దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్' ఫౌండర్ 'జెఫ్ బెజోస్' (Jeff Bezos) తమ కంపెనీలో ఉద్యోగం మానేయాలనుకునే వారికి 5000 డాలర్లు ఆఫర్ చేస్తూ ఓ సంచలన ప్రకటన చేశారు. ఊహూ... సంస్థకు ఉపయోగడరని భావిస్తున్న ఉద్యోగులను వదిలించుకునేందుకు కాదీ ప్రకటన. ఉద్యోగుల్లో సంస్థపట్ల ఎంతమందికి విధేయత కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు వేసిన ఎత్తుగడ. అదెలాగంటరా... ? చదివేయండి!
ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన అమెజాన్ ఈ రోజు ఈ కామర్స్ విభాగంలో తిరుగులేని కంపెనీగా అవతరించింది. యజమాని జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా మారాడు. అసాధారణ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న బెజోస్ 2014లో మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి, కంపెనీ పట్ల విధేయత కలిగినవారి కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.
ప్రారంభంలో ఈ ఆఫర్ కింద స్వచ్చందంగా జాబ్ వదిలేసేవారికి 2000 డాలర్లు ఇస్తామని ప్రకటించారు, ఆ తరువాత ఈ మొత్తాన్ని 3000 డాలర్లకు పెంచారు, ఇప్పుడు అది 5000 డాలర్లకు చేరింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువ.
ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో
ఈ ఆఫర్ ప్రకటించిన సందర్భంగా 'Please Don’t Take This Offer' అని కోరడం విశేషం. సంస్థలో అందరూ ఉండాలని, ఈ ఆఫర్ ఎవరూ స్వీకరించరని భావిస్తున్నట్లు జెఫ్ బెజోస్ ప్రస్తావించారు. ఇలాంటి ఆఫర్ లాస్ ఏంజెలస్‌కు చెందిన ఆన్‌లైన్ రిటైలర్ 'జప్పోస్' మొదట ప్రారంభించింది. ఆ తరువాత బెజోస్ మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment