బిలియనీర్లు, బిజినెస్ దిగ్గజాల ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదుగా. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు, వ్యాపారవేత్త అనంత్‌అంబానీ, రాధిక మర్చంట్ మూడుముళ్ల వేడుక అంటే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే అంబానీ చేతితో రాసారని చెబుతున్న ఇన్విటేషన్ కార్డ్ ఒకటి నెట్టింట హల్ చల్ చేసింది. అయితే, అంబానీ కుటుంబం ఈ వార్తలను ధృవీకరించలేదు అలాగని ఖండించనూ లేదు.దీంతో మరిన్ని ఊహాగానాలు, అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి.
జూలైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వెడ్డింగ్
అంబానీ ఫ్యాన్ పేజీలలో ప్రకారం, అనంత్ ,రాధిక జూలై 2024లో ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.జూలై 10, 11 , 12 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి VIP గెస్ట్ హౌస్‌లతో పాటు 1200 మంది అతిథులు రానున్నారు. సింగర్, దిల్జిత్ దోసాంజ్ వారి వివాహానికి ముందు ఉత్సవాల్లో అనేక మంది ప్రదర్శనకారులలో ఉంటారు.
జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో ఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అవుతాయి.దీంతో పాటు అనంత్ అంబానీ , రాధిక డిజైనర్ దుస్తులు, విందు, ఇలా పెళ్లికి సంబంధించి అనేక పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పెళ్లి హడావిడి మొదలైందని కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి. ఇందులో వధువు తండ్రి, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ రాధిక స్నేహితులతో కలిసి పోజులిచ్చాడు. ఎంబ్రాయిడరీ నెహ్రూ జాకెట్, బ్లాక్ కలర్ బంద్‌గాలా షేర్వాణిలో వీరేల్ హుందాగా కనిపించాడు.
Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..! |
దివ్యాంగులు తయారు చేసిన స్పెషల్ క్యాండిల్స్
మరో ఇంట్రస్టింగ్ వార్త ఏంటంటే..పెళ్లికి వచ్చిన అతిథులకు మహాబలేశ్వర్‌లోని అంధ ళాకారుల తయారు చేసిన ప్రత్యేక కొవ్వొత్తులను బహుమతిగా ఇస్తారట. స్వదేశీ పురాతన హస్తకళ, అమూల్యమైన వారసత్వ సంపదకు ఇషా అంబానీ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలంకరణకు కూడా వీటిని ఎక్కువగా వాడనున్నారట. ( ‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్‌లోడ్లతో దూసుకుపోతోంది)
Comments
Please login to add a commentAdd a comment