సమయంలో మీరు ఈ రకమైన హెయిర్‌స్టైల్ ఎంచుకుంటే భలే ఉండేది’’ మరొకరు కమెంట్ చేశారు. "భూమిపై అత్యంత అందమైన మహిళ" అని మరో యూజర్ బాలీవుడ్ దియాపై తన ప్రేమను ప్రకటించాడు. -
Cannes 2024: పింకీ గౌన్‌లో అదితిరావు ప్రెటీ లుక్స్ (ఫోటోలు)
-
కేన్స్ రెడ్‌కార్పెట్‌పై సంప్రదాయ చీరలో మెరిసిన ప్రీతి జింటా!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో వివిధ రకాల సెలబ్రిటీలు, ప్రముఖులు విభిన్నమైన డిజైనర్‌వేర్ దుస్తులతో సందడి చేశారు. కానీ అస్సాం నటి, వ్యాపారవేత్త భారతీయ సంప్రదాయ చీరలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వీరి సరసన బాలీవుడ్ నటి, ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ ప్రీతీ జింటా కూడా చేరింది ఆమె కూడా దేశీ ష్యాషన్ రూట్‌నే సెలక్ట్ చేసుకుంది. చాలా విరామం తర్వాత ఈ 77 ఫ్రాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. ఆమె ఈ చీరలుక్లో లేత గులాబీలా అందంగా కనిపించింది. డిజైనర్ సీమా గుజ్రాల్ చేతిలో రూపుదిద్దుకున్న ఓండ్రే పింక్ సీక్విన్ జార్జెట్ చీరలో అద్భుతంగా కనిపించింప్రీతి. ఈ చీరపై చక్కటి ముత్యాలు, సీక్విన్, బీడ్‌వర్క్ ఉన్నాయి. ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో జత చేయబడింది. ఈ చీర ధర ఏకంగా రూ. 118,000/. ఈ వేడుకలో ప్రీతి జంటా తన అభిమానులకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చింది. ఈ స్టైలిష్ మిలీనియల్ చీరకు తగ్గట్టుగా స్లీవ్‌లెస్ వి నెక్ బ్లౌజ్ మంచి లుక్ తెచ్చిపెట్టింది ఆమెకు. వాటన్నింటకీ అనుగుణంగా కర్లీ హెయిర్‌ని వదులుగా ఉంచడం ఓ డిఫెరెంట్ లుక్ తెప్పించింది ప్రీతికి. అంతేగాదు ఆమె ఈ కేన్స్‌లో ఇంతలా సింప్లిసిటీగా రెడీ అయ్యి రావడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసినా..ఆమె స్టన్నింగ్ లుక్ అందర్నీ చూపుతిప్పుకోనివ్వ లేదు. ఇద వేడుకలో మరో డిజైన డ్రెస్‌లో కూడా కనిపించింది. ఈ ఈవెంట్లో తొలి ప్రదర్శనలో పెళ్లి కూతురు మాదిరి నైరా బ్రైడల్ గౌనులో మెరిసింది. దీని ధర ఏకంగా రూ. 5,57,600/-. ఇక ప్రీతీ కేన్స్ వేడుకలో మాట్లాడుతూ..ఇది అద్భుతమైనది. ఈ కేన్స్ వేడుకలతో తనకు విడదీయలేని సంబంధం ఉందన్నారు. తాను మళ్లీ మూవీస్‌లోకి రీ ఇంట్రీ ఇచ్చానని, ఇది తనకు సినీ జీవితంలో సెకండ్ లైఫ్ అని అన్నారు. అందువల్లే తాను సంతోష్‌తో కలిసి లాహోర్ 1947లో నటించానని చెప్పుకొచ్చారు. ఈ అద్భుతమైన ప్రతిష్టాత్మకమైన అవార్డను రాజ్‌కుమార్ సంతోష్‌కి అందించే అవకాశం తరకు లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు కాదు, తొలి ఆసియా వ్యక్తి కాబట్టి నేను చాలా గొప్పగా భావిస్తున్నానని అన్నారు ప్రీతి. కాగా, బాలువుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సరసన ప్రీతి జింటా నటించిన తొలి చిత్రం దిల్ సే(1998) మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు రాజ్‌కుమార్ సంతోష్. ప్రేక్షకుల ముందుకు రానున్న పీరియాడికల్ డ్రామా లాహోర్ 1947 కోసం రాజ్‌కుమార్ సంతోషితో మరోసారి కలిసి పనిచేశారు.(చదవండి: ‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్‌తో పనిలేదు..!) -
Anasuya Sengupta: 'కేన్స్'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)
-
కాన్స్‌లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్‌లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్‌లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్‌కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్‌లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్‌లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్‌కతా. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్‌లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్‌లో 2020 జూన్‌లో ‘ది షేమ్‌లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్‌కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్‌కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్‌ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్‌కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్‌గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
బాలీవుడ్ నటి ఐశ్వరరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తల్లి అయ్యాక కూడా ఆమె అదే గ్లామర్‌ని మెయింటెయిన్ చేస్తూ యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉంటుంది. ఆమె కూతురు ఆరాధ్య కూడా తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నట్లు ఆకర్షణీయంగా ఉంటుంది. స్టైయిలిష్ దుస్తులతో కెమెరాకి చిక్కి అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఇటీవల్ల ఏ వేడుకలోనైన ఈ క్యూట్ మామ్ అండ్ డాటర్స్ ఇద్దరు కలిసే సందడి చేస్తున్నారు. ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనేందుకు బయలు దేరుతూ మంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇలా కెమెరాకు చిక్కారు తల్లికూతుళ్ల ద్వయం. అయితే ఆమె చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించడంతో ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక కూతురు ఆరాధ్య తల్లి చేతికి గాయం అయ్యిందని ఆమె టోట్ బ్యాగ్‌ని తాను తీసుకుని అమ్మకు కాస్త ఉపశమనం కలిగించింది. తల్లి కూతుళ్లు ఇద్దరు మంచి స్టయిలిష్ డ్రెస్‌లతో స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. ఐశ్వర్య ఫ్యాంటుపై లూయిస్ విట్టన్ ట్రెంట్ కోట్లో అబ్బరపర్చగా, ఆరాధ్య నల్లటి ఫ్యాంటుపై తెలుపు స్పీకర్లతో కూడిన స్వెట్షర్ట్లో ఉంది. ఇక్కడ ఐశ్వర్య గూచీ బ్లాక్ లెదర్ టోట్ బ్యాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బ్రాండ్ బ్యాగ్ ధరలు అత్యంత ఖరీదైనవి. ఇక్కడ ఐశ్వర్యరాయ్ బ్యాగ్ టోట్ ధర ఏకంగా రూ. 80, 000/ పలుకుతుందట. ఈ కేన్స్ ఈవెంట్లో ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్‌గా ఐశ్వర్య రాయ్ నిలుస్తుంటుంది. ఆమెను భారతదేశంలోని కేన్స్ రాణి అని చెప్పొచ్చు. అంతేగాదు ఆమె అభిమానులు 2024 కేన్స్‌లో ఐశ్వర్యరాయ్ లుక్ ఎలా ఉంటుందా అని ఆత్రతగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు) -
కేన్స్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో బెజోస్ గ్రాండ్ ఎంట్రీ.. వారు వచ్చిన బోట్ ఖరీదు తెలుసా?
బిలియనీర్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కేన్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌తో కలిసి బెజోస్ 500 మిలియన్ డాలర్ల (రూ.4 వేల కోట్లకుపైనే) విలువైన సూపర్‌యాచ్ (బోట్)లో ఫ్రాన్స్‌కు దక్షిణాన ఉన్న కేన్స్‌కు చేరుకున్నారని పేజ్ సిక్స్ అనే ఆన్లైన్ మ్యాగజైన్ నివేదించింది. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం గ్లోబల్ సెలబ్రిటీలు ఈ రిసార్ట్ టౌన్‌కి చేరుకుంటున్నారు. కోరు అనే పేరుతో ఉన్న ఈ లగ్జరీ బోట్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సెయిలింగ్ యాచ్‌గా చెబుతారు. దీని తయారీని 2018లో ప్రారంభించగా ఐదు సంవత్సరాల తర్వాత ఇటీవలే పూర్తి చేశారు. గత ఏప్రిల్‌లోనే ఇది తన తొలి సముద్రయానం చేసింది. సూపర్‌యాచ్ ముందు భాగంలో లారెన్ శాంచెజ్‌ను పోలి ఉండే మత్స్యకన్య బొమ్మ ఉన్నట్లు ఆ మ్యాగజైన్ పేర్కొంది. ఈ సూపర్‌యాచ్ నిర్వహణ కోసం జెఫ్ బెజోస్‌కు సంవత్సరానికి 25 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని తెలిసింది. బెజోస్ కోరుతో పాటు తన మరో బోట్ అబియోనాను కూడా కేన్స్‌కు తీసుకువచ్చారు. కేన్స్‌లోని డు క్యాప్ ఈడెన్ రోక్ హోటల్లో జరిగిన మ్యాగజైన్ పార్టీలో అలాగే హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఇచ్చిన ప్రైవేట్ మాన్షన్ పార్టీలో బెజోస్ ఆయన గర్ల్‌ఫ్రెండ్ శాంచెజ్ కనిపించారు. ఇదీ చదవండి: Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా.. రెడ్ కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్త! -
Cannes Film Festival 2023: కాన్స్ కాలింగ్
బాలీవుడ్ నటి – నిర్మాత అనుష్కా శర్మకు కాన్స్ నుంచి కాల్ వచ్చిందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.76వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఈ నెల 16 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ చిత్రోత్సవాల్లో ΄ాల్గొనవలసిందిగా జ్యూరీ నుంచి అనుష్కా శర్మకు ఆహ్వానం అందిందట. ఈ వేడుకల్లో ‘టైటానిక్’ ఫేమ్ హాలీవుడ్ నటి కేట్ విన్స్లెట్తో కలిసి కొందరు మహిళా విజేతలకు అవార్డులు అందిస్తారట అనుష్కా శర్మ. ఇక గతంలో ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకోన్, సోనమ్ కపూర్, ఆలియా భట్ వంటి తారలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది తమన్నా, పూజా హెగ్డే వంటి తారలు కాన్స్ చిత్రోత్సవాల్లో మెరిశారు. ఈసారీ పలువురు నాయికలు అక్కడ సందడి చేసే చాన్స్ ఉంది. -
దీపికాకు అరుదైన గౌరవం, జ్యూరీ మెంబర్‌గా మన హీరోయిన్!
దీపికా పదుకోన్‌కి అరుదైన గౌరవం దక్కింది. అందుకే ఆమె భర్త, హీరో రణ్వీర్ సింగ్ ‘వావ్’ అంటున్నారు. ఇక ఆమె అభిమానులైతే ‘మన దేశీ అమ్మాయి మనకు గర్వకారణంగా నిలిచింది’ అని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రశంసలు ఎందుకంటే.. ప్రతిష్ఠాత్మక కాన్స్ చలన చిత్రోత్సవాల్లో దీపికా పదుకోన్ జ్యూరీ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు జ్యూరీలో ఉంటారు. ఈ 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు మే 10 నుంచి 28 వరకు జరగనున్నాయి. మొత్తం 21 చిత్రాలు చూసి, ఒక చిత్రాన్ని అవార్డుకి ఎంపిక చేస్తారు. మే 28న అవార్డు ప్రదానం జరుగుతుంది. కాగా ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో జరిగే ఈ చిత్రోత్సవాల్లో 2010 నుంచి దీపికా పాల్గొంటున్నారు. రెడ్ కార్పెట్‌పై వీలైనంత ఆకర్షణీయంగా కనిపించి, మార్కులు కొట్టేశారు. ఇప్పుడు జ్యూరీ సభ్యురాలి హోదాలో వెళ్లనున్నారు. కాన్స్‌లో ‘విక్రమ్’ ట్రైలర్ కమల్‌హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విక్రమ్’. జూన్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను కాన్స్ చిత్రోత్సవాల్లో విడుదల చేయనున్నారు. ఈ ఆవిష్కరణ వేడుకలో పాల్గొనడానికి కమల్, లోకేశ్ తదితరులు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరవుతారని తెలిసింది. చదవండి: చిచ్చు పెట్టిన హిందీ భాష, స్టార్ హీరోల మధ్య ట్వీట్ల వార్ స్క్రీన్షాట్లున్నాయి, అంత ఈజీగా వదిలిపెట్టను: లైవ్‌లో నటుడి వార్నింగ్ -
కేన్స్‌లో సందడి చేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
-
కేన్స్ చిత్రోత్సవాల్లో ధనుష్
తమిళసినిమా: తమిళ సినిమా గర్వించదగ్గ నటులలో ధనుష్ ఒకరు. నటుడు, గాయకుడు, గీతరచయిత, దర్శకుడు, నిర్మాత అంటూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమాలోని బహు శాఖల్లో తన ప్రతిభను చాటుకుంటున్న ధనుష్ నటుడిగానూ కోలీవుడ్, బాలీవుడ్‌ను దాటి హాలీవుడ్ ప్రేక్షకులను త్వరలోనే అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆంగ్లం, ఫ్రెంచ్ భాషల్లో రూపొందిన లవ్, కామెడీ, అడ్వంచర్ కథా చిత్రంగా ఉంటుంది. చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను తెచ్చుకుంది. ఈ చిత్రం మరో రికార్డును సాధించింది. చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ చిత్రోత్సవాలు ఈ నెల 8వ తేదీ ఫ్రాన్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి నటుడు ధనుష్ గురువారం ‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’చిత్ర యూనిట్‌తో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లారు. అక్కడ చిత్ర బృందంతో కలిసి తీసుకున్న ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. -
చీరలో సొగసులొలికిన సోనం!
ప్రతిష్టాత్మక కాన్స్ చిత్రోత్సవంలో బాలీవుడ్ భామ సోనం కపూర్ మరోసారి అదరగొట్టింది. ఈ అంతర్జాతీయ వేడుకలో సొగసులొలికేరీతిలో చీర కట్టుకొని భారతీయత ఉట్టిపడేలా అందంగా దర్శనమిచ్చింది. ఇప్పటికే దీపికా పదుకొనే, ఐశ్యర్యరాయ్ తమదైన స్టైల్లో కేన్స్ రెడ్కార్పెట్నే వేడెక్కించగా.. తాజాగా సోనం సైతం తన ఫస్ట్ లుక్‌తో జిగేల్మని మెరిసింది. సౌందర్య ఉత్పత్తుల కంపెనీ లారియల్ అంబాసిడర్‌గా 2011 నుంచి ఫ్రెంచ్ రివీరాలో జరుగుతున్న కాన్స్ వేడుకలో ఈ లావణ్యరాశి తళుకులొలుకుతున్న సంగతి తెలిసిందే. In @norblacknorwhite showing off my spanking new and beautiful iwc watch!! @iwcwatches_india @iwcwatchesarabia @lorealhair @lorealmakeup @lorealskin A post shared by sonamkapoor (@sonamkapoor) on May 20, 2017 at 11:54am PDT A post shared by sonamkapoor (@sonamkapoor) on May 20, 2017 at 11:48am PDT A post shared by sonamkapoor (@sonamkapoor) on May 20, 2017 at 11:47am PDT When you squeeze in press a day early and you gotta run but gotta up the glamour quotient- #sportyspice Day 1 #cannes2017 @sonamkapoor in @norblacknorwhite @lynn_ban @lorealmakeup A post shared by Rhea Kapoor (@rheakapoor) on May 20, 2017 at 9:12am PDT -
ఐశ్వర్యారాయ్‌కు ఫ్రాక్ పల్లకి..!
-
ఐష్‌కు ఫ్రాక్ పల్లకి..!
పాపం..! ఐశ్వర్య అందం ప్రేక్షకుల్ని ఐస్ చేస్తే, ఓ ఐదుగుర్ని ఇబ్బందులపాలు చేసింది. వాళ్లెవరో కాదు... కేన్స్‌లో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ వెంట నడిచిన టీమ్. నార్మల్‌గా ఎవరి బట్టలు వాళ్లకు భారం కావు. ఐశ్వర్య వేసుకున్న బట్టలు ఆమెకు మాత్రమే కాదు.. ఇతరులకు బరువయ్యాయి. డ్రస్సు వేసుకుంది ఐశ్వర్యే. కానీ, మోసింది మాత్రం ఐదుగురు. దుబాయ్ బేస్డ్ ఫిలిప్పినో ఫ్యాషన్ డిజైనర్ మైఖేల్ సింకో డిజైన్ చేసిన ఊదా రంగు గౌనులో మొన్న 19వ తేదీన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య సందడి చేశారు. ఆ డ్రస్సు, అందులో ఆమె అందం గురించి వంక పెట్టలేం. కానీ, ఆ డ్రస్సును క్యారీ చేయడానికి ఐశ్వర్యతో పాటు ఆమె టీమ్ నానా హైరానా పడ్డారు. గౌను సైజు చూశారుగా, ఎంతుందో? పైగా, థిక్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారట. గౌను బరువును మోయలేక హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు... వ్యాన్‌లో ఎక్కడానికి నలుగురి సహాయం తీసుకున్నారు ఐష్. ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సేమ్ సీన్. అక్కడ ఓ ఐదుగురు డ్రస్సును మోశారు. పాపం... అంతంత భారీ గౌనులు వేసుకోవడం ఎందుకు? బాధ పడడం ఎందుకు? అని నెట్టింట్లో కొందరు జాలి పడ్డారు. రెడ్ కార్పెట్ అంతటినీ తుడిచేద్దామని ఐశ్వర్య ఈ గౌను వేసుకుందా? అని మరికొందరు సెటైర్స్ వేశారు. ఏదేమైనా.. భారీ గౌనులో స్లిమ్‌గా కనిపించిన ఐష్‌ని చూసి, ఈవిడగారు ఓ బిడ్డకు తల్లేనా? 43 ఏళ్ల వయసు ఉంటుందా? అని చాలామంది ఆశ్చర్యపోయారు. -
కళకళలాడిన కేన్స్
-
'ఆ దుస్తులతోనే రండి.. లేదంటే పోండి'
ఫ్రాన్స్: బీచ్‌ల్లోకి నిండైన ఈత వస్త్రాలతో(బుర్కినీలతో) స్విమ్మింగ్‌కు రాకుండా కేన్స్ మేయర్ నిషేధం విధించారు. దీంతోపాటు ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో బీచ్‌లో పూర్తి దుస్తులతో బీచ్‌లకు రావొద్దని గట్టిగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే భారీ మొత్తంలో ఫైన్ చెల్లించాలని హెచ్చరించారు. సాధారణంగా స్మిమ్మింగ్‌కు వెళ్లే సమయంలో కొన్ని మతాలకు చెందిన మహిళలు నిండైన వస్త్రాలతో బీచ్‌లకు వెళుతుంటారు. అయితే గత నెలలో ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఓ ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాది ట్రక్కుతో ఫ్రాన్స్‌లో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ఉగ్రవాదులు ముసుగులు ధరించి దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హై అలర్ట్ అమలవుతున్న ఫ్రాన్స్‌లోని పలు బీచ్‌లలో ఫుల్ స్మిమ్మింగ్ సూట్ లతో వస్తే రావొద్దని వస్తే బికినీ వస్త్రాల్లో రావాలని లేదంటే బీచ్ రావొద్దని హెచ్చరిస్తున్నారు. ర్యాడికల్ ఇస్లామిస్టులు ఇలాగే ముసుగులతో వచ్చి దాడులకు పాల్పడుతుంటారని అధికారులు భావిస్తుండటం వల్లే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
అమ్మడి పెదాలను చూసి ట్విట్టర్ బిత్తరపోయింది!
ఈసారి కాన్స్ చిత్రోత్సవంలో బాలీవుడ్ భామ ఐశ్వర్యరాయ్ ప్రతి అడుగూ హల్చల్ చేస్తోంది. వయస్సు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో రెడ్ కార్పెట్‌పై మరోసారి తళుక్కున మెరిసింది. ఆమె స్టైల్స్, వేసుకున్న డిజైనర్ వస్త్రాలు మరోసారి ఆన్లైన్లో ట్రెండ్ సృష్టించాయి. కాన్స్‌లో అడుగుపెట్టిన నాటినుంచి ఇప్పటికీ ఐదుసార్లు ఆమె ట్విట్టర్లో ట్రెండ్ అవ్వడాన్నిబట్టి ఈ 42 ఏళ్లు ప్రౌఢభామ ఇంకా తగ్గలేనది చాటుకుంటున్నది. తాజాగా ఫ్యాషన్ సరిహద్దులు చెరిపేస్తూ.. డిజైనర్ రమీ కాడి రూపొందించిన డెలికేట్ అవుట్‌ఫిట్‌లో ఐశ్యర్య కాన్స్ రెడ్‌కార్పెట్‌పై దర్శనమిచ్చింది. ఆమె వేసుకున్న దుస్తుల కన్నా ఆమె అధరాలకు వేసుకున్న లిప్స్టిక్కే అందరి దృష్టిని ఆకర్షించింది. వంకాయ (పర్పుల్) రంగు పెదాలతో కాస్తా కొత్తగా, మరికాస్త చిత్రంగా ఐశ్యర్య కనిపించింది. చిత్రోత్సవంలో భాగంగా 'ఫ్రం ల్యాండ్ ఆఫ్ ద మూన్' చిత్ర ప్రీమియర్‌కు ఆమె ఆదివారం హాజరయ్యింది. అదేవిధంగా ఐశ్ తాజా చిత్రం 'సరబ్జిత్'ను కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా 'సరబ్జిత్' చిత్రయూనిట్‌తో ఆమె సెల్ఫీ కూడా తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆమె పెదాలను చూసి బిత్తరపోయిన ట్విట్టర్ వాసులు చిత్రవిచిత్రంగా కామెంట్లు పెడుతున్నారు. ఏషియన్ పెయింట్స్ వాడితే మీ పెదాలు ఇలా అవుతాయి అంటూ సెటైర్లు విసురుతున్నారు. -
కాన్స్ లో మెరిసిన సోనమ్ కపూర్
పారిస్: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనక ముందే అందరి ప్రశంసలు అందుకుంది సోనమ్ కపూర్. రాల్ఫ్ అండ్ రాస్ తెల్ల గౌను ధరించిన సోనమ్ రెడ్ కార్పేట్ పై నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించి మరో సారి అందరి ప్రశంసలందుకుంది. మెడకు సైతం తెల్లని నక్టెస్ ధరించింది.కార్పేట్ పై ఉన్నంతసేపూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుని వేడుకలో సోనమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
కలర్ఫుల్గా 69వ కేన్స్
-
హైహీల్స్.. యమా డేంజర్!
* కేన్స్‌లో హీల్స్ లొల్లి * ఎత్తుచెప్పులు ప్రమాదకరమంటున్న నిపుణులు ‘‘ఇక్కడ మహిళలు హైహీల్స్‌ను మాత్రమే ధరించాలి. ఫ్లాట్‌గా ఉండే చెప్పులు, షూస్‌ను నిషేధించడమైనది’’ ప్రఖ్యాత కేన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు చేసిన ఈ ప్రకటన ఇటీవల దుమారం రేపింది. అంతర్జాతీయ సినిమా వేడుకలకు మాత్రమే కాదు.. ప్రముఖ నటీమణుల అందాల ప్రదర్శనకూ వేదికైన కేన్స్‌లో ఈ నిబంధన పట్ల చాలా మంది వివిధ ఇబ్బందుల వల్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. హాలివుడ్ ప్రముఖల నుంచి విమర్శలూ వెల్లువెత్తడంతో ఆనక నిర్వాహకులు వెనక్కి తగ్గారు. అయితే, ఈ గొడవ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్ నిపుణుడు డాక్టర్ స్టీవ్ ప్రీస్ హై హీల్స్‌పై దృష్టి సారించారు. వీటిని ధరిస్తే కలిగే మోదం కంటే.. ప్రమాదమే ఎక్కువని తేల్చేశారు! హై హీల్స్‌ను రోజూ ధరించడం వల్ల ఇబ్బందులు తప్పవని స్టీవ్ చెప్పారు. దీర్ఘకాలంలో కాలి ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయని అంటున్నారు. వీటిలో ముఖ్యమైన సమస్యలు ఏవంటే... ⇒ హైహీల్స్‌తో నడక తీరు మారిపోతుంది. నడుంనొప్పి మొదలవుతుంది. చీలమండలు, కీళ్లు వాచిపోతాయి. ⇒ పాదాలపై పుండ్లు ఏర్పడతాయి. ⇒ శరీర బరువంతా మునివేళ్లపై పడుతుంది. దీనివల్ల అరికాలుపై ముందు వైపు ఒత్తిడి పెరుగుతుంది. పాదం పనితీరుపై ప్రభావం పడుతుంది. ⇒ తూలిపడకుండా ఉండేందుకు భయంగా, అతి జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. ⇒ నడుము దగ్గర నుంచి తొడలు, పిక్కలు, పాదాల వరకూ అన్ని కండరాలూ అతికష్టంగా పనిచేయాల్సి వస్తుంది. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్