
ఫ్రాన్స్‌లో చిత్ర బృందంతో ధనుష్
తమిళసినిమా: తమిళ సినిమా గర్వించదగ్గ నటులలో ధనుష్ ఒకరు. నటుడు, గాయకుడు, గీతరచయిత, దర్శకుడు, నిర్మాత అంటూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమాలోని బహు శాఖల్లో తన ప్రతిభను చాటుకుంటున్న ధనుష్ నటుడిగానూ కోలీవుడ్, బాలీవుడ్‌ను దాటి హాలీవుడ్ ప్రేక్షకులను త్వరలోనే అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.
ఆంగ్లం, ఫ్రెంచ్ భాషల్లో రూపొందిన లవ్, కామెడీ, అడ్వంచర్ కథా చిత్రంగా ఉంటుంది. చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను తెచ్చుకుంది. ఈ చిత్రం మరో రికార్డును సాధించింది. చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ చిత్రోత్సవాలు ఈ నెల 8వ తేదీ ఫ్రాన్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి నటుడు ధనుష్ గురువారం ‘ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’చిత్ర యూనిట్‌తో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లారు. అక్కడ చిత్ర బృందంతో కలిసి తీసుకున్న ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment