డూప్ వద్దన్న బాలయ్య | nandamuri balakrishna dupeless stunts in dictator | Sakshi
Sakshi News home page

డూప్ వద్దన్న బాలయ్య

Published Fri, Dec 18 2015 9:52 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

డూప్ వద్దన్న బాలయ్య - Sakshi

డూప్ వద్దన్న బాలయ్య

ప్రస్తుతం డిక్టేటర్ సినిమాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ సినిమా కోసం కొన్ని ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నాడు. సినిమా క్లైమాక్స్లో వచ్చే ఈ ఫైట్ సీక్వన్స్ను దాదాపు 150 మంది ఫైటర్లతో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వన్స్లో హీరో కొన్ని రిస్కీ స్టంట్స్ చేయాల్సి రావటంతో ఆ సీన్స్ను డూప్తో చేయించాలని భావించారు చిత్రయూనిట్. అయితే అందుకు అంగీకరించని బాలయ్య తానే ఆ సీన్స్ లో నటిస్తున్నాడు.

55 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా బాలయ్య చేస్తున్న స్టంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లౌక్యం సక్సెస్తో సూపర్ ఫాంలో ఉన్న శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement