
రిస్కీ స్టంట్స్: వైరల్ వీడియో
పంజాబ్: బైక్ విచిత్ర విన్యాసాలు, అనేక రిస్కీ స్టంట్‌లు, సాహస కృత్యాలు మనం చాలా చూశాం. తాజాగా పంజాబ్‌లోని ఓ యువరైతు తనదైన శైలి విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాడు. బైక్‌పై విన్యాసాలు చేయాలని ఆశపడిన అతగాడికి బైక్ కొనుక్కునే ఆర్థిక వెసులుబాటు లేదని కుంగిపోలేదు. అందుబాటులో ఉన్నదాన్ని అందిపుచ్చుకుని వెరైటీగా సాహసకృత్యాలతో ఆకర్షిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు ట్రెండీగా నిలిచింది.
పంజాబ్‌కు చెందిన యువరైతు గాగ్గి బన్స్రా (21)కి చిన్నప్పటినుంచీ సాహసాలు, విన్యాసాలు అంటే మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో తన తండ్రి వ్యవసాయాన్ని అందిపుచ్చుక్ను బన్సా తనకు అందుబాటులో ఉన్న ట్రాక్టర్‌తో విన్యాసాలు చేయడం మొదలు పెట్టాడు. మొదట్లో విఫలమైనా , రాను రాను పట్టు సాధించాడు. ఒక టన్ను బరువున్న ట్రాక్టర్ నడుపుతూ రకరకాల విన్యాసాలతో చుట్టుపక్కల గ్రామాల వారిని పైతం ఆకట్టుకుంటున్నాడు. యూ ట్యూబ్‌లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.