ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా ఉపయోగించే నౌక. దీని పేరు ‘కొసాత్కా’– అంటే ‘కిల్లర్ వేల్’ జాతి తిమింగలం అని అర్థం. పుతిన్ దాదాపుగా మూడేళ్ల కిందటే ఈ భారీ నౌకను సొంతం చేసుకున్నా, ఇటీవలే దీనికి కళ్లుచెదిరే ఖర్చుతో అదనపు హంగులు సమకూర్చడంతో తాజాగా వార్తల్లోకెక్కింది. ఈ నౌకలోని అదనపు హంగుల కోసం 100 మిలియన్ పౌండ్లు (రూ.1.05 లక్షల కోట్లు) ఖర్చు చేయడం విశేషం. ఒకవైపు యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో దాదాపు మూడు లక్షల మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఏమీ పట్టకుండా పుతిన్ తన నౌకను రాజసంగా తీర్చిదిద్దుకోవడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.
ఈ నౌక అసలు పేరు ‘ది గ్రేస్‌ఫుల్’. జర్మనీ రేవు నుంచి పుతిన్ దీనిని 750 మిలియన్ పౌండ్లకు (రూ.7.92 లక్షల కోట్లు) సొంతం చేసుకున్నాక, దీని పేరును ‘కొసాత్కా’గా మార్చుకున్నాడు. యుక్రెయిన్‌పై సైనిక దాడిని ప్రకటించడానికి కొద్దిరోజుల ముందే ఈ నౌకను రష్యాకు పంపాల్సిందిగా, నౌకా సంస్థను ఆదేశించాడు. ఈ నౌక రష్యా తీరానికి చేరుకున్న 23 రోజుల్లోనే యుద్ధం మొదలైంది. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంటే, పుతిన్ మాత్రం ఈ నౌకను తాను కోరుకున్న రీతిలో తీర్చిదిద్దుకునే పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇందులో ఖరీదైన క్రిస్టల్ షాండ్లియర్లు, కార్పెట్లు, సోఫాలు, కాఫీ టేబుళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా డ్రాయింగ్ రూమ్‌లలో బంగారు తాపడం చేయించాడు.
ఖరీదైన కళాఖండాలను ఏర్పాటు చేయించుకున్నాడు. ఇన్ని హంగులు చేయించుకున్న ఈ నౌక పొడవు దాదాపు అరకిలోమీటరు ఉంటుంది. ఇందులో స్విమింగ్ పూల్స్, పైకప్పు మీద హెలిపాడ్, బంగారు ఫ్రేముల అద్దాలు, బంగారు తాపడం చేయించిన సింక్ పైపులు వంటి ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. రష్యన్ అధికార వ్యతిరేక సంస్థ అయిన ‘అలెక్సీ నవాల్నీ’ ఈ నౌక లోపలి హంగుల ఫొటోలను, వాటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల వివరాలను ఇటీవల వెలుగులోకి తెచ్చింది.
(చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు! పొద్దుగూకినా ప్రాబ్లం లేదు!)
Comments
Please login to add a commentAdd a comment