
అందాల ఐశ్వర్యం, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన లేటెస్ట్ లుక్‌తో ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతోంది. తాజాగా కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ట్రోలర్స్‌కు షాకిచ్చింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన లుక్స్‌పై విపరీతంగా ట్రోల్ చేసినవాళ్లకు లేటెస్ట్ ఫోటోస్‌తో తగిన సమాధానం చెప్పింది.
కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ప్రతిష్టాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి హాజరైన ఐషూ రెడ్ కార్పెట్ లుక్‌తో వార్తల్లో నిలిచింది. అయితే కొంతమంది నెటిజన్లు ఆమె లుక్‌పై దారుణంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో కేన్స్ 2024 కోసం సిద్ధమవుతున్నప్పటి ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది. తన కొత్త హెయిర్‌స్టైల్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన అందమైన లుక్‌తో అందరినీ మంత్రముగ్దులను చేసింది.

దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ ఒక రేంజ్‌లో సాగాయి. "రెడ్ కార్పెట్‌పై ఇలా దర్శనమిచ్చి ఉండి ఉంటే ఉచకోతే’’ అని ఒకరు, "కేన్స్ సమయంలో మీరు ఈ రకమైన హెయిర్‌స్టైల్ ఎంచుకుంటే భలే ఉండేది’’ మరొకరు కమెంట్ చేశారు. "భూమిపై అత్యంత అందమైన మహిళ" అని మరో యూజర్ బాలీవుడ్ దియాపై తన ప్రేమను ప్రకటించాడు.

Comments
Please login to add a commentAdd a comment