Billionaire Jeff Bezos Spotted Wearing Only 12 Dollars Shirt At Coachella, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jeff Bezos: ప్రపంచంలో అత్యంత సంపన్నుడు..  మరీ ఇంత చవక షర్ట్‌ ఏంటి? వీడియో వైరల్‌..

Apr 26 2023 10:19 PM | Updated on Apr 27 2023 1:56 PM

Jeff Bezos spotted wearing only 12 dollars shirt at Coachella - Sakshi

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు జెఫ్‌ బెజోస్‌.  ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన కోచెల్లా మ్యూజిక్‌ ఫెస్టవల్‌కు ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ లారెన్‌ శాంచెజ్‌తోపాటు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన ధరించిన షర్ట్‌ చర్చనీయాశంగా మారింది.

 ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్‌! సెలవులు ఏయే రోజుల్లో అంటే..

ఏప్రిల్‌ 21 రాత్రి జరిగిన రాపర్‌ బాడ్‌ బన్నీ సంగీత కార్యక్రమానికి బెజోస్‌ హాజరైనట్లు కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. ఇందులో బెజోస్‌  బ్లూ కలర్‌ బటర్‌ఫ్లై ప్రింట్‌ ఉన్న షర్ట్‌ను ధరించారు. ఈ వీడియోలో బెజోస్‌ ధరించిన దుస్తుల వివరాలను నెటిజన్లు తవ్వితీశారు. అమెజాన్‌లో బెజోస్‌ ధరించిన షర్ట్‌ ధర 12 డాలర్లు (సుమారు రూ.980) కంటే తక్కువని తెలుసుకుని షాక్ అయ్యారు. అత్యంత సంపన్నుడు మరీ ఇంత  చవకైన చొక్కా ధరించాడేంటని ఆశ్చర్యపోతున్నారు.

 ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు

బెజోస్‌ ధరించిన షర్ట్‌ ధర తక్కువే అని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం బెజోస్‌ ధరించింది డిజైనర్‌ షర్ట్‌ అని, అమెజాన్‌లో ఉన్న తక్కువ ధరకు ఉన్న ఆ షర్ట్‌లు ఖరీదైన డిజైనర్ బ్రాండ్‌కు డూప్లికేట్‌ అని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement