
Cannes Filim Festival 2022: 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే సినీ సెలబ్రెటీలకు అతిపెద్ద పండుగ. ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన తారంతా రెడ్ కార్పెట్ హోయలు పోతారు. ఇందుకు కోసం విభిన్నమైన వస్త్రాధారణతో అందిరిని ఆకట్టుకుంటారు. ఇందుకోసం స్పెషల్ డిజైన్ చేసిన దస్తులు, ఆకర్షణీయమైన ఆభరణాలతో తళుక్కున మెరుస్తారు సీని తారలు.
చదవండి: యూరప్‌లో పర్సు పోయింది, పైసా లేదు.. ఎవరూ సాయం చేయలేదు
ఇదిలా ఉంటే ఈ ఏడాది కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు మన భారత్‌కు గౌరవ సభ్య దేశంగా హోదా దక్కడంతో కేంద్ర మంద్రి అనురాగ్ ఠాగూర్ నేతృత్వంలో మన భారత సెలబ్రెటీల టీం హాజరైంది. అయితే ఈసారి ఈ అవార్డుల వేడుకలో దీపికా పదుకొనె జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ సందర్భంగా దీపకా ధరించిన దుస్తులు, ఆభరణాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ క్రమంలో దీపికా ధరించిన ఓ నెక్లెస్, దాని ధర ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచింది. కంటెను తలపించేలా ఉన్న ఈ నెక్లెస్‌పై అందరి దృష్టి పడటంతో దాని ఖరీదేంటుందని ఆరా తీయం ప్రారంభించారు నెటిజన్లు. దీంతో దాని ధర తెలిసి నెటిజన్లను షాక్ అవుతున్నారు.
చదవండి: కాన్స్ ఫిలిం ఫెస్టివల్.. పూజా హెగ్డేకు చేదు అనుభవం
కాగా నలుపు రంగు సూట్ మీద దీపికా ధరించిన ఈ వజ్రాల నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్సించింది. తాతమ్మల కాలంనాటి కంటెను తలపించేలా ఉన్న ఈ నగకు ముందు భాగంలో పులి ముఖాలు వచ్చేలా డిజైన్ చేశారు. ఈ పులుల కళ్ల స్థానంలో ఖరీదైన పచ్చలను పొదిగి ఉంది. అయితే ఈ నెక్లెస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నగల తయారీ సంస్థ కార్టియర్ తయారు చేసిందట. పూర్తిగా 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేసిన ఈ నెక్లెస్ ధర సుమారుగా 3 కోట్ల 80లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక దీని ధర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కాగా ఈసారి భారత్ నుంచి ఐశ్వర్యారాయ్, ఆర్ మాధవన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, ఎఆర్ రెహమాన్, పూజా హెగ్డే, నయనతార, తమన్నా, దీపికా పదుకొనె తదితరులు హాజరైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment