Churchill
-
వివాదం ఇంకా ఉంది!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐ–లీగ్ చాంపియన్‌షిప్‌లో చర్చిల్ బ్రదర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌ను విజేతగా అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించడంపై అంతర్జాతీయ స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టు (సీఏఎస్) స్టే విధించింది. కేసులో విచారణ ముగిసేవరకు టైటిల్ చాంప్‌పై ఓ నిర్ణయానికి రావొద్దని సీఏఎస్ డివిజన్ డిప్యూటీ ప్రెసిడెంట్ మధ్యంతర తీర్పు ఇచ్చారు. ఈ సీజన్ ఐ–లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇంటర్ కాశీ జట్టు తమకు సంబంధించిన ఒక మ్యాచ్ ఫలితంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించకుండానే ఏఐఎఫ్ఎఫ్ ఏకపక్షంగా చర్చిల్ బ్రదర్స్ జట్టును విజేతగా ప్రకటించడం అసంబద్ధమని కోర్టుకెక్కింది. దీనిపై ఆదివారం విచారించిన సీఏఎస్ డివిజన్ ఏఐఎఫ్ఎఫ్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. జట్టు సభ్యులకు పతకాలు గానీ, ట్రోఫీని గానీ బహూకరించరాదని స్పష్టం చేసింది. ప్రతివాదులైన విజేత జట్టు చర్చిల్ బ్రదర్స్ యాజమాన్యం, ఏఐఎఫ్ఎఫ్లకు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 29 వరకు గడువిచ్చింది. కానీ జరగాల్సిన తంతు ఆదివారమే జరిగిపోవడంతో ఇప్పుడు ఏఐఎఫ్ఎఫ్ నవ్వులపాలైంది. వివాదం ఉన్న సంగతిని ఏమాత్రం పట్టించుకోని ఏఐఎఫ్ఎఫ్ అత్యుత్సాహానికి పోయి ఆదివారం విజేత జట్టుకు ట్రోఫీని, పతకాలను బహూకరించింది. అయితే తుదితీర్పుకు లోబడే తమ నిర్ణయముంటుందని, అప్పుడు ట్రోఫీని, పతకాలను వెనక్కి తీసుకుంటామని ముక్తాయించిన తీరు సర్వత్రా విమర్శల పాలైంది. ఏమిటీ వివాదం! ఐ–లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో నాకౌట్ పోటీలు, ఫైనల్ మ్యాచ్ అనేవి ఉండవు. మొత్తం పాల్గొన్న జట్లలో సాధించిన విజయాలు, కొట్టిన గోల్స్, ఇచ్చిన గోల్స్ ఆధారంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో 40 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చర్చిల్ బ్రదర్స్‌ను ఏఐఎఫ్ఎఫ్ విజేతగా ప్రకటించింది. కానీ 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఇంటర్ కాశీ జట్టుకు అంతకుముందు నాంధారి జట్టుతో జరిగిన మ్యాచ్ ఫలితం వివాదం రేపింది. ఈ మ్యాచ్‌లో ఇంటర్ కాశీ జట్టు 2–0తో నాంధారి జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అనర్హతకు గురైన ఆటగాడితో మ్యాచ్ ఆడించినందు వల్ల నాంధారి జట్టుపై పెనాల్టీ విధించి ఫలితాన్ని తమకు అనుకూలంగా ఇవ్వాలని ఇంటర్ కాశీ కోరింది. ఒకవేళ తీర్పు ఇంటర్ కాశీ జట్టుకు అనుకూలంగా వస్తే ఆ జట్టు 42 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్‌గా అవతరిస్తుంది. -
ఐ–లీగ్ చాంపియన్ చర్చిల్ బ్రదర్స్ఎఫ్సీ
న్యూఢిల్లీ: ఐ–లీగ్ 2024–2025 సీజన్లో గోవాకు చెందిన చర్చిల్ బ్రదర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకున్న చర్చిల్ బ్రదర్స్ జట్టు 40 పాయింట్లతో అగ్రస్థానంతో లీగ్‌ను ముగించింది. తాజా సీజన్లో 22 మ్యాచ్‌లాడిన చర్చిల్ బ్రదర్స్ జట్టు 11 విజయాలు, 4 పరాజయాలు, 7 ‘డ్రా’లు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో మొత్తం 45 గోల్స్ చేసిన ఆ జట్టు... ప్రత్యర్థులకు 25 గోల్స్ ఇచ్చుకుంది. శ్రీనగర్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో చర్చిల్ బ్రదర్స్ జట్టు తరఫున రఫీఖ్ అమిను (50వ నిమిషంలో) ఏకైక గోల్ కొట్టగా... రియల్ కశ్మీర్ జట్టు తరఫున రామ్సంగ ట్లైచున్ (8వ నిమిషంలో) గోల్ చేశాడు. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్‌లో ఇంటర్ కాశీ జట్టు 3–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. ఈ సీజన్లో ఇంటర్ కాశీ జట్టు 22 మ్యాచ్‌లాడి 11 విజయాలు, 5 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 39 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయంపై ఉత్కంఠ ఐ–లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే అర్హత సాధిస్తుంది. ప్రస్తుతానికి చర్చిల్ బ్రదర్ జట్టు ‘టాప్’లో ఉన్నప్పటికీ... సీజన్లో భాగంగా జనవరి 13న నామ్ధారి స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్హత లేని ఆటగాడిని బరిలోకి దింపారని ఇంటర్ కాశీ జట్టు ఆరోపించింది. ఈ అంశంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఈ నెల 28న విచారణ చేపట్టనుంది. ఒకవేళ నిర్ణయం ఇంటర్ కాశీకి అనుకూలంగా వస్తే... మరో 3 పాయింట్లు వారి ఖాతాలో చేరనున్నాయి. అప్పుడు ఆ జట్టు 42 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానికి చేరనుంది. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్‌లో డెంపో స్పోర్ట్స్ క్లబ్ 4–3 గోల్స్ తేడాతో గోకులం కేరళ జట్టుపై గెలుపొందింది. శ్రీనిధి డెక్కన్ జట్టుకు తొమ్మిదో స్థానం మొత్తం 12 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్లో 22 మ్యాచ్‌లాడిన శ్రీనిధి జట్టు 7 విజయాలు, 8 పరాజయాలు, 7 ‘డ్రా’లతో 28 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 2021–2022 సీజన్లో మూడో స్థానం, 2022–2023 సీజన్లో రెండో స్థానం, 2023–2024 సీజన్లో రెండో స్థానం పొందిన శ్రీనిధి డెక్కన్ జట్టు ఈసారి మాత్రం నిరాశపరిచింది. -
వినేదీ నేనే అనుకుంటా!
అలనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ గొప్ప ఉపన్యాసకుడు. ఓమారు ఆయనను కలిసిన ఒకరు – వేదికపై అంత సరళంగా తేలికగా ఎలా మాట్లాడగలుగుతున్నారు. మీ మాటల్లో తడబాటు కానీ భయం కానీ కనిపించవు. కారణమేంటీ అని అడిగారు. దానికి ఆయన ఇలా జవాబిచ్చారు.... ‘‘నేను వేదిక ఎక్కినప్పుడే కాదు ఏదైనా సభలోనో సమావేశంలోనో నేను మాట్లాడటం మొదలుపెట్టడంతోనే నా ముందున్న వారందరూ తెలివిలేని వారని అనుకుంటాను. దాంతో నాకు మాట్లాడుతున్నప్పుడు భయం అనిపించదు అని చెప్పారు చర్చిల్.ఇటువంటి ప్రశ్ననే ఓసారి ఓ జెన్ గురువుని ఒకరడిగారు. ఎందుకంటే ఆయన కూడా ఎవరితో అయినా సరే ఏ మాత్రం తొణక బెణకక మాట్లాడుతారు. తననడిగిన ప్రశ్నకు ఆ జెన్ గురువు ఇలా జవాబిచ్చారు....నేను మాట్లాడుతున్నప్పుడల్లా నా ఎదుట నేనే కూర్చున్నట్లు భావిస్తాను. ప్రేక్షకులందరినీ నేనే అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు ఇక నాకెందుకు భయం కలుగుతుంది. ఏ మాత్రం జంకూ బొంకూ లేకుండా చెప్పదలచుకున్నది చెప్పేస్తాను. చెప్పేదీ నేనే వినేదీ నేనే అని అనుకున్నప్పుడు ఇక భయాలెందుకుంటాయి అని ఆయన ఎదురు ప్రశ్నించారు.... ప్రాక్ పశ్చిమ దేశాలలో ఉన్న తేడా ఇదే. ఎదుటివారిని తెలివిలేనివారిగా అనుకోవడానికీ, అంతా తానే అనుకోవడానికి మానసికంగా ఎంత తేడా ఉందో కదూ.... – యామిజాల జగదీశ్ -
నాడు చర్చిల్ ఏమన్నారంటే..
లండన్: యూరోపియన్ యూనియన్ ఏర్పడాలనే ఆకాంక్ష సాకారమైంది 1993, నవంబర్ ఒకటవ తేదీనే కావచ్చు. ఆకాంక్షకు అంకురార్పణ జరిగింది మాత్రం 1948లోనే. నెదర్లాండ్స్‌లోని ఫ్రాగ్ సిటీలో జరిగిన యూరప్ కాంగ్రెస్‌లో బ్రిటిన్ మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ ప్రసంగిస్తూ యూరప్ దేశాలన్నీ ఒకటి కావాలని, ‘యూనెటైడ్ యూరప్’ అంటూ తొలిసారిగా పిలుపునిచ్చారు. అందుకు యూరప్ దేశాల నుంచి కాంగ్రెస్‌కు హాజరైన 20 మంది దేశాధినేతల్లో ఎక్కువ మంది అందుకు అంగీకరించారు. ‘యూరప్ దేశాలన్నీ ఒకటికావాలంటే అందుకు బలమైన ఆకాంక్ష ఉండాలి. స్వేచ్ఛను ప్రేమించే అన్ని దేశాల ప్రజలు, రాజకీయ పార్టీల్లో మెజారిటీ సభ్యులు మనస్ఫూర్తిగా ఐక్యతకు కోరుకోవాలి. ఓటు ఎటు వేస్తారన్నది అప్రస్తుతం. యూరప్ అంతా ఒక్కటి కావాలనే లక్ష్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. అప్పుడే ఏదోరోజు మనమంతా ఒక్కటవుతాం. ఆ రోజు కోసం నిరీక్షిద్దాం’ అని చర్చిల్ సభా ముఖంగా మాట్లాడారు. యూరప్ ఒకటికావాలనే ఆకాంక్ష వ్యక్తం కావడమే కాకుండా కార్యరూపం దాల్చింది కూడా నెదర్లాండ్స్‌లోనే అవడం ఓ విశేషం. వాస్తవానికి ఆ నాటి యూరప్ సభను ప్రత్యేకంగా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దానికి అధికారిక గుర్తింపు కూడా లేదు. కొన్ని యూరప్ దేశాలు అప్పటికప్పుడు అనుకొని సమావేశమయ్యాయి. భారత్ నుంచి 1948లో బ్రిటీష్ సైన్యాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది. భారత్ నుంచి ఈ సైనిక ఉపసంహరణ యూరప్ కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకే ‘బ్రిటీష్ పాతే’ అనే బ్రాడ్‌క్యాస్టింగ్ సంస్థ చర్చిల్ ప్రసంగాన్ని రికార్డు చేసింది. భారత్ నుంచి బ్రిటీష్ సైన్యాన్ని ఉపసంహరించుకున్న చారిత్రక నేపథ్యం లేకపోయినట్లయితే చర్చిల్ ప్రసంగాన్ని వీడియో తీసేవారే కాదు. అప్పుడు చర్చిల్ యూరోపియన్ యూనియన్ గురించి ఏమన్నారో కూడా మనకు తెలిసేకాదు. ఇప్పుడు బ్రిటన్ పౌరులు బ్రెక్జిట్కు ఓటేసిన సందర్భంలో చర్చిల్ బతికి ఉంటే ఆయన ఎలా స్పందించేవారో! -
అమ్మకానికి చర్చిల్ నౌక!
బ్రిటన్ మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, చరిత్రకారుడు సర్ విన్ స్టన్ చర్చిల్ కు చెందిన విహారనౌకను అమ్మకానికి పెట్టారు. అత్యంత విలాసవంతమైన, రాజభోగాలు కలిగిన ఆ నౌక ఖరీదును 1.5 మిలియన్ యూరోలుగా నిర్ణయించారు. విన్ స్టన్ చర్చిల్ తో పాటు ఆయన వినియోగించిన ఆ నౌకకూ ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఇప్పుడా నౌక మార్కెట్లో అంత రేటు పలుకుతోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న 127 అడుగుల పొడవైన ఆ నౌక... ఆన్ బోర్డ్ బార్ తో పాటు.. పై భాగంలో సుమారు అరవైమంది కూర్చో గలిగే జుకౌజీ డెక్ ను కూడ కలిగి ఇప్పటికీ రాజసాన్ని ఒలికిస్తోంది. 1936 లో నిర్మించిన ఈ నౌక.. అనంతరం యుద్ధకాలంలో ప్రధాని ఏర్పాటు తర్వాత 4,000 నాటికన్ మైళ్ళు ప్రయాణించింది. అయితే 1990, 2005 సమయంలో ఇది తీవ్ర మరమ్మత్తులకు లోనైంది. ఈ నౌకను మొదట్లో అమెజాన్ అని పిలిచేవారు. ఆ తర్వాత వెల్ష్ లిబర్టీ దీనికి 'మై అవెంజిలిన్' అని పేరు పెట్టుకున్నారు. ఏడువందల హార్స్ పవర్ కలిగిన రెండు ఇంజన్లతోపాటు... 2 మిలియన్ యూరోల ఖరీదు చేసే ఓ మీటింగ్ హాలు, ఓ కార్యాలయం, పెద్ద లాంజ్ ఏరియా, కెప్టెన్ రూమ్, సన్ బాత్ ఏరియాలు ఈ నౌకలో నెలకొని ఉన్నాయి. ఇవి చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. చర్చిల్ క్యూబాలో నివశించే సమయంలో ఆయన అలవాట్లైన హవానా సిగార్లు, సన్ బాత్ లాంజ్ లు ఈ నౌకలో ఆయన చిరకాల జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. 1940 లో ప్రధానమంత్రి అయిన చర్చిల్... ఆ తర్వాత... అపురూప అందాల అమెజాన్ నౌకను వీడి.. క్రిస్టినా అనే మరో కొత్త మోడల్ నౌకను ఎంచుకున్నారు.