Cannes 2022: Aishwarya Rai Gets Brutally Trolled for Botox, Pregnancy and Cannes Looks - Sakshi
Sakshi News home page

Aishwarya Rai Bachchan: 'ప్లాస్టిక్‌ సర్జరీలు చేసుకుని చివరకు ఇలా తయారైంది'

Published Sun, May 22 2022 12:56 PM | Last Updated on Sun, May 22 2022 3:17 PM

Cannes 2022: Aishwarya Rai Gets Brutally Trolled for Botox, Pregnancy - Sakshi

ఇరవై ఏళ్లుగా కాన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొంటోంది ఐశ్వర్యరాయ్‌. ఇన్నేళ్లలో ఒకటీరెండు సార్లు మినహా ప్రతిసారి ఐష్‌ లుక్‌తో అదరగొట్టింది. ఈ సారి రంగురంగుల పువ్వులతో డిజైన్‌ చేసిన నలుపు రంగు పొడవాటి గౌనులో రెడ్‌ కార్పెడ్‌పై మెరిసిందామె. ఆమెను అలా చూసిన ఫ్యాన్స్‌ బ్యూటిఫుల్‌, దేవత అని కీర్తించారు. కానీ కొందరు మాత్రం ఎప్పటిలాగే ఆమెను టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు.

'డ్రెస్‌లో ఐశ్వర్యరాయ్‌ చాలా బాగుంటుంది. కానీ ఈ సారి ఎందుకో కొంత లావైనట్లు కనిపిస్తోంది. బహుశా గర్భం దాల్చడం వల్లో లేదంటే వయసు మీద పడటం వల్లో బొద్దుగా మారినట్లుంది' అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 'మరీ అతిగా ప్లాస్టిక్‌ సర్జరీలు చేసుకుని అందాన్ని నాశనం చేసుకున్నావ్‌', 'ముసలామెవైపోయావు, నీకింక తల్లి పాత్రలు మాత్రమే వస్తాయి', 'సడన్‌గా ఇంత లావైపోయిందేంటి?' అని మరికొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఆమెను హేళన చేస్తున్నారు. కాగా కాన్స్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమని మెరిసిన ఐశ్వర్య ఆదివారం నాడు భర్త అభిషేక్‌ బచ్చన్‌, కూతురు ఆరాధ్యతో కలిసి ముంబైకి తిరిగి వచ్చేసింది.

చదవండి 👇

నటితో ఎఫైర్‌ పెట్టుకో, ఫేమస్‌ చేస్తామన్నారు

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌ ఎన్ని లక్షలు గెలుచుకుందో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement