Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్‌లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి! | Meet Bollywood Actress Who Wore Outfits Worth Over Rs 100 Crores At Cannes 2024 Red Carpet, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్‌లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!

Published Wed, May 29 2024 11:59 AM | Last Updated on Wed, May 29 2024 1:42 PM

 Meet Bollywood actress who wore outfits worth over Rs 100 crores at Cannes 2024

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినీ, ఫ్యాషన్‌ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 12-రోజుల ఈ వేడుకులో ఫ్యాషన్‌ స్టయిల్‌, బ్యూటిఫుల్‌ ఫ్యాషన్ గేమ్‌, లుక్స్‌తో అదరగొట్టేస్తున్నారు. 77వ కేన్స్‌ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, ప్రీతి జింటా, దీప్తి సాధ్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ తళుక్కున మెరిసారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికూడా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అయితే వీరిలో మరింత స్పెషల్‌గా నిలుస్తోంది నటి, మోడల్‌ ఊర్వశి రౌతేలా.

ఊర్వశీ రౌతేలా ఖరీదైన ఫ్యాషన్‌ దుస్తులతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ ధరలు ఏకంగా రూ.105 కోట్లు. ముఖ్యంగా ఫస్ట్ డే ధరించిన పూల పింక్ గౌన్ స్పెషల్‌గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ.47 కోట్లు అని తెలుస్తోంది. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు. సో.. మొత్తంగా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందనేది హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. 

ఐశ్వర్య, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రీతి జింటా లాంటి తారలు ధరించిన డ్రెస్‌ల ధరలు లక్షల్లో ఉంటుందిట. తరువాత రోజుల్లో కూడా తనదైన స్టయిల్‌లో అదర గొడుతోంది ఈ భామ.

👉:​​​​​​​ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement