
దీపికా పదుకోన్‌కి అరుదైన గౌరవం దక్కింది. అందుకే ఆమె భర్త, హీరో రణ్‌వీర్ సింగ్ ‘వావ్’ అంటున్నారు. ఇక ఆమె అభిమానులైతే ‘మన దేశీ అమ్మాయి మనకు గర్వకారణంగా నిలిచింది’ అని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రశంసలు ఎందుకంటే.. ప్రతిష్ఠాత్మక కాన్స్ చలన చిత్రోత్సవాల్లో దీపికా పదుకోన్ జ్యూరీ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు జ్యూరీలో ఉంటారు.
ఈ 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు మే 10 నుంచి 28 వరకు జరగనున్నాయి. మొత్తం 21 చిత్రాలు చూసి, ఒక చిత్రాన్ని అవార్డుకి ఎంపిక చేస్తారు. మే 28న అవార్డు ప్రదానం జరుగుతుంది. కాగా ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో జరిగే ఈ చిత్రోత్సవాల్లో 2010 నుంచి దీపికా పాల్గొంటున్నారు. రెడ్ కార్పెట్‌పై వీలైనంత ఆకర్షణీయంగా కనిపించి, మార్కులు కొట్టేశారు. ఇప్పుడు జ్యూరీ సభ్యురాలి హోదాలో వెళ్లనున్నారు.
కాన్స్‌లో ‘విక్రమ్’ ట్రైలర్
కమల్‌హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విక్రమ్’. జూన్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను కాన్స్ చిత్రోత్సవాల్లో విడుదల చేయనున్నారు. ఈ ఆవిష్కరణ వేడుకలో పాల్గొనడానికి కమల్, లోకేశ్ తదితరులు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరవుతారని తెలిసింది.
చదవండి: చిచ్చు పెట్టిన హిందీ భాష, స్టార్ హీరోల మధ్య ట్వీట్ల వార్
స్క్రీన్‌షాట్లున్నాయి, అంత ఈజీగా వదిలిపెట్టను: లైవ్‌లో నటుడి వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment