Cannes Film Festival 2023: Anushka Sharma To Make Debut At Cannes Film Festival - Sakshi
Sakshi News home page

Cannes Film Festival 2023: కాన్స్‌ కాలింగ్‌

Published Sat, May 6 2023 4:30 AM | Last Updated on Sat, May 6 2023 8:29 AM

Cannes Film Festival 2023: Anushka Sharma to make debut at Cannes Film Festival - Sakshi

బాలీవుడ్‌ నటి – నిర్మాత అనుష్కా శర్మకు కాన్స్‌ నుంచి కాల్‌ వచ్చిందని బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.76వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు ఈ నెల 16 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ చిత్రోత్సవాల్లో ΄ాల్గొనవలసిందిగా జ్యూరీ నుంచి అనుష్కా శర్మకు ఆహ్వానం అందిందట.

ఈ వేడుకల్లో ‘టైటానిక్‌’ ఫేమ్‌ హాలీవుడ్‌ నటి కేట్‌ విన్స్‌లెట్‌తో కలిసి కొందరు మహిళా విజేతలకు అవార్డులు అందిస్తారట అనుష్కా శర్మ. ఇక గతంలో ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకోన్, సోనమ్‌ కపూర్, ఆలియా భట్‌ వంటి తారలు కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది తమన్నా, పూజా హెగ్డే వంటి తారలు కాన్స్‌ చిత్రోత్సవాల్లో మెరిశారు. ఈసారీ పలువురు నాయికలు అక్కడ సందడి చేసే చాన్స్‌ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement