'రామారావు గారు'గా బాలయ్య | Nandamuri bala krishna as ramarao garu | Sakshi
Sakshi News home page

'రామారావు గారు'గా బాలయ్య

Published Fri, Jan 29 2016 2:13 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

'రామారావు గారు'గా బాలయ్య - Sakshi

'రామారావు గారు'గా బాలయ్య

డిక్టేటర్ సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా, బాలయ్య మాత్రం జోరు తగ్గించటం లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే వందో సినిమా కోసం ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టిన బాలయ్య నూట ఒకటో సినిమాను కూడా ఫైనల్ చేశాడు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఆదిత్య 999 తరువాత రామారావుగారు అనే ఆసక్తికర టైటిల్తో సినిమాకు రెడీ అవుతున్నాడు.

కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన అనీల్ రావిపూడి, ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బాలకృష్ణ హీరోగా మరో సినిమాను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు అనీల్. ఇప్పటికే రామారావుగారు కథను బాలయ్యకు వినిపించిన దర్శకుడు త్వరలోనే ఆ కథకు తుది రూపు తీసుకొచ్చేందుకు పని ప్రారంభించనున్నాడు.

బాలయ్య వందో సినిమా పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి, ఈ లోగా రామారావుగారు కథను పక్కాగా రెడీ చేసి బాలకృష్ణతో కూడా భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా రామారావుగారి పాత్రలో బాలయ్య కనిపించనున్నాడన్న వార్తతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement