Pakistan bans Holi in universities due to 'Erosion of Islamic Identity' - Sakshi
Sakshi News home page

అక్కడి యూనివర్సిటీల్లో హోలీ వేడుకలు నిషేధం..

Published Wed, Jun 21 2023 3:50 PM | Last Updated on Wed, Jun 21 2023 4:16 PM

Pakistan Bans Holi in Universities Due To Erosion Of Islamic Identity - Sakshi

విశ్వవిద్యాలయాల్లో హోలీ వేడుకల్ని నిషేధిస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల కారణంగా సామాజిక సంస్కృతిక విలువలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. దేశానికి ఉన్న ఇస‍్లామిక్ గుర్తింపునకు భంగం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో జూన్ 12న హోలీ వేడుకలు జరిగిన వీడియోలు నెట్టింట వైరల్‌ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. 

'వివిధ రకాల మత విశ్వాసాలు, ఆచారాలతో కూడిన వైవిధ్యత ఇతర మతాలను గౌరవించే సమాజాన్ని సృష్టిస్తుంది. ఈ రకమైన సమాజాన్ని అందరూ కోరుకుంటారు.  ఈ వాస్తవాన్ని మేము గౌరవిస్తున్నాం. కానీ ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం' అని విద్యామండలి ఉత్తర్వుల్లో పేర్కొంటూ హోలీ వేడుకలను నిషేధించింది. 

క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు ఈసారి ఘనంగా జరిగాయి. వీటిని యూనివర్సిటీకి చెందిన సంస్కృతిక సంస్థ నిర్వహించింది. ఇవి కాస్త వైరల్‌ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో మార్చి నెలలో హోలీ వేడుకలు జరుపుతున్న హందూ విద్యార్థులపై ఇస్లామిక్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ దాడులు జరిపింది. ఇందులో 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు.

ఇదీ చదవండి: ముంబై దాడుల ప్రధాన సూత్రధారికి అండగా నిలిచిన చైనా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement