రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.
అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్‌కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.
కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్‌లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్‌లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్‌లుగా అందించారట. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.
అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు.
అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్‌ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment