అమ్మకానికి చర్చిల్ నౌక! | Winston Churchill's luxury yacht goes on sale in France for £1.5million | Sakshi
Sakshi News home page

అమ్మకానికి చర్చిల్ నౌక!

Published Wed, Jan 13 2016 8:05 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

Winston Churchill's luxury yacht goes on sale in France for £1.5million

బ్రిటన్ మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, చరిత్రకారుడు సర్ విన్ స్టన్ చర్చిల్ కు చెందిన విహారనౌకను అమ్మకానికి పెట్టారు. అత్యంత విలాసవంతమైన, రాజభోగాలు కలిగిన ఆ నౌక ఖరీదును 1.5 మిలియన్ యూరోలుగా నిర్ణయించారు. విన్ స్టన్ చర్చిల్ తో పాటు ఆయన వినియోగించిన ఆ నౌకకూ ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఇప్పుడా నౌక మార్కెట్లో అంత రేటు పలుకుతోంది.

ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న 127 అడుగుల పొడవైన ఆ నౌక... ఆన్ బోర్డ్ బార్ తో పాటు.. పై భాగంలో సుమారు అరవైమంది కూర్చో గలిగే జుకౌజీ డెక్ ను కూడ కలిగి ఇప్పటికీ రాజసాన్ని ఒలికిస్తోంది. 1936 లో నిర్మించిన ఈ నౌక.. అనంతరం యుద్ధకాలంలో ప్రధాని ఏర్పాటు తర్వాత 4,000 నాటికన్ మైళ్ళు ప్రయాణించింది. అయితే 1990, 2005 సమయంలో ఇది తీవ్ర మరమ్మత్తులకు లోనైంది. ఈ నౌకను మొదట్లో అమెజాన్ అని పిలిచేవారు. ఆ తర్వాత వెల్ష్ లిబర్టీ దీనికి  'మై అవెంజిలిన్' అని పేరు పెట్టుకున్నారు.

ఏడువందల హార్స్ పవర్ కలిగిన రెండు ఇంజన్లతోపాటు... 2 మిలియన్ యూరోల ఖరీదు చేసే ఓ మీటింగ్ హాలు, ఓ కార్యాలయం, పెద్ద లాంజ్ ఏరియా, కెప్టెన్ రూమ్, సన్ బాత్ ఏరియాలు ఈ నౌకలో నెలకొని ఉన్నాయి. ఇవి చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. చర్చిల్ క్యూబాలో నివశించే సమయంలో ఆయన అలవాట్లైన హవానా సిగార్లు, సన్ బాత్ లాంజ్ లు ఈ నౌకలో ఆయన చిరకాల జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. 1940 లో ప్రధానమంత్రి అయిన చర్చిల్... ఆ తర్వాత... అపురూప అందాల అమెజాన్ నౌకను వీడి.. క్రిస్టినా అనే మరో కొత్త మోడల్ నౌకను ఎంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement