మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్'.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత స్థానాల్లో జుకర్‌బర్గ్, బెజోస్ ఉన్నారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇలాన్ మస్క్ నికర విలువ రూ. 256 బిలియన్ డాలర్స్, జుకర్‌బర్గ్ నికర విలువ 206 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ విలువ 205 బిలియన్ డాలర్లు. మెటా ప్లాట్‌ఫామ్ షేర్లు పెరగడంతో.. మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.
నికర విలువ పరంగా జుకర్‌బర్గ్.. బెజోస్ కంటే 1.1 బిలియన్ డాలర్ల ముందు, టెస్లా సీఈఓ కంటే 50 బిలియన్ల వెనుకంజలో ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా.. బెర్నార్డ్ ఆర్నాల్ట్, లారీ ఎల్లిసన్, బిల్ గేట్స్, లారీ పేజీ, స్టీవ్ బాల్మెర్, వారెన్ బఫెట్, సెర్గీ బ్రిన్ వరుస పది స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి: కేంద్రం శుభవార్త.. ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్
ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో భారతీయులు
ప్రపంచ ధనవంతుల జాబితాలో భారతీయ ధనవంతులైన ముకేశ్ అంబానీ 14వ స్థానంలో, గౌతమ్ ఆదానీ 17వ స్థానంలో ఉన్నారు. 37వ స్థానంలో శివ నాడార్, 38వ స్థానంలో షాపూర్ మిస్త్రీ, సావిత్రి జిందాల్ 49వ స్థానంలో, 61వ స్థానంలో దిలీప్ శాంఘ్వీ, 62వ స్థానంలో అజీమ్ ప్రేమ్ జీ, సునీల్ మిట్టల్ 72వ స్థానంలో, 89వ స్థానంలో రాధాకిషన్ దమాని, 90వ స్థానంలో కుమార మంగళం బిర్లా, 97వ స్థానంలో లక్ష్మీ మిట్టల్, 100వ స్థానాల్లో సైరస్ పూనావల్ల ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment