Winston
-
వినేదీ నేనే అనుకుంటా!
అలనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ గొప్ప ఉపన్యాసకుడు. ఓమారు ఆయనను కలిసిన ఒకరు – వేదికపై అంత సరళంగా తేలికగా ఎలా మాట్లాడగలుగుతున్నారు. మీ మాటల్లో తడబాటు కానీ భయం కానీ కనిపించవు. కారణమేంటీ అని అడిగారు. దానికి ఆయన ఇలా జవాబిచ్చారు.... ‘‘నేను వేదిక ఎక్కినప్పుడే కాదు ఏదైనా సభలోనో సమావేశంలోనో నేను మాట్లాడటం మొదలుపెట్టడంతోనే నా ముందున్న వారందరూ తెలివిలేని వారని అనుకుంటాను. దాంతో నాకు మాట్లాడుతున్నప్పుడు భయం అనిపించదు అని చెప్పారు చర్చిల్.ఇటువంటి ప్రశ్ననే ఓసారి ఓ జెన్ గురువుని ఒకరడిగారు. ఎందుకంటే ఆయన కూడా ఎవరితో అయినా సరే ఏ మాత్రం తొణక బెణకక మాట్లాడుతారు. తననడిగిన ప్రశ్నకు ఆ జెన్ గురువు ఇలా జవాబిచ్చారు....నేను మాట్లాడుతున్నప్పుడల్లా నా ఎదుట నేనే కూర్చున్నట్లు భావిస్తాను. ప్రేక్షకులందరినీ నేనే అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు ఇక నాకెందుకు భయం కలుగుతుంది. ఏ మాత్రం జంకూ బొంకూ లేకుండా చెప్పదలచుకున్నది చెప్పేస్తాను. చెప్పేదీ నేనే వినేదీ నేనే అని అనుకున్నప్పుడు ఇక భయాలెందుకుంటాయి అని ఆయన ఎదురు ప్రశ్నించారు.... ప్రాక్ పశ్చిమ దేశాలలో ఉన్న తేడా ఇదే. ఎదుటివారిని తెలివిలేనివారిగా అనుకోవడానికీ, అంతా తానే అనుకోవడానికి మానసికంగా ఎంత తేడా ఉందో కదూ.... – యామిజాల జగదీశ్ -
ఫిజీని వణికిస్తున్న తుఫాను
సువా: పసిఫిక్ దక్షిణ ప్రాంత దీవుల సముదాయం ఫిజీ దేశాన్ని అత్యంత బలమైన తుఫాను 'విన్స్టన్' వణికిస్తోంది. గతవారం టోంగా దీవులను తాకిన ఈ తుఫాను తిరిగి తీవ్రరూపం దాల్చి ఫిజీ రాజధాని సువా దిశగా దూసుకొస్తోంది. తుఫాను దాటికి శనివారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. విన్స్టన్ ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు ఫిజీ వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని విమానసర్వీసులను రద్దు చేశారు. ఫిజీ ప్రధాని బైనీమరామ ప్రజలను సురక్షితంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తుఫాను ప్రభావానికి గురికానున్న పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశ వ్యాప్తంగా 758 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజధాని సువా ప్రాంతంలో తుఫాను అత్యధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. పసిఫిక్ దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అత్యంత బలమైన తుఫానుగా యూఎన్ వాతావరణ విభాగం 'విన్స్టన్'ను పేర్కొంది. -
అమ్మకానికి చర్చిల్ నౌక!
బ్రిటన్ మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, చరిత్రకారుడు సర్ విన్ స్టన్ చర్చిల్ కు చెందిన విహారనౌకను అమ్మకానికి పెట్టారు. అత్యంత విలాసవంతమైన, రాజభోగాలు కలిగిన ఆ నౌక ఖరీదును 1.5 మిలియన్ యూరోలుగా నిర్ణయించారు. విన్ స్టన్ చర్చిల్ తో పాటు ఆయన వినియోగించిన ఆ నౌకకూ ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఇప్పుడా నౌక మార్కెట్లో అంత రేటు పలుకుతోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న 127 అడుగుల పొడవైన ఆ నౌక... ఆన్ బోర్డ్ బార్ తో పాటు.. పై భాగంలో సుమారు అరవైమంది కూర్చో గలిగే జుకౌజీ డెక్ ను కూడ కలిగి ఇప్పటికీ రాజసాన్ని ఒలికిస్తోంది. 1936 లో నిర్మించిన ఈ నౌక.. అనంతరం యుద్ధకాలంలో ప్రధాని ఏర్పాటు తర్వాత 4,000 నాటికన్ మైళ్ళు ప్రయాణించింది. అయితే 1990, 2005 సమయంలో ఇది తీవ్ర మరమ్మత్తులకు లోనైంది. ఈ నౌకను మొదట్లో అమెజాన్ అని పిలిచేవారు. ఆ తర్వాత వెల్ష్ లిబర్టీ దీనికి 'మై అవెంజిలిన్' అని పేరు పెట్టుకున్నారు. ఏడువందల హార్స్ పవర్ కలిగిన రెండు ఇంజన్లతోపాటు... 2 మిలియన్ యూరోల ఖరీదు చేసే ఓ మీటింగ్ హాలు, ఓ కార్యాలయం, పెద్ద లాంజ్ ఏరియా, కెప్టెన్ రూమ్, సన్ బాత్ ఏరియాలు ఈ నౌకలో నెలకొని ఉన్నాయి. ఇవి చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. చర్చిల్ క్యూబాలో నివశించే సమయంలో ఆయన అలవాట్లైన హవానా సిగార్లు, సన్ బాత్ లాంజ్ లు ఈ నౌకలో ఆయన చిరకాల జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. 1940 లో ప్రధానమంత్రి అయిన చర్చిల్... ఆ తర్వాత... అపురూప అందాల అమెజాన్ నౌకను వీడి.. క్రిస్టినా అనే మరో కొత్త మోడల్ నౌకను ఎంచుకున్నారు. -
లావూ... సన్నం!
అందం-ఆరోగ్యం ‘‘అమె అందంగా ఉంది’’ ... గొణిగాడు విన్స్టన్. ‘‘నడుము చూశావా! చుట్టుకొలత ఈజీగా మీటరు ఉంటుంది’’... ఈర్ష్యగా పుల్ల విరిచింది జూలియా. ‘‘అదే ఆమె అందం’’ అన్నాడు విన్స్టన్. జార్జి ఆర్వెల్ రాసిన ఓ నవల్లోని పాత్రలు విన్స్టన్, జూలియా. మధ్యలో ఆ పెద్ద నడుము స్త్రీ ఎవరు? ఆమె కూడా ఒక పాత్రే. ‘లావు’ అని జూలియా ఆమెను తేలికచేసి పడేస్తే, ‘లావే అందం’ అని విన్స్టన్ మెస్మరైజ్ అయ్యాడు. ఆ సాయంత్రం... బ్రిటిస్ బుక్ అవార్డ్స్ ఫంక్షన్‌కి వెళ్లొస్తున్నారు జేకే రోలింగ్. సడెన్‌గా పాత ఫ్రెండ్ ఎదురైంది. ‘‘హే, రోల్! ఏంటి ఇంతలా చిక్కిపోయావ్?’’. ఫ్రెండ్ చూపుల్లో ఆశ్చర్యం. రోలింగ్, ఆ పాత ఫ్రెండ్ కలుసుకుని మూడేళ్లయింది.‘హ్యారీ పోట్టర్’ వంటి గొప్ప ఫిక్షన్ సీరీస్‌ను రాసిన రోలింగ్‌కి ఏం చెప్పాలో తెలీలేదు. ‘‘అప్పుడు పిల్ల తల్లిని కదా’’ అంది. తర్వాత అనుకుంది... ‘‘ఈ మూడేళ్లలోనూ నేనో బిడ్డకు జన్మనిచ్చాను. నా ఆరో నవల రాశాను’’ అని చెప్పి ఉండాల్సిందని. ‘‘సైజు తప్ప మనిషిలో మనిషికి ఆసక్తిరమైనవి ఏవీ ఉండవా!’’.. ఇంటికొచ్చాక నిలువుటద్దంలో చూసుకుంటూ అనుకుంది రోలింగ్. తన ఫ్రెండ్ అన్నమాట నిజమే. నడుము బాగా చిక్కిపోయింది. అంటే సన్నబడింది. రోలింగ్ తన మూడో బిడ్డను, ఆరో పుస్తకాన్ని పక్కనపెట్టి సన్నబడడాన్ని తన మనసు సెలబ్రేట్ చేసుకోడాన్ని ఆమె గమనించింది. మార్లిన్ మన్రో. ఆమెరికన్ యాక్ట్రెస్, మోడల్, సింగర్... అన్నిటినీ మించి తన కాలపు సెక్స్ సింబల్. ఆమె ఎలా నవ్వితే అది అందం. ఎలా నడిస్తే అది ట్రెండ్. ఏం వేసుకున్నా, వేసుకోకపోయినా అది ఫ్యాషన్. ఆడామగా అన్న తేడా లేకుండా అందరి ఆరాధ్య దేవత. ఆమె ఏం మాట్లాడితే అది వేదం. ‘‘లావుగా ఉండడంలో ఒక్క సంతోషకరమైన సంగతి కూడా లేదు. అయినా సమాజం మనల్ని సన్నగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు అలా కాకుండా వేరేలా ఎలా ఉండగలం? సన్నగా ఉంటే అందంగా ఉంటాం. అందంగా ఉంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. నా జీవితంలో నేను ఒక్కరోజు కూడా ఫ్యాటీగా లేను. ఫ్యూచర్లో కూడా ఫ్యాటీగా ఉండబోను’’... ఈ మాటలు మన్రోవి. ఇంతకీ లావా? సన్నమా? ఏది అందం? బరువు పెరగడమా? బక్కచిక్కడమా? ఏది అందం? ఫ్యాటీగా లేకపోవడమే అందమా? లావూ, సన్నం రెండూ అందమే అంటున్నారు యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వైద్య పరిశోధకులు. అయితే లావుగా ఉండేవారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలట!