yacht
-
అంబానీ పెళ్లి సందడి : జెఫ్ బెజోస్, ఇతర దిగ్గజాల కళ్లు చెదిరే కానుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్‌కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్‌లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్‌లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్‌లుగా అందించారట. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు. అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్‌ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
చేపలు పట్టేందుకు రూ.581 కోట్లు.. సౌదీ ప్రిన్స్ విలాసం
సౌదీ యువరాజు తుర్కీ బిన్ ముక్రిన్ అల్ సౌద్ ఇటీవల తన సరికొత్త టాయ్ టెస్లా సైబర్ ట్రక్‌తో కలిసి దిగిన ఫోటో వైరల్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. అయితే ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన స్పోర్ట్ ఫిషింగ్ యాచ్ (క్రూయిజ్) కొనుగోలు చేశారు.సముద్ర పరీక్షలను పరిచయం చేసేటప్పుడు, దానిని తయారు చేసిన సంస్థ రాయల్ హుయిస్మాన్ ఈ పడవను "ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విలాసవంతమైన వ్యక్తిగత స్పోర్ట్ ఫిష్ పడవ"గా వర్ణించింది. 52 మీటర్ల పొడవు, ఆరు డెక్‌ల ఎత్తుతో దీన్ని రూపొందించారు. ఇది ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ కంటే రెండు మీటర్లు అధికంగా పొడవు ఉంటుంది.ఈ విలాసవంతమైన నౌకలో పొడవైన విల్లు, ఎత్తైన రక్షణ కవచాలు, వెనుక భాగంలో లో ఫిషింగ్ కాక్‌పిట్ ఉన్నాయి. డచ్ సంస్థ రాయల్ హుయిస్మాన్ ప్రకారం.. ఈ పడవ యూఎస్ నేవీకి చెందిన జుమ్వాల్ట్-క్లాస్ డిస్ట్రాయర్‌ను అధిగమించి, 35 నాట్ల అద్భుతమైన వేగాన్ని చేరుకుంటుంది. పరిమాణం, వేగం అద్భుతమైన కలయికతో, ప్రస్తుతం సముద్ర ప్రయోగాలలో ఉన్న ‘స్పెషల్ వన్’ గణనీయమైన దృష్టిని, డిమాండ్‌ను పొందింది. లైసెన్స్డ్ హెలికాప్టర్, ఫిక్స్డ్-వింగ్ పైలట్ అయిన ప్రిన్స్ తుర్కీ ఈ ప్రత్యేక పడవను 70 మిలియన్ డాలర్లు (రూ.581 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. -
నేను కోట్ల కొద్దీ డబ్బులు గుమ్మరించింది దానికే!: హీరో
హీరో ఆర్ మాధవన్ ఎక్కువ డబ్బు పెట్టి కొన్నదేంటో తెలుసా? యాచ్.. అదేంటనుకుంటున్నారా? ఇదొక భారీ పడవలాంటిది. ఇందులోపల ఇంటి మాదిరిగా అన్నిరకాల వసుతులు కూడా ఉంటాయి. దీని గురించి మాధవన్ మాట్లాడుతూ.. నేను చాలా డబ్బులు ఖర్చు చేసింది నా ఇంటి కోసమే! చాలా ఖరీదైన ఇంటిని నేను కొనుగోలు చేశాను. నిజానికి ముగ్గురే ఉండే ఇంటికి అంత పెద్ద ఇల్లు అవసరమే లేదనుకోండి. ఇల్లును పక్కన పెడితే అదే రేంజ్లో ఖర్చు చేసి కొన్నదేదైనా ఉందా? అంటే అది యాచ్(పెద్ద పడవలాంటిది). లైసెన్స్ దొరికింది ఓడ కొనాలంటే కెప్టెన్ లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ సంపాదించాలని ఎప్పటినుంచో అనుకున్నాను. కరోనా సమయంలో చేయడానికి పనేం లేదు కాబట్టి పరీక్ష రాశాను. పాసయ్యాను, లైసెన్స్ పొందాను. ఇందుకు ఆరునెలలు పట్టింది. ఇప్పుడు నేను 40 అడుగుల ఎత్తైన యాచ్ లేదా పడవను నేను ఈజీగా డీల్ చేయగలను. దానికోసమే యాచ్‌ను కొన్నాను.. అందులో ప్రయాణిస్తుంటే భలే మజా వస్తుంది. నేను అందులో కూర్చుని కథలు రాసుకుంటాను. బోలెడన్ని కథలు రాస్తూ.. అవసరమైనప్పుడు బయటకు వెళ్లి సముద్రాన్ని చూస్తాను. నాకు కావాలనుకున్నప్పుడు ఎక్కడో ఓ చోట పార్క్ చేసి డాల్ఫిన్స్ ఎగురుతూ ఉంటే చూసి ఆనందిస్తాను. అలా సముద్రాన్ని చూసి బోలెడన్ని కథలు రాసుకుంటాను. నా జీవితంలో ఈ పడవ కొనడమే నేను తీసుకున్న గొప్ప నిర్ణయం. ప్రస్తుతం దాన్ని దుబాయ్‌లో ఉంచాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 30 -40 అడుగుల ఎత్తైన యాచ్ కొనాలంటే దాదాపు ఐదు లక్షల డాలర్స్ నుంచి రెండు మిలియన్ల డాలర్స్ (భారత కరెన్సీలో నాలుగున్నర కోట్ల నుంచి పదహారు కోట్ల మేర) అవుతుందని తెలుస్తోంది! చదవండి: 56 ఏళ్ల వయసులో నటుడి డేటింగ్.. విడిపోయామంటూ పోస్ట్.. -
సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు
ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా ఉపయోగించే నౌక. దీని పేరు ‘కొసాత్కా’– అంటే ‘కిల్లర్ వేల్’ జాతి తిమింగలం అని అర్థం. పుతిన్ దాదాపుగా మూడేళ్ల కిందటే ఈ భారీ నౌకను సొంతం చేసుకున్నా, ఇటీవలే దీనికి కళ్లుచెదిరే ఖర్చుతో అదనపు హంగులు సమకూర్చడంతో తాజాగా వార్తల్లోకెక్కింది. ఈ నౌకలోని అదనపు హంగుల కోసం 100 మిలియన్ పౌండ్లు (రూ.1.05 లక్షల కోట్లు) ఖర్చు చేయడం విశేషం. ఒకవైపు యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో దాదాపు మూడు లక్షల మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఏమీ పట్టకుండా పుతిన్ తన నౌకను రాజసంగా తీర్చిదిద్దుకోవడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఈ నౌక అసలు పేరు ‘ది గ్రేస్‌ఫుల్’. జర్మనీ రేవు నుంచి పుతిన్ దీనిని 750 మిలియన్ పౌండ్లకు (రూ.7.92 లక్షల కోట్లు) సొంతం చేసుకున్నాక, దీని పేరును ‘కొసాత్కా’గా మార్చుకున్నాడు. యుక్రెయిన్‌పై సైనిక దాడిని ప్రకటించడానికి కొద్దిరోజుల ముందే ఈ నౌకను రష్యాకు పంపాల్సిందిగా, నౌకా సంస్థను ఆదేశించాడు. ఈ నౌక రష్యా తీరానికి చేరుకున్న 23 రోజుల్లోనే యుద్ధం మొదలైంది. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంటే, పుతిన్ మాత్రం ఈ నౌకను తాను కోరుకున్న రీతిలో తీర్చిదిద్దుకునే పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇందులో ఖరీదైన క్రిస్టల్ షాండ్లియర్లు, కార్పెట్లు, సోఫాలు, కాఫీ టేబుళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా డ్రాయింగ్ రూమ్‌లలో బంగారు తాపడం చేయించాడు. ఖరీదైన కళాఖండాలను ఏర్పాటు చేయించుకున్నాడు. ఇన్ని హంగులు చేయించుకున్న ఈ నౌక పొడవు దాదాపు అరకిలోమీటరు ఉంటుంది. ఇందులో స్విమింగ్ పూల్స్, పైకప్పు మీద హెలిపాడ్, బంగారు ఫ్రేముల అద్దాలు, బంగారు తాపడం చేయించిన సింక్ పైపులు వంటి ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. రష్యన్ అధికార వ్యతిరేక సంస్థ అయిన ‘అలెక్సీ నవాల్నీ’ ఈ నౌక లోపలి హంగుల ఫొటోలను, వాటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల వివరాలను ఇటీవల వెలుగులోకి తెచ్చింది. (చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు! పొద్దుగూకినా ప్రాబ్లం లేదు!) -
కేన్స్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో బెజోస్ గ్రాండ్ ఎంట్రీ.. వారు వచ్చిన బోట్ ఖరీదు తెలుసా?
బిలియనీర్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కేన్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌తో కలిసి బెజోస్ 500 మిలియన్ డాలర్ల (రూ.4 వేల కోట్లకుపైనే) విలువైన సూపర్‌యాచ్ (బోట్)లో ఫ్రాన్స్‌కు దక్షిణాన ఉన్న కేన్స్‌కు చేరుకున్నారని పేజ్ సిక్స్ అనే ఆన్లైన్ మ్యాగజైన్ నివేదించింది. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం గ్లోబల్ సెలబ్రిటీలు ఈ రిసార్ట్ టౌన్‌కి చేరుకుంటున్నారు. కోరు అనే పేరుతో ఉన్న ఈ లగ్జరీ బోట్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సెయిలింగ్ యాచ్‌గా చెబుతారు. దీని తయారీని 2018లో ప్రారంభించగా ఐదు సంవత్సరాల తర్వాత ఇటీవలే పూర్తి చేశారు. గత ఏప్రిల్‌లోనే ఇది తన తొలి సముద్రయానం చేసింది. సూపర్‌యాచ్ ముందు భాగంలో లారెన్ శాంచెజ్‌ను పోలి ఉండే మత్స్యకన్య బొమ్మ ఉన్నట్లు ఆ మ్యాగజైన్ పేర్కొంది. ఈ సూపర్‌యాచ్ నిర్వహణ కోసం జెఫ్ బెజోస్‌కు సంవత్సరానికి 25 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని తెలిసింది. బెజోస్ కోరుతో పాటు తన మరో బోట్ అబియోనాను కూడా కేన్స్‌కు తీసుకువచ్చారు. కేన్స్‌లోని డు క్యాప్ ఈడెన్ రోక్ హోటల్లో జరిగిన మ్యాగజైన్ పార్టీలో అలాగే హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఇచ్చిన ప్రైవేట్ మాన్షన్ పార్టీలో బెజోస్ ఆయన గర్ల్‌ఫ్రెండ్ శాంచెజ్ కనిపించారు. ఇదీ చదవండి: Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా.. రెడ్ కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్త! -
చిక్కుల్లో ప్రపంచ కుబేరుడు.. కుళ్లిన కోడిగుడ్లతో కొడతామంటూ ప్రజల హెచ్చరిక!
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బేజోస్ ఊహించని చిక్కుల్లో పడ్డారు. ఎంతో ముచ్చపడి తయారు చేయించుకున్న పడవ ఆయన్ని కలవరపాటుకి గురి చేస్తోంది. అలలపై ప్రయాణం మొదలుకాకముందే ఆయన్ని వివాదాల్లోకి ముంచింది. మెగాయాచ్ ఎలన్‌మస్క్ కంటే ముందు ప్రపంచంలో నంబర్ ధనవంతుడిగా రికార్డులెక్కారు జెఫ్ బేజోస్. దాదాపు 200 బిలియన్ డాలర్లకు సంపద ఆయన సొంతం. ఈ క్రమంలో తను సేద తీరేందుకు.. విహార యాత్రలు చేపట్టేందుకు సర్వాంగ సుందరంగా.. సకల సౌకర్యాలతో ఓ పడవ (మెగాయాచ్) తయారు చేయించుకోవాలని నిర్ణయించారు. కస్టమైజ్డ్ యాచ్‌లు తయారు చేసే ఓ డచ్ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. హలాండ్లో నిర్మాణం హలాండ్లోని ప్రముఖ పోర్టు సిటీల్లో రోటెర్డామ్ దగ్గరున్న ఆల్బ్లెస్సర్డామ్లో Y721 పేరుతో మెగాయాచ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పడవ ఖరీదు రమారమీ 485 మిలియన్ డాలర్లు. ఎట్టకేలకు ఫుట్‌బాల్ స్టేడియం కంటే పెద్దదిగా ఈ యాచ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యాచ్‌ని సముద్రంలో ప్రవేశపెట్టే సమయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. రోటెర్డామ్లో చారిత్రక సంపదగా భావించే ఓ వంతెన యాచ్ ప్రయాణానికి అడ్డుగా నిలిచింది. చారిత్రక వంతెన యాచ్‌ని తయారు చేసిన చోటు నుంచి సముద్రంలోకి తీసుకెళ్లే నీటి ప్రవాహంపై పురాతన కాలం నాటి కోనింగ్షావెన్ అనే వంతెన ఉంది. దీనిని మొదటిసారి 1878లో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలతో జరిగిన యుద్దంలో బాంబింగ్ కారణంగా ఈ వంతెన పాడవగా.. తిరిగి పునర్మించారు. అప్పటి నుంచి ఈ వంతెన ఓ చారిత్రాత్మక కట్టడంగా స్థానికులు భావిస్తున్నారు. చివరిసారి 2017లో వంతెనకు మరమ్మత్తులు చేశారు. వంతెన కూల్చేద్దాం జెఫ్‌బేజోస్ కోసం తయారు చేసిన మెగా యాచ్‌ను సముద్రంలోకి పంపే క్రమంలో పురాతన వంతెన అడ్డుగా ఉన్నందున... పాక్షికంగా వంతెనను కూల్యేయాలంటూ పడవ తయారీ సంస్థ రోటెర్డామ్ పాలకమండలకి విజ్ఞప్తి చేసింది. యాచ్‌ను సముద్రంలో పంపిన తర్వాత వంతెన పునర్ నిర్మాణానికి నిధులు అందిస్తామని పేర్కొంది. మేం ఒప్పుకోం జెఫ్ బేజోస్ పడవ వెళ్లేందుకు తమ చారిత్రక కట్టడానికి కూల్చాలనే ప్రతిపాదనలను రోటెర్డామ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంతెన కూల్చివేతకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. తమ సెంటిమెంట్స్ పట్టించుకోకుండా వంతెన కూల్చి ఈ మార్గంలో జోఫ్ బేజోస్ పడవని తీసుకెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. కుళ్లిన కోడిగుడ్లతో యాచ్‌పై దాడి చేస్తామంటూ తమ కార్యాచరణ ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ కోడిగుడ్ల దాడికి మద్దతు రోజురోజుకి పెరుగుతోంది. బాయ్‌కాట్ అమెజాన్ ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఏం చేయాలో పాలుపోక ఇటు రోటెడ్డ్యామ్ పాలకమండలి, అటు పడవ తయారీ కంపెనీలు బిక్కచచ్చిపోయాయి. మరోవైపు జెఫ్‌బేజోస్‌కి వ్యతిరేకంగా బాయ్‌కాట్ అమెజాన్ అంటూ గళం విప్పుతున్నారు. మొత్తంగా ఈ కొత్త పడవ వ్యహారం జెఫ్‌బేజోస్‌కి టైటానిక్‌లా మారింది. చదవండి: అమెజాన్ బాస్ పంటపండింది.. ఏకంగా లక్షా నలభై వేల కోట్లకు పైనే పెరిగిన సంపద -
బిల్‌గేట్స్ ముచ్చట ఖరీదు రూ. 4600కోట్లు
ప్రపంచంలోనే సంపన్నుడు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఓ విలాసవంతమైన యాట్(విహార నౌక)ను కొన్నారు. గతేడాది మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో గేట్స్ దీన్ని చూసి ముచ్చట పడ్డారు. పర్యావరణానికి ఈ యాట్ ఏ మాత్రం హాని చేయదని తెలుసుకున్న బిల్‌గేట్స్ తన కోసం ప్రత్యేకించి రూపొందించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. వెంటనే దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించి పనులు ప్రారంభించాలని సూచించారు. కాగా.. ఈ నౌక విశేషాలు: ఆక్వా నౌక 370 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో నాలుగు గెస్ట్ రూమ్‌లు, రెండు వీఐపీ గదులు, యజమాని రూమ్ ఉంటుంది. ఇందులో 5 డెక్‌లు ఉంటాయి. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఈ బోట్లో వెళ్లవచ్చు. అలాగే ఒక జిమ్, యోగా స్టూడియో, బ్యూటీ రూం, మసాజ్ పార్లర్, స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలు ఈ బోట్లో ఉన్నాయి. కాగా ఈ బోట్‌ను బిల్‌గేట్స్ తరచూ వెకేషన్‌కు వెళ్లేందుకు గాను కొనుగోలు చేశారు. ఈ పడవ లిక్విడ్ హైడ్రోజన్‌తో నడుస్తుంది. అంటే కేవలం నీటిని మాత్రమే ఇది వ్యర్థంగా బయటకు వదులుతుంది. ఇక ఈ బోటు ధర రూ.4600 కోట్లు కావడం విశేషం. కాగా లిక్విడ్ హైడ్రోజన్‌తో నడిచే ప్రపంచంలోని ఏకైక బోటు కూడా ఇదే కావడం మరో విశేషం. బిల్‌గేట్స్ కొనుగోలు చేసిన సూపర్‌యాచ్ పొడవు 370 అడుగులు. దీంట్లో ఒకసారి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. నౌక వేగం గంటకు 17 నాటికల్ మైళ్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఎంతో విలాసవంతంగా, ఆధునిక టెక్నాలజీ సాయంతో నడిచే ఈ నౌకలో బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు కూడా ఉంటాయి. కాగా ఇప్పటి వరకూ బిల్ గేట్స్‌కు సొంత విహార నౌక లేదు. ప్రస్తుతం ఈ నౌక తయారీ దశలో ఉంది. ఇది 2024 నాటికి బిల్‌గేట్స్ చేతికి రానుంది. -
ప్రపంచంలోనే మొదటి స్టీల్ బోటు
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మొత్తం స్టీల్‌తో ఓ బోటును (యాట్)ను తయారు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కొనసాగుతున్న 60వ ఫోర్ట్ లాడర్ డేల్ అంతర్జాతీయ బోట్ల ప్రదర్శనలో ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. తొమ్మిది వేల చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బోటును ‘మాన్షన్ యాట్’గా నామకరణం చేశారు. ఇందులో ఐదు బెడ్ రూమ్‌లు, ఐదు బాత్ రూమ్‌లు ఉండగా, పలు ఇండోర్, అవుట్ డోర్ సిట్టింగ్‌లు ఉన్నాయి. పూర్తి స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఈ బోటు నిర్వహణ ఖర్చు ఫైబర్ గ్లాస్తోని తయారు చేసిన బోట నిర్వహణ ఖర్చుకన్నా 25 శాతం తక్కువని బోటు యజమాని బ్రూనో ఎడ్వర్డ్స్ తెలిపారు. దీన్ని కొనుగోలు చేసేందుకు పలువురు వ్యాపారులు పోటీ పడుతున్నారని చెప్పారు. అయితే దాని వెలెంతో చెప్పలేదు. 40 అడుగుల వెడల్పూ, 85 అడుగుల పొడువు కలిగిన ఈ బోటులో 145 మంది హాయిగా ప్రయాణం చేయవచ్చని బ్రూనో ఎడ్వర్డ్స్ తెలిపారు. దీన్ని ప్రస్తుతం నీటికి 18 అడుగులపైన, నాలుగు హైడ్రాలిక్ పిల్లర్లపై అమర్చి ప్రదర్శనకు పెట్టారు. -
వహ్వారే.. వల్కిరే..!
సినిమా చూసేందుకు థియేటర్లు.. ఇష్టమైన భోజనం ఆరగించేందుకు రెస్టారెంట్లు.. ఆర్ట్ గ్యాలరీలు.. ఈత కొలనులు అబ్బో.. షాపింగ్‌మాల్స్.. ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి.. ఇవన్నీ ఉన్నవి ఏ మల్లీకాంప్లెక్స్లోనో లేదా ఫైవ్ స్టార్ హోటల్లోనో కాదు.. ఈ ఫొటోలోని బోటు.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బోటుగా చరిత్రలోకెక్కనుంది. దాదాపు రెండు ఫుట్‌బాల్ కోర్టుల వైశాల్యానికి సమానంగా ఉంటుంది. 229 మీటర్ల పొడవుండే ఈ బోటు ఒక కొన నుంచి మరో కొన వరకు దాదాపు 24 బస్సులను ఒకేసారి పార్కింగ్ చేయొచ్చు. వల్కిరే ప్రాజెక్టుగా పిలిచే ఈ బోటును రూపొందించేందుకు దాదాపు రూ.56 వేల కోట్లు ఖర్చు కానుంది. ఇందులో దాదాపు 52 మంది అతిథులు, 92 మంది సిబ్బంది ఉండొచ్చు. ఇది గంటకు దాదాపు 46 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. దక్షిణ కొరియాకు చెందిన చుల్హన్ పార్క్‌కు ఇలాంటి బోటును తయారుచేయించుకోవాలని చిన్నప్పటి కల. ఇందుకోసం దాదాపు 8 నెలల పాటు బోటు డిజైనర్లతో మాట్లాడి.. ఆఖరికి పామర్ జాన్సన్ అనే డిజైనర్‌తో తనకు ఇష్టం వచ్చినట్లుగా డిజైన్ చేయించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్ద బోటు అరబ్ రాజు ఖలీఫా బిన్ జయెద్ అల్ నయన్ వద్ద ఉంది. ఇది 180 మీటర్ల పొడవు ఉంది. -
బోట్‌ల్యాండ్
దీవిని ఐల్యాండ్ అంటారు. అదే దీవి బోట్లో ఉంటే... బోట్‌ల్యాండ్ అనాలిగా! అలాంటిదే ఈ యాట్ (కొంచెం పెద్దసైజు పడవ). చుట్టూ నీళ్లు... నీళ్ల మధ్యలో ద్వీపం... ఆ ద్వీపంలో చిన్న ఇల్లు... ఆ ఇంటిలో మనం ఉంటే? భలేగా ఉంటుంది కదూ! ఆ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించే అవకాశం మనకు త్వరలో కల్పించబోతోంది... ట్రాపికల్ ప్యారడైజ్ ఐల్యాండ్. ఐల్యాండ్ అన్నాం కాబట్టి అది సముద్రం మధ్యలో ఉంటుందనుకునేరు. ఇది సముద్రం మధ్యలో ఉండే దీవి కాదు.. సముద్రం పైన తేలియాడే దీవి. అన్ని హంగులతో ఓ యాట్‌లో అందంగా సృష్టించిన దీవి. కరీబియన్, పాలినీసియా దీవుల స్ఫూర్తితో దీన్ని తయారు చేశారు. దాదాపు 295 అడుగుల పొడవుండే ఈ సూపర్ యాట్ అడుగు భాగాన్ని ఉక్కుతో నిర్మిస్తారు. పైభాగం మాత్రం అల్యూమినియం, ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో సిద్ధం చేస్తారు. యాట్ వెనుక భాగంలో పర్వతం మాదిరిగా కనిపిస్తున్నది కృత్రిమ అగ్నిపర్వతం.అయితే ఈ పర్వతం నుంచి లావా కాదు... నీరు వస్తుంది. అది జలపాతంలా ప్రవహించి ప్రవహించి నేరుగా ముందువైపున ఉండే స్విమ్మింగ్‌పూల్‌లోకి చేరుతుంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే కృత్రిమ బీచ్ ఉంటుంది. దాని చుట్టూ చక్కని కాటేజీలు, వాటి చుట్టూ పచ్చని చెట్లు కలిసి నిజంగానే ఓ దీవిలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఈ దీవిలో ఉండే చెట్లన్నీ సహజమైనవే కావడం మరో విశేషం. ఇవి కాక సినిమాహాలు, లైబ్రరీ, జిమ్ వంటివి అదనపు హంగులూ ఉన్నాయి. పదిమంది యాత్రికులకు సరిపోయే ఈ యాట్ని ‘యాట్ ఐల్యాండ్ డిజైన్’ అనే సంస్థ నిర్మిస్తోంది. ఇది గంటకు 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాదాపు ఐదేళ్ల క్రితమే దీని డిజైన్ పూర్తికాగా... ఈ ఏడాది నిర్మాణం పూర్తి చేసుకోనుంది! -
అమ్మకానికి చర్చిల్ నౌక!
బ్రిటన్ మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, చరిత్రకారుడు సర్ విన్ స్టన్ చర్చిల్ కు చెందిన విహారనౌకను అమ్మకానికి పెట్టారు. అత్యంత విలాసవంతమైన, రాజభోగాలు కలిగిన ఆ నౌక ఖరీదును 1.5 మిలియన్ యూరోలుగా నిర్ణయించారు. విన్ స్టన్ చర్చిల్ తో పాటు ఆయన వినియోగించిన ఆ నౌకకూ ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఇప్పుడా నౌక మార్కెట్లో అంత రేటు పలుకుతోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న 127 అడుగుల పొడవైన ఆ నౌక... ఆన్ బోర్డ్ బార్ తో పాటు.. పై భాగంలో సుమారు అరవైమంది కూర్చో గలిగే జుకౌజీ డెక్ ను కూడ కలిగి ఇప్పటికీ రాజసాన్ని ఒలికిస్తోంది. 1936 లో నిర్మించిన ఈ నౌక.. అనంతరం యుద్ధకాలంలో ప్రధాని ఏర్పాటు తర్వాత 4,000 నాటికన్ మైళ్ళు ప్రయాణించింది. అయితే 1990, 2005 సమయంలో ఇది తీవ్ర మరమ్మత్తులకు లోనైంది. ఈ నౌకను మొదట్లో అమెజాన్ అని పిలిచేవారు. ఆ తర్వాత వెల్ష్ లిబర్టీ దీనికి 'మై అవెంజిలిన్' అని పేరు పెట్టుకున్నారు. ఏడువందల హార్స్ పవర్ కలిగిన రెండు ఇంజన్లతోపాటు... 2 మిలియన్ యూరోల ఖరీదు చేసే ఓ మీటింగ్ హాలు, ఓ కార్యాలయం, పెద్ద లాంజ్ ఏరియా, కెప్టెన్ రూమ్, సన్ బాత్ ఏరియాలు ఈ నౌకలో నెలకొని ఉన్నాయి. ఇవి చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. చర్చిల్ క్యూబాలో నివశించే సమయంలో ఆయన అలవాట్లైన హవానా సిగార్లు, సన్ బాత్ లాంజ్ లు ఈ నౌకలో ఆయన చిరకాల జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. 1940 లో ప్రధానమంత్రి అయిన చర్చిల్... ఆ తర్వాత... అపురూప అందాల అమెజాన్ నౌకను వీడి.. క్రిస్టినా అనే మరో కొత్త మోడల్ నౌకను ఎంచుకున్నారు. -
2500 కోట్లతో భారీ పడవ కొన్న దంపతులు!
హాలీవుడ్ దంపతులు బ్రాడ్ పిట్, యాంజెలీనా జోలీ ఓ విలాసవంతమైన పడవ కొన్నారు. దాని విలువ దాదాపు 2500 కోట్లు! దాన్ని మరో రెండు కోట్లు వెచ్చించి తమకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేయించుకున్నారు. విలాసవంతంగా.. నీళ్లమీద తేలియాడే ప్యాలెస్ లాంటి ఈ పడవలో అత్యద్భుతంగా ఉండే ఇటాలియన్ మార్పుల్ వాడతారు. ఇటాలియన్ కంపెనీ రిజార్డీ ఈ పడవను తయారుచేసింది. డిజిటల్ కెమెరాలను అడ్డుకునే ప్రత్యేక టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. అంటే.. ఇందులో ఉన్నవాళ్లను ఫొటో తీయడం దాదాపు అసాధ్యం అన్నమాట 50 ఏళ్ల బ్రాడ్ పిట్, 39 ఏళ్ల యాంజెలీనా జోలీ ప్రస్తుతం మాల్టాలో ఓ సినిమా షూటింగులో ఉన్నారు. గత నెలలో ఫ్రాన్సులో వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.