Stunts
-
గాల్లోకి డబ్బులు.. యూట్యూబర్ హర్షను అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్‌లో రీల్స్ చేయడంపై తెలంగాణ పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియోల కోసం పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టొదని తెలిపారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా.. పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ మధ్యలో డబ్బులు గాల్లోకి చల్లి వాహనదారులకు ఇబ్బంది కలిగించిన యూట్యూబర్ హర్ష అలియాస్ మహాదేవ్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.‘తమ కెరీర్ లక్ష్యాలపై దృష్టిసారించాల్సిన యువత దారి తప్పుతుంది. సమాజానికి ప్రమాదకరంగా మారి, వారి కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెడుతుంది. ఇలాంటి దుశ్చర్యలపై పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరు. కఠిన చట్టాలు ప్రయోగించి జైలు ఊచల వెనక బందీ చేస్తారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు. pic.twitter.com/j2MEdYuiLx— Telangana Police (@TelanganaCOPs) August 23, 2024కాగా గురువారం కూకట్పల్లి యూట్యూబర్ పవర్ హర్ష అలియాస్ మహదేవ్ హల్చల్ చేశాడు. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసిరాడు. దీంతో డబ్బులను పట్టుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఇంతకముందు కూడా చాలాసార్లు ట్రాఫిక్‌లో డబ్బులు గాల్లోకి చల్లుతూ రీల్స్ పోస్ట్ చేశారు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్‌పై స్టాంట్లు కూడా చేశాడు. వీటిని సోషల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటాడు. హర్ష వ్యవహారంపై వాహనదారులు మండిపడుతున్నారు. -
విదేశాల్లో శిక్షణ
ఇంటర్నేషనల్ ట్రైనింగ్‌కు రెడీ అవుతున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘డాన్ 3’. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ‘డాన్ 3’లో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో రణ్వీర్, కియారా.. ఇద్దరికీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయట. దీంతో అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో ఇద్దరూ స్టంట్స్ నేర్చుకోనున్నారని బాలీవుడ్ టాక్. విదేశాల్లో ఈ శిక్షణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది సెప్టెంబరులో ్ర΄ారంభం కానుందని తెలిసింది. -
కొలంబియా పల్లెల్లో రోజూ స్టంట్లే
-
ట్రాక్టర్ స్టంట్స్‌లో యువకుడి మృతి.. పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చంఢీగర్: ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి చెందిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్టర్‌పై స్టంట్స్ చేయడాన్ని నిషేధించింది. ఇలాంటి విన్యాసాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. "ప్రియమైన పంజాబీలారా, ట్రాక్టర్‌ను పొలాల రాజు అంటారు. దానిని మృత్యుదేవతగా చేయవద్దు. ట్రాక్టర్ సంబంధిత పనిముట్లతో ఎలాంటి స్టంట్ లేదా ప్రమాదకరమైన పనితీరు పంజాబ్‌లో నిషేధించబడింది.” అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు. పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్‌మన్‌దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్‌మన్‌దీప్ ట్రాక్టర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: విషాదం: క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి -
బుల్లెట్ ఎక్కాలే తల్వార్ తిప్పాలే
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక మహిళ గాల్లో తల్వార్ ఊపుతూ బుల్లెట్‌పై వీరవిహారం చేసింది. మరో మహిళ టాప్‌లెస్ జీప్‌ను ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేతితో తల్వార్‌ను గాలిలో ఝుళిపించింది. ఒక మహిళ స్కూటీ డ్రైవ్ చేస్తుంటే మరొక మహిళ వెనుక సీటులో నిల్చొని గాల్లో తల్వార్‌తో విన్యాసాలు చేసింది. ఆ రాత్రి దుర్గామాత మండపం సమీపంలో మహిళలు చేసిన రకరకాల స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు ‘ఆహా ఓహో’ అని అబ్బురపడితే మరికొందరు ‘ఇలాంటి సాహసాలు తగవు’ అని ఖండించారు. -
దయ చేసి ఇలాంటి స్టంట్లు చేయొద్దు
-
సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ఏం చేస్తోందో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక తన ఆరోగ్యంపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరోవైపు ఆధ్యాత్మిక బాట పట్టింది. ఇటీవలే కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే త్వరలోనే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే?) ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో ఉన్న సమంత వర్కవుట్ వీడియో వైరల్‌గా మారింది. అత్యంత సాహోసపేతమైన స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోను సామ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. 'క్లబ్లో మేం ఇలానే పార్టీ చేసుకుంటాం' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలి ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇక సినిమాల విషయాకొనిస్తే.. విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. (ఇది చదవండి: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్!) #SamanthaRuthPrabhu shows off how she parties and it's unlike anything you imagined 🙌🔥#Samantha #pinkvilla pic.twitter.com/5pEebwJhPv — Pinkvilla (@pinkvilla) July 25, 2023 -
జవాన్ రిస్క్
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, వెనోమ్, స్టార్ ట్రెక్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ సీన్స్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాంటి ఫైట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు షారుక్ ఖాన్. ఆ హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా చేసిన స్పీరో రజటోస్ ఆధ్వర్యంలో షారుక్ ‘జవాన్’ కోసం రిస్కీ ఫైట్స్ చేశారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన చిత్రం ‘జవాన్’. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రిస్కీ స్టంట్స్‌ని హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ స్పీరో రజటోస్ సమకూర్చారని యూనిట్ పేర్కొంది. ‘‘జవాన్’లో షారుక్ చేసిన రిస్కీ ఫైట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. స్పీరో రజటోస్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
రైల్వే ప్లాట్‌ఫాంపై యువకుడి స్టంట్స్.. వాళ్ల రాకతో సీన్ రివర్స్!
పాట్నా: ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోంది. ఇక నెట్టింట తమ టాలెంట్‌ను ప్రదర్శించి కొందరు రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిన ఘటనలు బోలెడు ఉన్నాయి. కరోనా లాక్డౌన్ నుంచి ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. దీంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని చిరాకు తెప్పించేలా ఉంటున్నాయి. ఇంకొంత మంది మరో అడుగు మందుకేసి ప్రమాదకరమైనవి కూడా ప్రదర్శిస్తూ ప్రజలకు ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు. ఎందుకీ స్టంట్స్... తాజాగా ఓ యువకుడు రైల్వేస్టేషన్లో జిమ్నాస్టిక్స్ విన్యాసాలు ప్రదర్శించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే,ఆ యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు అతనికి ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఘటన బిహార్‌లోని మాన్పుర్ జంక్షన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై రైలు ఆగి ఉంది. అంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చి జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చేయడం చేయడం ప్రారంభించాడు. ఈ తరహా ఘటనలో ఇటీవల ఎక్కవ కావడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్పీఎఫ్.. అతడిని అరెస్టు చేసింది. అనంతరం అతని వీడియో షేర్ చేసి.. ఈ మేరకు ట్వీట్ చేసింది..‘మాన్పుర్ జంక్షన్లో ఓ యువకుడు తన నిర్లక్ష్యపూరిత విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. స్టేషన్లోకి అనధికారికంగా ప్రవేశించడంతోపాటు గందరగోళం సృష్టించే యత్నం చేశాడన్న ఆరోపణలపై అతడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్ల కోసం తెగించేవారికి ఇదొక గుణపాఠంగా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అతడి ప్రవర్తనను వ్యతిరేకించినప్పటికీ.. యువకుడి అరెస్టు చేయడాన్ని తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసి ఉండాల్సిందిగా అభిప్రాయపడ్డారు. మరికొందరు ఆర్పీఎఫ్ తీసుకున్న నిర్ణయం సరైందేనని కామెంట్లు పెడుతున్నారు. A young man who gained fame for his reckless stunts at Manpur Junction, was arrested by #RPF for creating nuisance and unauthorized entry. We hope this will serve as a lesson for others who put their lives at risk for likes and shares in social media. #SafetyFirst pic.twitter.com/qDCj9H9mFK — RPF INDIA (@RPF_INDIA) July 10, 2023 చదవండి: Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు -
ఈ సినిమాలో రియల్ కార్లతో స్టంట్స్ చేసినపుడు ..!
-
ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించం: సజ్జనార్ సీరియస్
Hyderabad Viral Video: వీసీ సజ్జనార్ మరోసారి తన మార్క్ చూపించారు. ఓ యువకుడికి సలహా ఇస్తూనే.. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూటీపై వెళ్తున్న యువకుడు.. బస్సును వెనుక నుంచి కాలితో నెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇది కాస్త వైరల్ కావడంతో.. సజ్జనార్ స్పందించారు. ప్రమాదాల బారిన పడి.. మీ తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దని సూచిస్తూ ట్వీట్ చేశారాయన. అంతేకాదు.. చట్టప్రకారం.. ఇలాంటి వారిపై చర్యల కూడా ఉంటాయని తెలిపారు. ఇదిలా ఉంటే.. మిథానీ డిపోకు చెందిన ఓ బస్సుపై సదరు యువకుడు స్టంట్లు చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఇన్స్టంట్ పాపులారిటీ కోసం పాకులాడుతూ.. ప్రమాదాలు పడుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తన సొంత అకౌంట్నుంచి.. వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి అంటూ ట్వీట్ చేశారు. ఆపై ఆర్టీసీ ఎండీ హోదాలో మరో ట్విటర్ అకౌంట్ నుంచి.. ఇలాంటి చర్యలకు కఠిన చర్యలు ఉంటాయని మరో ట్వీట్ చేశారాయన. ఇలాంటి ఘటనలను #TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. @TSRTCHQ https://t.co/AHSQQ7xbO9 — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 2, 2023 -
11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్
-
11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్.. వీడియో వైరల్
లక్నో: మన ఇంట్లోని సింగిల్ పేస్ కరెంట్ షాక్ తగిలితేనే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి 11 కేవీ విద్యుత్తు వైర్లను తాకితే ఏమైనా ఉందా? స్పాట్లోనే మాడి మసైపోతాం. కానీ, ఓ వ్యక్తి ప్రమాదకర సహసానికి పూనుకున్నాడు. 11కేవీ విద్యుత్తు తీగలపై స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్ నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్ 24న నగరంలోని అమారియా ప్రాంతంలో నౌషద్ అనే వ్యక్తి ఈ ప్రమాదకర సాహసం చేశాడు. ఇళ్ల పైకప్పుపైకి ఎక్కి విద్యుత్తు తీగలపైకి చేరుకున్నాడు. ఊయల మాదిరిగా ఊగుతూ అందరిని షాక్‌కు గురిచేశాడు. అయితే.. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయటం.. అతడికి అదృష్టంగా మారింది. లేకపోతే.. కాలి బూడిదయ్యేవాడు. హైఓల్టేజ్ తీగలపై వేలాడుతున్న వ్యక్తిని చూసిన కొందరు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేశారు. విద్యుత్తు సరఫరా ప్రారంభించవద్దని సూచించారు. వెంటనే అక్కడికి చేరుకున్న విద్యుత్తు అధికారులు.. నౌషద్‌ను బలవంతంగా కిందకు దించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారితో పంపించారు. నౌషద్ ప్రస్తుతం బండిపై గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఇలా ఎందుకు చేశాడో నౌషద్ చెప్పలేదు. అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదీ చదవండి: Viral Video:రాహుల్‌ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్ -
బాలుడి విన్యాసాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. వైరలవుతోన్న వీడియో
వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాను అస్సలు వదలరు. ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినప్పటికీ నిత్యం నెట్టింట్లో ఏదో ఒక వీడియోతో సర్ప్రైజ్ చేస్తుంటారు. ఆయన షేర్ చేసే పోస్టుల్లో సరదాతోపాటు సందేశమూ ఉంటుంది. లక్షల్లో లైక్‌లు, వేలల్లో కామెంట్లు వచ్చి చేరుతుంటాయి. ఇవన్నీ వింటుంటే ఎవరా అని ఆలోచిస్తున్నారా. అతనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. దీంతోపాటు ఓ చిన్న పిల్లవాడి విన్యాసాలను తెలిపే వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో.. రోడ్డుపై ఓ పదేళ్ల బాలుడు జిమ్నాస్టిక్ స్టంట్లు చేశాడు. అలవోకగా పల్టీలు కొడుతూ, జంప్ చేస్తూ వేగంగా ముందుకు వెళ్తున్నాడు. అతడి విన్యాసాలను చూస్తూ చుట్టూ ఉన్న వాళ్లంతా ఆశ్యర్యంతో అలాగే ఉండిపోయారు. ‘CWG 2022లో బంగారు వర్షం తర్వాత తదుపరి తరం ప్రతిభ రూపుదిద్దుకుంటోంది. దీన్ని ఎవరూ గుర్తించడం లేదు. మనం ఈ ప్రతిభను వేగంగా ట్రాక్‌లోకి తీసుకురావాలి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. తిరునెల్వేలి సమీపంలోని ఒక గ్రామంలో ఈ అబ్బాయిని చూసిన ఓ స్నేహితుడు ఈ వీడియోను తనకు పంపినట్లు తెలిపారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు బాలుడి ప్రతిభకు ఫిదా అవుతున్నారు. ఆనంద్ మహీంద్రా ఈ బాలుడిని ఆర్థికంగా ఆదుకోవాలని, అతన్ని గొప్ప జిమ్నాస్టిక్‌గా తీర్చిదిద్దడానికి శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారు. చదవండి: వింత చెట్టు: చెట్టు గాలి పీల్చుకోవడం చూశారా? వీడియో వైరల్ And after the Gold rush for India at the #CWG2022 the next generation of talent is shaping up. Unsupported. We need to get this talent on the fast track. (This video shared by a friend who has seen this boy in a village near Tirunelveli) pic.twitter.com/DXBcGQjMX0 — anand mahindra (@anandmahindra) August 9, 2022 -
హిమాయత్ సాగర్: ప్రమాదకర విన్యాసాలతో యువకులు
సాక్షి, బండ్లగూడ: జలమండలి అధికారుల పర్యావేక్షణ లోపంతో హిమాయత్‌సాగర్ చెరువులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ చెరువు నిండుకుండలా మారడంతో గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. సందర్శకులకు డ్యామ్ పైకి అనుమతి లేని విషయం తెలిసిందే. కానీ కొంతమంది యువకులు చెరువు ఒడ్డుకు వెళ్లి ప్రమాదకరంగా సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆటోలతో స్టంట్స్ .. వీడియో వైరల్
Auto Rickshaw Drivers Dangerous Stunts On Road: అర్ధరాత్రి నడిరోడ్డుపై అత్యంత ప్రమాదకరంగా ఆటోలతో విన్యాసాలు(స్టంట్స్) చేస్తూ.. పెద్దపెద్దగా కేకలు వేస్తూ తోటి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తూ.. తోటి వాహనాలు, లారీని ఓవర్ టేక్ చేస్తూ.. భయంకరంగా వ్యవహరించిన ఆరుగురు యువకులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాల ప్రకారం.. టోలిచౌకి ప్రాంతానికి చెందిన సయ్యద్ జుబేర్ అలీ(20), సయ్యద్ సాహిల్(21), మహ్మద్ ఇబ్రహీం(22), మహ్మద్ ఇనాయత్(23), గులాం సైఫ్‌ద్దీన్(23), మహ్మద్ సమీర్(19), అమీర్ ఖాన్(20) అద్దెకు ఆటోలను నడుపుతుంటారు. గురువారం అర్ధరాత్రి మూడు ఆటోలతో చాంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చారు. చాంద్రాయణగుట్ట నుంచి రాత్రి 12.30 గంటలకు బాబానగర్ మీదుగా డీఆర్డీఎల్ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకొని తిరిగి బాబానగర్ వైపు పయనమయ్యారు. మూడు ఆటోలను ఒళ్లు గగుర్పొడిచే రీతిలో రెండు టైర్లపై క్రాస్‌గా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురిచేశారు. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలిగించారు. రోడ్లపై వీరు చేసిన స్టంట్స్‌ను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆటోతో పాటు డ్రైవర్ మహ్మద్ ఇబ్రహీం పరారీలో ఉన్నాడు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ ఎ.మధుసూదన్‌రెడ్డి, ఎస్సైలు గౌస్‌ఖాన్, గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. Action required @HYDTP !#Santoshnagar#Chandrayangutta !! pic.twitter.com/oruw79VacZ — Dr Chaitanya Singh (@MidnightReportr) February 25, 2022 -
ఉప్పొంగిన తూర్పుతీరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారతదేశ నౌకాదళ శక్తి సామర్థాల్ని చూసి సంద్రం ఉప్పొంగింది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ రక్షణ విషయంలో అగ్రరాజ్యాలతో పోటీపడుతూ.. తన పాటవాన్ని భారత నౌకాదళం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. సమరానికి ఏ క్షణమైనా సన్నద్ధమంటూ సంద్రంలో సవాల్ చేస్తూ నాలుగు వరుసల్లో నిలుచున్న యుద్ధ నౌకలు.. త్రివర్ణ పతాకానికి సగర్వంగా సెల్యూట్ చేస్తూ శత్రు సైన్యాన్ని జలసమాధి చేసేందుకు సిద్ధమంటూ సబ్మెరైన్లు.. గాలికంటే వేగంగా దూసుకెళ్తూ మిగ్ విమానాలు హోరెత్తించాయి. గగన తలంలో దేశ గర్వానికి ప్రతీకలుగా యుద్ధ విమానాల విన్యాసాలు.. సముద్ర కెరటాలతో పోటీపడుతూ చేతక్ హెలికాప్టర్లు అలరించాయి. యుద్ధమైనా, సహాయమైనా క్షణాల్లో వాలిపోతామంటూ మెరైన్ కమాండోలు చేసిన విన్యాసాలు.. వెరసి భారత నౌకాదళ సర్వ సంపత్తి ఒకేచోట చేరి నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాలు మొత్తం విశాఖ వైపు చూసేలా చేసింది. మొత్తంగా త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్వహించిన భారత యుద్ధ నౌకల సమీక్ష ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్–2022) ఆద్యంతం ఆకట్టుకుంది. గౌరవ వందనం భారతదేశ చరిత్రలో ఇది 12వ ఫ్లీట్ రివ్యూ. దేశ తూర్పు తీరంలో మూడో సమీక్షగా విశాఖలో జరుగుతున్న పీఎఫ్ఆర్ సోమవారం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి హార్బర్‌కు రాకముందు 150 మంది సెయిలర్స్ గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. 9 గంటలకు రాష్ట్రపతి హార్బర్ చేరుకున్నారు. ఈయనకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, నాలుగు నౌకాదళ కమాండ్ల చీఫ్‌లు వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, వైస్ అడ్మిరల్ హంపిహోలి, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ తదితరులు స్వాగతం పలికారు. ముందుగా 21 తుపాకులతో భారత నౌకాదళం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి.. ప్రెసిడెన్షియల్ యాచ్‌గా సిద్ధంగా ఉన్న ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధనౌకలో సతీసమేతంగా సమీక్షకు బయలుదేరారు. నౌక ముందుభాగంలో ప్రత్యేకంగా సిద్ధంచేసిన డెక్‌పై రాష్ట్రపతి దంపతులు ఆశీనులు కాగా.. రెండువైపులా రక్షణ మంత్రి, గవర్నర్, నౌకాదళాధిపతి కూర్చున్నారు. నౌకాదళ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్. చిత్రంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి హరికుమార్ నౌకాదళ పాటవాల్ని సమీక్షించిన రాష్ట్రపతి ఈ ఏడాది పీఎఫ్ఆర్కు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్రపతిని తీసుకుని ప్రెసిడెన్షియల్ యాచ్ ఐఎన్ఎస్ సుమిత్ర ముందుకు సాగుతుండగా.. సుమిత్ర కాన్వాయ్‌గా ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ సావిత్రి, టాంగో–39, టాంగో–40 యుద్ధనౌకలు బయల్దేరాయి. బంగాళాఖాతం సముద్ర జలాల్లో నాలుగు వరుసల్లో లంగరు వేసిన యుద్ధనౌకల మధ్యగుండా సాగుతూ వాటిపై నుంచి నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని త్రివిధ దళాధిపతి స్వీకరించారు. యుద్ధ నౌకల సిబ్బంది ప్రతి వార్ షిప్ ముందు నిల్చుని టోపీలని చేతితో తిప్పుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. మొత్తం షిప్‌లను సమీక్షించిన తర్వాత సబ్‌మెరైన్ కాలమ్‌లో ఉన్న ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ సింధుకీర్తి, ఐఎన్ఎస్ సింధురాజ్ జలాంతర్గాముల్ని ఆయన సమీక్షించారు. అబ్బురపరిచిన విన్యాసాలు ఇక రెండు గంటలకు పైగా సాగిన నౌకాదళ సమీక్షలో ఇండియన్ నేవీ.. తన సామర్థ్యాల్ని ఘనంగా ప్రదర్శించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన చేతక్ హెలికాప్టర్లతో పాటు సీకింగ్స్, కామోవ్, యుటిలిటీ హెలికాఫ్టర్ (యూహెచ్)–త్రీహెచ్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్)లతో పాటు డార్నియర్స్, మిగ్–29కే, హాక్స్, మల్టీ మిషన్ మేరీటైమ్ ఎయిర్క్రాఫ్టŠస్ పీ8ఐ, ఐఎల్ 38 మొదలైన యుద్ధ విమానాలు నిర్వహించిన విన్యాసాలు ఉత్కంఠగా సాగాయి. యుద్ధ నౌకల సమీక్ష అనంతరం ఒకేసారి అన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాల్లోకి దూసుకుపోతూ ఫ్లై పాస్ట్ నిర్వహించాయి. ఈ యుద్ధ విమానా విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈ సందర్భంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల డెమోతో మెరైన్ కమాండోలు నిర్వహించిన వాటర్ పారా జంప్స్, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తపాలా బిళ్ల విడుదల చేసిన రాష్ట్రపతి ప్రతి పీఎఫ్ఆర్ లేదా ఐఎఫ్ఆర్ నిర్వహించిన తర్వాత దాని పేరుతో పోస్టల్ స్టాంప్, కవర్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం పీఎఫ్ఆర్–2022 జ్ఞాపకార్థం తపాలా శాఖ రూపొందించిన స్టాంప్, పోస్టల్ కవర్ని నేవల్ బేస్‌లో రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ జె చౌహాన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
నౌకా విన్యాసాలకు సర్వం సన్నద్ధం
సాక్షి, విశాఖపట్నం: మరికొద్ది రోజుల్లో నగరంలో జరగనున్న రెండు భారీ నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఇందుకోసం సాగర తీరం సర్వహంగులతో సన్నద్ధమవుతోంది. ఈనెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, 25 నుంచి మార్చి 4 వరకు మిలాన్–2022 అంతర్జాతీయ నావికా విన్యాసాలతో విశాఖ అంతర్జాతీయ పటంలో మరోసారి మెరుపులు మెరిపించనుంది. ఈ నేపథ్యంలో.. భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల కోసం విశాఖ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఫ్లీట్ రివ్యూ ఎందుకంటే.. 1971లో పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపై దాడిచేసి విజయపతాక ఎగురవేసిన చరిత్ర ఈ దళానిది. అప్పటి నుంచి భారతీయ నౌకాదళంలో ఈఎన్సీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందుకే ప్రధాన విన్యాసాలకు కేంద్రంగా.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలకు వేదికగా విశాఖ నిలుస్తోంది. 2006లో మొదటిసారిగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించి సత్తాచాటిన విశాఖ నగరం.. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూతో ప్రపంచమంతా నగరం వైపు చూసేలా కీర్తి గడించింది. ఇప్పుడు రెండో పీఎఫ్ఆర్తో మొట్టమొదటిసారిగా మినీ ఐఎఫ్ఆర్గా పిలిచే మిలాన్–2022కి ముస్తాబవుతోంది. 20న రాష్ట్రపతి రాక ఈనెల 21న జరిగే పీఎఫ్ఆర్ కోసం 20వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖకు చేరుకోనున్నారు. ఆయనకు సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా సాదర స్వాగతం పలుకుతారు. ఈఎన్సీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రపతి బసచేస్తారు. 21న ఉ.9 గంటలకు ఫ్లీట్ రివ్యూ మొదలుకానుంది. 11.45 వరకూ జరిగే ఈ రివ్యూలో నేవీతో పాటు కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలతోపాటు సబ్ మెరైన్లు, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లని నాలుగు వరుసల్లో నిలుపుతారు. వీటిని త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి యుద్ధనౌకలో నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో తమ గౌరవ వందనాన్ని అందజేసేందుకు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తాయి. అనంతరం పీఎఫ్ఆర్కు సంబంధించిన తపాలా బిళ్లని, పోస్టల్ కవర్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 25 నుంచి మిలాన్ మెరుపులు.. ఇక పీఎఫ్ఆర్ తర్వాత.. 25వ తేదీ నుంచి వివిధ దేశాల నౌకాదళాల మధ్య స్నేహపూర్వక సత్సంబంధాలను బలోపేతం చేసేలా మిలాన్–2022 విన్యాసాలు ప్రారంభమవుతాయి. మార్చి 4 వరకూ జరిగే ఈ విన్యాసాల్లో 46కి పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. నిజానికి.. 1995లో మిలాన్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014లో 17 దేశాలు పాల్గొని అతిపెద్ద ఫ్లీట్ రివ్యూగా చరిత్రకెక్కింది. 27న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మరోవైపు.. 25న అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు విశాఖ చేరుకుంటారు. 26న కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధికారికంగా మిలాన్ విన్యాసాల్ని ప్రారంభిస్తారు. ► 27, 28 తేదీల్లో అంతర్జాతీయ మారీటైమ్ సెమినార్ జరుగుతుంది. ఈ సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్ జయశంకర్ హాజరవుతారు. ► 27 సా.4.45కు విశాఖ బీచ్‌రోడ్డులో జరిగే ఆపరేషనల్ డిమాన్స్ట్రేషన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ► ఈ సందర్భంగా యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖని సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేస్తారు. షెడ్యూలు, ఏర్పాట్లు ఇలా.. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ: ఫిబ్రవరి 21 మిలాన్–2022 ప్రారంభం: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్: ఫిబ్రవరి 27 సా.4.45 నుంచి ముఖ్య అతిథి: సీఎం వైఎస్ జగన్ పాల్గొనే దేశాలు: సుమారు 46 విదేశీ అతిథులు: 900 మంది ఆతిథ్యానికి సిద్ధంచేసిన హోటళ్లు: 15 బందోబస్తుకు సిద్ధంచేసిన పోలీస్ సిబ్బంది: 5,000 హాజరయ్యే వారు: సుమారు 2 లక్షలు కేటాయించిన మొత్తం: రూ.22.27 కోట్లు తిలకించేందుకు ఏర్పాట్లు: 25 వీడియో సిస్టమ్‌లు, బీచ్‌రోడ్‌లో 3 కిమీ మేర 40 ఎల్ఈడీ స్క్రీన్లు బీచ్‌రోడ్డులో జరిగే కార్యక్రమాలు: గరగల డ్యాన్స్, కూచిపూడి నృత్యాలు తదితర సంప్రదాయ నృత్యాలు స్టాల్స్: ఏటికొప్పాక బొమ్మలు, పొందూరు ఖద్దరుతో పాటు 13 జిల్లాల్లోని ప్రసిద్ధమైన వస్త్రాల స్టాల్స్ విదేశీ అతిథులకు తెలుగు రుచులు: ఆంధ్ర పిండి వంటలు, రాయలసీమ రుచులు, కృష్ణా గుంటూరు వంటకాలు. మాడుగుల హల్వా, నాటుకోడి కూర, గుత్తివంకాయ, రాయలసీమ రాగిసంకటి, నెల్లూరు చేపల పులుసు, రొయ్యల వేపుడు, కాకినాడ కాజాలు, బొంగు బిర్యానీ మొదలైనవి. విదేశీయులకు ఇచ్చే బహుమతులు: ఏటికొప్పాక బొమ్మలు, రాజమండ్రి రత్నం పెన్నులు, ఇతర కళాఖండాలు. -
అభిమానులకు వరలక్ష్మీ సలహా!
ఎవరూ ఫైట్స్ చేయకండి అంటున్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈ సంచలన నటి చేతిలో ఇప్పుడు 8 చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చేజింగ్. ఇందులో వరలక్ష్మీ విలన్లను, రౌడీలను తరిమి తరిమి కొడుతుందట. వీరకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల మలేషియాలో కొన్ని యాక్షన్, థ్రిల్లర్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో నటి వరలక్ష్మి ఎలాంటి డూప్, తాడు సాయం లేకుండా, గ్రాఫిక్స్ వాడకుండా చాలా రిస్క్ తీసుకుని పోరాట సన్నివేశాల్లో నటించినట్లు స్వయంగా చేశారు. వాటిలో కొన్ని ఫైట్ సన్నివేశాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వరలక్ష్మీ అలా చేయడానికి ప్రయత్నించొద్దన్నారు. ఎందుకంటే అవి చాలా రిస్క్‌తో కూడుకున్నవని, అందులో నటించడానికి తాను ముందుగా రిహార్సల్స్ చేశానని, స్టంట్‌మాస్టర్ శిక్షణలో పలు జాగ్రత్తలు తీసుకుని నటించినట్లు చెప్పారు. -
రిస్కీ స్టంట్స్ చేస్తున్న సీనియర్ హీరో
చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్. ఈ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మరో ప్రయోగం చేస్తున్నారు. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో వేసిన సెట్లో జరుగుతోంది. ఈ షూటింగ్లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారట. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అదా శర్మ, నందిత శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
గుండె రక్తనాళాల పూడికలో బైపాస్ సర్జరీకి చెక్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): క్లిష్టమైన గుండె రక్తనాళాల్లో పూడికలకు బైపాస్ లేకుండా కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ అమర్చే విధానంపై సోమవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో వర్క్‌షాపు నిర్వహించారు. జర్మనీకి చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మీరోస్లేవ్ ఫెరెస్క్ పాల్గొన్నారు. ఒకసారి బైపాస్ సర్జరీ, స్టెంట్లు అమర్చిన వారికి కాల్షియం కారణంగా మళ్లీ పూడికలు ఏర్పడగా, వాటిని రోటబ్రేటర్ ద్వారా ఆప్టికల్ కోబెరాన్స్ టోమోగ్రఫీ అనే నూతన పరిజ్ఞానంతో తొమ్మిది మందికి స్టెంట్లు విజయవంతంగా అమర్చారు. అనంతరం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఈ విధానం గుండె జబ్బుల వైద్యంలో విప్లవాత్మక మార్పుగా పేర్కొన్నారు. మచిలీపట్నంకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి ఎడమ మెయిన్ 90 శాతం బ్లాక్ అయిందన్నారు. ఆ వయస్సులో బైపాస్ సర్జరీ చేయడానికి ఆరోగ్యం సహకరించదని, ఈ వర్క్‌షాపులో అతనికి యాంజియో ప్లాస్టీ ద్వారా పూడికలు తొలగించి స్టెంట్ అమర్చినట్లు తెలిపారు. ఈ వర్క్‌షాపులో విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు పలుప్రాంతాల నుంచి 20 మంది కార్డియాలజిస్టులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్, డాక్టర్ తులసీరామ్ పాల్గొన్నారు. -
డిజిటల్ ఫీవర్
మోదీతో చిన్నారి మోదీ ప్రధాని నరేంద్ర మోదీ అచ్చం తనలాగే ఉన్న ఒక చిన్నారిని కలుసుకున్నారు. కరచాలనం చేశారు. కబుర్లు చెప్పారు. అంతేకాదు... మురిపెంగా ట్వీటర్‌లోనూ పంచుకున్నారు. మొన్న కచ్‌లో రెండవ విడత గుజరాత్ వికాస్ ర్యాలీ అనంతరం జరిగిన సభకు ఆఫ్ వైట్ కుర్తా, బూడిదరంగు జాకెట్, మెడకు కాషాయరంగు స్కార్ఫ్ ధరించి, చేతికి నల్లటి దారం కట్టుకుని, తెల్లటి గడ్డం, మీసాలు (అలా కనిపించే ఒకవిధమైన పేస్టు పూసుకున్నాడు), కళ్లద్దాలతో ఉన్న ఒక బుడతడు వచ్చాడు. ఆ చిన్నారిని ప్రధాని సంభ్రమాశ్చర్యాలతో అలానే చూస్తుండిపోయారు. అతనికి షేక్‌హ్యాండిచ్చి, కొద్దిసేపు ముచ్చటించారు. పాపం! ఆ చిన్నారి చికిత్స లేనటువంటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడట. చిన్నప్పటినుంచి ఆ బుడతడికి మోదీ అంటే అమితమైన ఇష్టమట. అక్కడి పెద్దలు అతని కోరిక (బహుశ ఆఖరి కోరిక కావచ్చు) తీర్చడం కోసం అతన్ని తన ఆరాధ్యదైవంలా, రోల్‌మోడల్‌లా అలంకరించి, మోదీని కలిసే మార్గం సుగమం చేశారట. అతని గురించి తెలుసుకున్న మోదీ కూడా కదలిపోయారట. నా చిన్నారి స్నేహితుడు చూడండి... ఎంత ముచ్చటగా ఉన్నాడో... అని ప్రధాని చేసిన ఈ ట్వీట్, ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. మోదీని కలిసిన ఈ మధుర క్షణాలు ఆ బుడతడికి మరికొద్ది రోజులు ఆయుష్షు పొడిగించాలని కోరుకుందాం. డాగిలం గారి ఎక్సర్సైజులు పోలీస్ జాగిలాలు రకరకాల సాహసకృత్యాలు చేయడం మనకు తెలుసు. శిక్షణ పొందిన అల్సేషన్ కుక్కలు కూడా రకరకాల విన్యాసాలు చేయడమూ మనం చిన్నప్పుడెప్పుడో సినిమాల్లో చూసేశాం. అయితే, ఇద్దరు పోలీసాఫీసర్లు వర్కవుట్స్ చేస్తుంటే, వారి మధ్యలో దూరిన ఈ డాగిలం తాను కూడా వారితో సమానంగా వర్కవుట్స్ చేస్తుంటే చూడముచ్చటేస్తుంది కదా! అలబామాకు చెందిన కోవాన్, హాంకాక్ అనే ఇద్దరు పోలీసు ఆఫీసర్లు వామప్ ఎక్సర్సైజులు చేస్తున్నారు. కొంతకాలంగా వారినే గమనిస్తూ ఉన్న నైట్రో అనే రెండు సంవత్సరాల డచ్ డాగ్ ‘నేను మాత్రం ఏమి తక్కువ తిన్నాను’ అనుకుందో ఏమో, వారి మధ్యలో దూరింది. వామప్ కోసం వాళ్లు తమ శరీరాలను ఎలా కదుపుతున్నారో, అచ్చం తాను కూడా అలాగే కదిలిస్తూ, వంగుతూ, లేస్తూ ఎక్సర్సైజులు చేసేసింది. కేవలం ఏడుసెకండ్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకూ దాదాపు తొమ్మిది లక్షల ఇర వై వేల మందికి పైగా చూశారు. కొన్ని వేలమంది షేర్ చేశారు. కళ్లు మూసుకోండి... కనిపిస్తాను ‘‘నన్నే తలచుకుంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? ఇప్పటికిప్పుడు వచ్చేస్తానని మీకు మాట ఇవ్వలేకపోవచ్చు కానీ, కళ్లు మూసుకుని నన్నే తలచుకోండి... నేను కనిపించకపోతే అడగండి’’ ఈ మాటలు ఏ కవో, రచయితో రాసుకున్నవి కావు. అక్షయ్ గిరీష్ అనే మేజర్, తన కుటుంబ సభ్యులకు రాసినవి. దురదృష్టవశాత్తూ ఈ వాక్యాలే అతని కుటుంబానికి ఇప్పుడు మిగిలున్నాయి. పోయిన నవంబర్ 29న శత్రుసైనికుల దొంగదాడిలో అమరుడయ్యాడు ఈ మేజర్. అతని భార్య సంగీత తన భర్త మరణించిన ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యులందరూ కలసి ఉన్న ఫొటోను ఫేస్బుక్లో పెట్టింది. తన భర్త చనిపోలేదనీ, తమ స్మృతిపథంలో చిరంజీవిగానే ఉన్నారని ఫేస్బుక్లో ఆమె చేసిన ఈ పోస్టింగ్ ఎందరికో స్ఫూర్తి రగిలించింది. రగిలిస్తోంది. తన తండ్రి ఫొటో కింద ‘‘కొందరు చెడ్డ అంకుల్స్‌తో చేసిన ఫైటింగ్లో మా డాడీకి దెబ్బలు తగిలాయి. ఇప్పుడాయన దేవుడి దగ్గర సేఫ్‌గా ఉన్నారు. నా బర్త్‌డేకి పైనుంచి వచ్చి నన్ను బ్లెస్ చేస్తారు’’అని చిన్నారి నైనా రాసుకున్న వాక్యాలు చూస్తుంటే కళ్లు చెమర్చని వారెవరుంటారు చెప్పండి. భళి భళి భళీ... బాహుబలీ... ఆ మధ్య బాహుబలి మేనియా పట్టుకుంది జనాల్ని. అప్పట్లో ఒక దుమారంలా రేగిన ఈ బాహుబలి మేనియా అంతటితో అయిపోయిందని అనుకుంటే పొరపాటే. విదేశాలలో ఇంకా బాహుబలి వీరవిహారం చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఫ్లోరిడాలోని ఆర్లాండోలో జరిగిన నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ గేమ్ సందర్భంగా కోర్టులో ట్రాక్ సాంగ్‌గా పెట్టుకున్న బాహుబలి పాటలే ఇందుకు నిదర్శనం. ఆట ముగిసిన తర్వాత ఆ యువతులందరూ బాహుబలి పాటలోని బృందం ధరించిన లాంటి వస్త్రాలే ధరించి, పాటకు తగ్గట్టు చక్కగా అభినయించారట. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ట్విటర్లోనూ, ఫేస్‌బుక్‌లోనూ చక్కర్లు కొడుతుంటే మన వాళ్లు అందరూ చూసి విదేశాలలో మన బాహుబలి దర్పాన్ని తలచుకుని ఆనందిస్తున్నారు. ఈ కలల రాణి.. త్వరలో బ్రిటన్ పట్టపురాణి అమెరికన్ నటి మేఘన్ మార్క్లే, బ్రిటన్ యువరాజు హేరీలు తాము త్వరలోనే ఒకటి కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వారి ఎంగేజ్మెంట్. ఈ విషయం తెలిసిన లక్షలాదిమంది అభిమానులు ట్విటర్లో తమ హర్షాతిరేకాలు ప్రకటించారు. 36 ఏళ్ల మిస్ మార్క్లే, సూపర్ డూపర్ హిట్ టెలివిజన్ షో ‘సూట్స్’లో రేచల్ జేన్‌గా చిరపరిచితురాలు. తమ హృదయాలను కొల్లగొట్టిన ఈ మేటి నటి త్వరలోనే బ్రిటన్ యువరాణి కిరీటం ధరించనుండటాన్ని మించిన ఆనందం అభిమానులకు ఏముంటుంది... అన్నట్టు మార్క్లే ఇప్పుడు బ్రిటిష్‌నెస్ క్విజ్‌లో పాల్గొంటోంది. వారి వివాహ ప్రకటనకు సంబంధించిన విడియోతోబాటు ఆమె నిర్వహిస్తున్న ఈ క్విజ్ ప్రోగ్రామ్ కూడా హిట్లమీద హిట్లు కొడుతూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిన్నారి నోట... జాతీయ పాట! చిన్నారులు ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే వినడానికి ఎంతో బాగుంటుంది. అలాంటిది పాటలు పాడుతుంటే... అందులోనూ జాతీయగీతమైన ‘జనగణమన’ ను వచ్చీరాని మాటలతో ఆలపిస్తుంటే ఇంకెంత బాగుంటుందో కదా! నిండా మూడేళ్లు కూడా లేని ఒక చిన్నారి, జాతీయ జెండాను పట్టుకుని, ‘జనగణమన’ పాడింది. అందులో ఎన్నో తప్పులున్నా, ఆ పాప వయసు చూసి, పాడేటప్పుడు ఆమె చేసిన అభినయాన్నీ చూసీ మెచ్చుకోకుండా ఉండలేరెవరూ! ఈ చిన్నారి పాడిన జాతీయగీతం వాట్సప్‌లోనూ, యూట్యూబ్‌లోనూ షికార్లు చేస్తోంది. ఛీ..! విశ్వాసం లేని మనుషుల్లారా! విశ్వాసానికి, ప్రేమకు మారుపేరు శునకం. అలాంటి శునకాన్ని, విశ్వాసం లేని ఒక కసాయి వ్యక్తి, తన పెంపుడు శునకంపై చల్లటి నీళ్లు పోసి, నిర్దాక్షిణ్యంగా దాన్ని మంచులోకి తోసేశాడు. కొన ఊపిరితో ఉన్న ఆ శునకాన్ని చూసిన కొందరు దయార్ద్ర హృదయులు రక్షించేందుకు ప్రయత్నించారు. అయినా, లాభం లేకపోయింది. రష్యాలో జరిగిన హృదయ విదారకమైన ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకొచ్చింది. ఎముకలు కొరుక్కుతినేంతటి మంచుగడ్డల మధ్య శరీరమంతా గడ్డకట్టుకునిపోయి, కేవలం ఒకే ఒక్క పంజా మాత్రమే కదిలించగలిగే స్థితిలో ఉన్న ఆ శునకాన్ని ఆ దారిన పోతున్న కొందరు చూసి రక్షించబోయారు. కానీ, దురదృష్టం... వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సంఘటన అంతటినీ వారు చిత్రీకరించి, ఫేస్బుక్లో పెట్టారు. ఇది చూసిన మూగజీవాల ప్రేమికులు ఆ కసాయి యజమాని మీద మండిపడుతున్నారు. వారిలో ఒక మహిళా కార్యకర్త అయితే, ‘‘చనిపోతూ ఆ మూగజీవి చూసిన చూపులను బహుశా నేను ఎప్పటికీ మరచిపోలేనేమో’’ అని వ్యాఖ్యానించింది. ఆ శునకం యజమాని మీద చర్య తీసుకోవాలని కోరుతూ, దాదాపు పదివేలమందికి పైగా రష్యన్లు పిటిషన్‌పై సంతకాలు చేశారు. ఇంకెప్పుడూ ఇలా చేయద్దు డ్యూడ్! తమ అభిమాన కథానాయకులు ఎల్తైన గోడల మీదినుంచి దూకడం, కత్తియుద్ధాలు, కర్రసాములు, ఫైర్ఫైట్లు చేయడం చూసి ప్రేక్షకులు చప్పట్లు చరిచి, ఈలలు వేసీ మరీ తమ హర్షాతిరేకాలు తెలియజేస్తుంటారు. అయితే, అలాంటి సీన్లు, రియాల్టీ షోస్‌లో ‘‘వీటిని ఎవరూ అనుకరించవద్దని మనవి’’ అంటూ హెచ్చరికలు కూడా కనిపిస్తాయి. తమ ఫేవరెట్ హీరో టైగర్ ష్రాఫ్ సినిమాల్లో చేసే సాహసకృత్యాలను చూసి, ఆ స్ఫూర్తితో ఒక అభిమాని ఏకంగా 13 అడుగుల ఎత్తున్న గోడమీది నుంచి జంప్ చేస్తూ, తీసుకున్న విడియోతోబాటు‘‘థాంక్యూ హీరో ష్రాఫ్... నిన్ను చూసి నా పిరికితనాన్ని తరిమికొట్టగలిగాను’’ అని ట్వీట్ చేశాడు. అది చూసిన సదరు హీరో మాత్రం తన అభిమాని చేసిన ఆ సాహసాన్ని అభినందించకపోగా, తలవాచేలా చివాట్లు పెట్టాడు. పైపెచ్చు ‘‘ఇంకెప్పుడూ ఇలా చేయవద్దు... అభిమానులకు ఏమైనా అయితే మేము తట్టుకోలేము’’ అని ప్రేమతో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. -
రిస్కీ స్టంట్స్: వైరల్ వీడియో
-
రిస్కీ స్టంట్స్: వైరల్ వీడియో
పంజాబ్: బైక్ విచిత్ర విన్యాసాలు, అనేక రిస్కీ స్టంట్లు, సాహస కృత్యాలు మనం చాలా చూశాం. తాజాగా పంజాబ్‌లోని ఓ యువరైతు తనదైన శైలి విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాడు. బైక్‌పై విన్యాసాలు చేయాలని ఆశపడిన అతగాడికి బైక్ కొనుక్కునే ఆర్థిక వెసులుబాటు లేదని కుంగిపోలేదు. అందుబాటులో ఉన్నదాన్ని అందిపుచ్చుకుని వెరైటీగా సాహసకృత్యాలతో ఆకర్షిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు ట్రెండీగా నిలిచింది. పంజాబ్‌కు చెందిన యువరైతు గాగ్గి బన్స్రా (21)కి చిన్నప్పటినుంచీ సాహసాలు, విన్యాసాలు అంటే మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో తన తండ్రి వ్యవసాయాన్ని అందిపుచ్చుక్ను బన్సా తనకు అందుబాటులో ఉన్న ట్రాక్టర్‌తో విన్యాసాలు చేయడం మొదలు పెట్టాడు. మొదట్లో విఫలమైనా , రాను రాను పట్టు సాధించాడు. ఒక టన్ను బరువున్న ట్రాక్టర్ నడుపుతూ రకరకాల విన్యాసాలతో చుట్టుపక్కల గ్రామాల వారిని పైతం ఆకట్టుకుంటున్నాడు. యూ ట్యూబ్‌లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. -
అబ్బుర పరిచిన నావికా విన్యాసాలు
విశాఖపట్నం: అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో భాగంగా బుధవారం జరిగిన నమూనా విన్యాసాలు విశాఖ వాసుల్ని ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ప్రతి ఏటా నేవీ డే సందర్భంగా ఇలాంటి విన్యాసాలను వీక్షించే విశాఖవాసులకు ఈసారి అంతర్జాతీయ నౌకలు విశాఖ సాగరతీరంలో అలరించాయి. సాయం సమయంలో ఒక్కసారిగా ఆయా నౌకలకు విద్యుద్దీపాలంకరణతో సముద్రజలాలపై ఓలలాడుతూ కనువిందు చేశాయి. తొలుత సాయం వేళలో ఆర్థగంట పాటు యుద్ధ నౌకలు విశాఖ సముద్రతీరంలో విన్యాసాలు చేయగా యుద్ధ విమానాలు గగనతలంలో రయ్యిన దూసుకుపోయి గగుర్భాటుకు గురిచేశాయి. సముద్రతీరం నుంచి విశాఖ వీధుల మీదుగా ఫ్లైఫాస్ట్ చేస్తూ తీరప్రాంతంలో వీక్షించేందుకు వచ్చిన వారితో పాటు నగర ప్రజలకు ఐఎఫ్ఆర్ను తలపించాయి. యుద్ధ నౌకలు సైతం శత్రుదేశాల యుద్ధ నౌకలపై దాడి చేయడం, చమురునిల్వలపై దాడి వంటి విన్యాసాలు అబ్బురపరిచాయి. యుద్ధ టాంకర్లు, నావికా సైనికులు హఠాత్తుగా తీరంలోకి దూసుకు వచ్చి దాడుల ప్రదర్శన జరిపారు. రిహార్సల్స్‌లో భాగంగా గురు, శుక్రవారాల్లో సయితం విశాఖ సాగర తీరంలో ఈ విన్యాసాలు చోటుచేసుకోనున్నాయి. -
ఆకర్షించిన శకటాల ప్రదర్శన...
-
డూప్ వద్దన్న బాలయ్య
ప్రస్తుతం డిక్టేటర్ సినిమాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ సినిమా కోసం కొన్ని ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నాడు. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఈ ఫైట్ సీక్వన్స్ను దాదాపు 150 మంది ఫైటర్లతో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వన్స్లో హీరో కొన్ని రిస్కీ స్టంట్స్ చేయాల్సి రావటంతో ఆ సీన్స్‌ను డూప్‌తో చేయించాలని భావించారు చిత్రయూనిట్. అయితే అందుకు అంగీకరించని బాలయ్య తానే ఆ సీన్స్ లో నటిస్తున్నాడు. 55 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా బాలయ్య చేస్తున్న స్టంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లౌక్యం సక్సెస్‌తో సూపర్ ఫాంలో ఉన్న శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. -
విన్యాసాలతో ముద్దూ ముచ్చట
ఫ్లోరిడా: పరస్పర ప్రేమను వ్యక్తీకరించుకోవడంలోనూ పెళ్లి చేసుకోవడంలోనూ వినూత్న పద్ధతులను ఆశ్రయించడం అమెరికా యువతీ యువకులకు పరిపాటే. అలాగే ఫ్లోరిడాలోని ఒకోయిలో ఉంటున్న జో, ఇలియానాలు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందు నిశ్చితార్థాన్ని వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆకాశమార్గాన విహరిస్తూ, సముద్ర గర్భంలో జలకాలుడుతూ, పర్వతారోహన చేస్తూ నిశ్చితార్థం జరుపుకోవాలా? ఆహా...ఇవిన్నీ పాతపడిన విద్యలే. జీవితాంతం కలిసున్నా, లేకున్నా జీవితాంతం గుర్తుండేలా ఇంకా కొత్తగా, వినూత్నంగా నిశ్చితార్థం జరుపుకోవాలని ఆలోచించారు. వారి మధ్య ప్రేమ అంకురించి, వికసించిందీ జిమ్‌లోనే. కనుక జిమ్‌లోనే నిశ్చితార్థం జరుపుకోవాలని నిర్ణయానికొచ్చారు. అయితే ఎలా అన్నది మరో ప్రశ్న... మళ్లీ ఆలోచించారు. జిమ్నాస్టిక్స్లోనూ వెయిట్ లిఫ్టింగ్లోను ఇద్దరు నిపుణులే అవడం వల్ల కసరత్తు చేస్తూనే కళ్యాణ గడియలకు నిశ్చితార్థం జరుపుకోవాలని అనుకున్నారు. వెంటనే ఫొటోగ్రాఫర్‌ను పిలిపించారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ నిశ్చితార్థం పేరిట ముద్దూ ముచ్చట తీర్చుకున్నారు. వారిని వివిధ భంగిమల్లో ఫొటోలు తీసిన సదరు ఫొటోగ్రాఫర్ నిజంగా ఇది కొత్తగాను, గమ్మత్తుగాను ఉందంటూ భావి దంపతులను ఆశీర్వదించారు. బ్యూనా విస్టా సరస్సు సమీపంలోని ప్యారడైజ్ పందిట్లో ఏప్రిల్ 30వ తేదీన వారు పెళ్లి చేసుకోబోతున్నారు. నిశ్చితార్థానికే సిగ్గేలనే... ఎగ్గేలనే ...అనుకుంటూ చెమటోడ్చి ముద్దులు పెట్టుకున్న వారు పెళ్లికి మరెలాంటి విన్యాసాలు చేస్తూ ఆహూతులను ఆకట్టుకుంటారో మరి! -
అబ్బురం.. అరవ దాసు సాహస విన్యాసాలు
నెల్లూరు(బృందావనం) : ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలన్న ఆశయంతో నెల్లూరుకు చెందిన అరవ దాసు ప్రదర్శించిన సాహస విన్యాసాలు వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధుల ఎదుట ప్రదర్శించిన సాహసాలు అబ్బురపరిచాయి. స్థానిక సుబేదారుపేట సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో బుధవారం జరిగిన ‘రికార్డుల నమోదు’ కార్యక్రమం విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే... స్థానిక కపాడిపాళేనికి చెందిన అరవ దాసు గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలన్న సంకల్పంతో తొమ్మిది కేజీల బరువు ఉన్న సిమెంట్ దిమ్మెను బొటనవేలి గోరుకు ఇనుప తీగ కట్టి ఐదు అడుగులకుపైగా ఎత్తి 74 సెకన్ల పాటు రెండు పర్యాయాలు ప్రదర్శించారు. అనంతరం 4.800 కేజీల బరువు ఉన్న రెండు కాలుతున్న గడ్డపారల(మొత్తం 9.600 కేజీలు)ను రెండు చేతులతో పట్టుకుని కర్రసాములో కర్రలను తిప్పినట్లు నిమిషం 16 సెకన్ల పాటు ప్రదర్శించి హర్షధ్వానాలు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి, రికార్డు నమోదు చేసేందుకు హైదరాబాద్ నుంచి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సౌత్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేంద్రగౌడ్, వండర్బుక్ ఆఫ్ రికార్డ్సు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ కో-ఆర్డినేటర్ గుర్రం స్వర్ణశ్రీ హాజరయ్యారు. అద్భుత ప్రదర్శన నెల్లూరులో అరవ దాసు ప్రదర్శించిన విన్యాసాలు అద్భుతం. ఎంతో క్లిష్టతరమైనవి. ఆయన 57 ఏళ్ల వయస్సులో గోటితో బరువును ఎత్తడం ప్రపంచ రికార్డుగా భావిస్తున్నాం. ఈ విషయాన్ని గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేసే వారికి దృష్టికి తీసుకెళ్తాం. పేదరికంతో బాధపడుతున్న అరవ దాసును జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రోత్సహించి, జీవనభృతికి కల్పించాలని కోరుతున్నాం. - -బింగినరేంద్రగౌడ్, గుర్రం స్వర్ణశ్రీ, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు ప్రోత్సాహం కావాలి మంచాలు అల్లుకుని జీవనం సాగిస్తున్నాను. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాలని ఉంది. ఇందు కోసం 1991 సంవత్సరం నుంచి పలు విన్యాసాలు చేశాను. సాహస క్రీడలు ప్రదర్శిస్తున్నాను. ప్రోత్సాహం కావాలి. కుమార్తెలు అరవ అశ్విని పీజీ, షీబారాణి డిగ్రీ చదువుతున్నారు. గతంలో గడ్డంతో ఇటుకలు, గొంతుకు ఇనుప కడ్డీతో ట్రాక్టర్‌ను నెట్టడం, జట్టుతో లాగడం తదితర విన్యాసాలు నెల్లూరులో ప్రదర్శించాను. - అరవ దాసు -
సాహసం మా పథం
నాంపల్లిలోని సరోజినీనాయుడు వనితా మహా విద్యాలయలో మంగళవారం వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ సాహస కృత్యాలు, విన్యాసాలు ప్రదర్శించారు. నృత్యాలతో అలరించారు. చేతులపై మోటార్ సైకిళ్లు నడిపించుకొని అబ్బురపరిచారు. కరాటే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. -
విశాఖలో నేవీ విన్యాసాలు
-
మిషన్ ఇంపాజిబుల్..
భూమికి 5 వేల అడుగుల ఎత్తులో సైనిక విమానంపై హీరో సాహసోపేతమైన స్టంట్స్.. చూస్తేనే రోమాలు నిక్కబొడుస్తాయి.. మరి అవి నిజంగా చేస్తేనో.. ఈ ఫొటోలోని సీన్ అదే. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్-5 చిత్రం కోసం డూప్ లేకుండా చేసిన స్టంట్స్ తాలూకు ఫొటో ఇది. వేగంగా దూసుకుపోతున్న సైనిక విమానంపై కేవలం రెండు తాళ్ల సపోర్టుతో నిలబడి స్టంట్స్ చేయడమంటే మాటలా మరి. ఈ మధ్య బ్రిటన్‌లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాల్లో ఓ నటుడు డూప్ లేకుండా చేసిన అత్యంత సాహసవంతమైన స్టంట్ ఇదేనని చెబుతున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రకటన జారీచేశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా కొనసాగుతున్నారు. దీంతోపాటు ఇటీవల ప్రకటించిన రాజ కీయ వ్యవహారాల కమిటీలో సభ్యునిగా చోటు దక్కింది. మళ్లీ ప్రధాన కార్యదర్శిగా నియా మకం కావడంపై జిల్లాలోని వైఎస్సార్సీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పెద్దిరెడ్డి ఎమ్మెల్యే గా, మంత్రిగా కీలక పదవుల్లో కొనసాగారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేశారు. అలాగే ప్రజలకోసం పోరాటాలు సాగించే నేతగా పెద్దిరెడ్డికి మంచిపేరు ఉంది. పార్టీలో రాష్ట్రస్థాయిలో కీలక పదవిలో పెద్దిరెడ్డి నియామకం జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత దోహదపడుతుందని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. సీఎం సొంత జిల్లాలో టీడీపీతో పోలిస్తే వైఎస్సార్‌కాంగ్రెస్ బలంగా ఉందని, అత్యధిక స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నామని, ఈక్రమంలో పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని విశ్వసిస్తున్నారు. -
నా పిల్లల కోసమే...షారుఖ్
ముంబై: త్వరలో విడుదల కానున్న ‘హ్యేపీ న్యూ ఇయర్’ సినిమాలో స్టంట్లు, సాహస విన్యాసాలు కేవలం తన పిల్లలు సుహానా, ఆర్యన్ కోసమే చేశానని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ చెప్పాడు. ‘నాకు ఇద్దరు పిల్లలు. స్టంట్లు చేయాలని వారు చెప్పారు. భార్య గౌరి కంటే కూడా ఎక్కువగా వారి మాటే వింటాను. సవాలు లాంటి వాటిని కనుక చేయలేకపోతే వాటి గాయాలకు భయపడిపోృుునట్టు నాకు అనిపిస్తుంది’ అని అన్నాడు. 48 ఏళ్ల షారుఖ్ ‘హ్యేపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. భుజం తదితర చోట్ల ఏర్పడిన గాయాలవల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు మరింత బలీయంగా తయారయ్యా. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఓ నటుడిగా శారీరకంగా, మానసికంగా బలంగా ఉండగలగాలి. నేను చేయగలిగినమేరకు చేస్తా. భవనంపై నుంచి కిందికి దూకా. ఎంతో భయమనిపించింది. ఓ తాడు పట్టుకుని దూకాల్సి ఉంటుంది. అందువల్ల సురక్షితమే. ఓ సూపర్‌స్టార్ కెమెరా ముందు ఏవిధంగా నటిస్తాడనే విషయం తెలుసుకోవాలనేది అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. అయితే వారి పిల్లలు మాత్రం అటువంటివి చేయాలని కోరుకోరు షూటింగ్‌లు చూసిచూసి వారు విసిగిపోతారు. అందువల్ల వారు అంత ఎక్కువగా షూటింగ్ స్పాట్‌కు రావడానికి ఇష్టపడరు. ముంబైలో షూటింగ్ జరుగుతుంటే మాత్రం మా పిల్లలు రారు. షూటింగ్‌ను వారు ద్వేషిస్తారు. ఇక విదేశాల్లో షూటింగ్ ఉంటే రావాలని వారికి అనిపించినా విద్యాభ్యాసం కారణంగా అప్పుడప్పుడూ వస్తుంటారు’ అని అన్నాడు. కాగా వృత్తిపరంగా నిరంతరం తీరిక లేకుండా గడిపే షారుఖ్‌ఖాన్ ఆ కారణంగా ఎక్కువ రోజులు కుటుంబానికి దూరంగానే ఉండాల్సి వస్తుంది. అయితే షూటింగ్ విరామ సమయంలో అంతా కుటుంబమంతా కలిసి బయటికి వెళతారు. -
నాంపల్లి ఎగ్జిబీషన్‌లో అదరగొట్టే విన్యాసాలు