న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మొత్తం స్టీల్‌తో ఓ బోటును (యాట్)ను తయారు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కొనసాగుతున్న 60వ ఫోర్ట్ లాడర్ డేల్ అంతర్జాతీయ బోట్ల ప్రదర్శనలో ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. తొమ్మిది వేల చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బోటును ‘మాన్షన్ యాట్’గా నామకరణం చేశారు.
ఇందులో ఐదు బెడ్ రూమ్‌లు, ఐదు బాత్ రూమ్‌లు ఉండగా, పలు ఇండోర్, అవుట్ డోర్ సిట్టింగ్‌లు ఉన్నాయి. పూర్తి స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఈ బోటు నిర్వహణ ఖర్చు ఫైబర్ గ్లాస్‌తోని తయారు చేసిన బోట నిర్వహణ ఖర్చుకన్నా 25 శాతం తక్కువని బోటు యజమాని బ్రూనో ఎడ్‌వర్డ్స్ తెలిపారు. దీన్ని కొనుగోలు చేసేందుకు పలువురు వ్యాపారులు పోటీ పడుతున్నారని చెప్పారు. అయితే దాని వెలెంతో చెప్పలేదు.
40 అడుగుల వెడల్పూ, 85 అడుగుల పొడువు కలిగిన ఈ బోటులో 145 మంది హాయిగా ప్రయాణం చేయవచ్చని బ్రూనో ఎడ్‌వర్డ్స్ తెలిపారు. దీన్ని ప్రస్తుతం నీటికి 18 అడుగులపైన, నాలుగు హైడ్రాలిక్ పిల్లర్లపై అమర్చి ప్రదర్శనకు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment