
భారతదేశంలో అత్యంత ధనవంతులైన అంబానీ కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ తరుణంలో కాబోయే కోడలు 'రాధిక మర్చంట్'కు ఖరీదైన గిఫ్ట్స్ అందించారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. అంతకంటే ముందు అత్తింటి వారు కాబోయే కోడలికి సుమారు రూ.4.5 కోట్ల విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మి గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ వంటి వాటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాధికా మర్చంట్ గతంలో ఓ పార్టీలో తన అత్తగారికి చెందిన డైమండ్ చౌకర్ ధరించి కనిపించింది. ఇది విలువైన ముత్యాలు, వజ్రాలతో పొడిగినట్లు తెలుస్తోంది. అంత కంటే ముందు సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు నీతా అంబానీ అదే నెక్లెస్ ధరించడం గమనార్హం.
ఇదీ చదవండి: అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఇండియాకు..
వచ్చే నెల ప్రారంభంలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ వంటి వాటితో పాటు ఇవాంకా ట్రంప్ కూడా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment