
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు.

77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘అన్‌సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్‌లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు.

15 మందితో పోటీపడి మరీ ఆమె ఈ అవార్డు అందుకున్నారు. అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్‌కతా.

జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు.

కానీ తర్వాత యాక్టర్ అయ్యారు.









