Jeff Bezos’s Grand Entrance at Cannes on Costly Superyacht - Sakshi
Sakshi News home page

కేన్స్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో బెజోస్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. వారు వచ్చిన బోట్‌ ఖరీదు తెలుసా?

May 22 2023 2:35 PM | Updated on May 22 2023 2:46 PM

Jeff Bezos grand entrance at Cannes on costly superyacht - Sakshi

బిలియనీర్‌, అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ కేన్స్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. గర్ల్‌ ఫ్రెండ్‌ లారెన్ శాంచెజ్‌తో కలిసి బెజోస్‌ 500 మిలియన్‌ డాలర్ల (రూ.4 వేల కోట్లకుపైనే) విలువైన సూపర్‌యాచ్‌ (బోట్‌)లో ఫ్రాన్స్‌కు దక్షిణాన ఉన్న కేన్స్‌కు చేరుకున్నారని పేజ్ సిక్స్ అనే ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ నివేదించింది. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం గ్లోబల్ సెలబ్రిటీలు ఈ రిసార్ట్ టౌన్‌కి చేరుకుంటున్నారు.

 

కోరు అనే పేరుతో ఉన్న ఈ లగ్జరీ బోట్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సెయిలింగ్ యాచ్‌గా చెబుతారు. దీని తయారీని 2018లో ప్రారంభించగా ఐదు సంవత్సరాల తర్వాత ఇటీవలే పూర్తి చేశారు. గత ఏప్రిల్‌లోనే ఇది తన తొలి సముద్రయానం చేసింది. సూపర్‌యాచ్ ముందు భాగంలో లారెన్ శాంచెజ్‌ను పోలి ఉండే మత్స్యకన్య బొమ్మ ఉన్నట్లు ఆ మ్యాగజైన్‌ పేర్కొంది. ఈ సూపర్‌యాచ్‌ నిర్వహణ కోసం జెఫ్ బెజోస్‌కు సంవత్సరానికి 25 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయని తెలిసింది.

బెజోస్ కోరుతో పాటు తన మరో బోట్‌ అబియోనాను కూడా కేన్స్‌కు తీసుకువచ్చారు. కేన్స్‌లోని డు క్యాప్ ఈడెన్ రోక్‌ హోటల్‌లో జరిగిన మ్యాగజైన్ పార్టీలో అలాగే హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఇచ్చిన ప్రైవేట్ మాన్షన్ పార్టీలో బెజోస్‌ ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ శాంచెజ్ కనిపించారు.

ఇదీ చదవండి: Cannes Film Festival: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మెరిసిన అమన్‌ గుప్తా.. రెడ్‌ కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement