కొత్త దర్శకుడితో వందో సినిమా...? | balakrishna 100th movie with paruchuri ravindhra | Sakshi
Sakshi News home page

కొత్త దర్శకుడితో వందో సినిమా...?

Published Tue, Jan 19 2016 10:33 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

కొత్త దర్శకుడితో వందో సినిమా...? - Sakshi

కొత్త దర్శకుడితో వందో సినిమా...?

డిక్టేటర్ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న బాలకృష్ణ తన వందో సినిమా మీద దృష్టిపెట్టాడు. చాలా కాలంగా ఈ సినిమా విషయంలో కసరత్తులు చేస్తున్న బాలయ్య ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టాడు. తనకు సింహా, లెజెండ్ లాంటి భారీ సక్సెస్లను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో గాని, తన కెరీర్లో ప్రత్యేక చిత్రాలుగా నిలిచిన ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాస్ దర్శతక్వంలో గాని సినిమా చేయాలని భావించారు.

ప్రస్తుతం అల్లు అర్జున్తో సరైనోడు సినిమా షూటింగ్లో ఉన్న బోయపాటి ఆ సినిమా తరువాత బాలయ్య సినిమా కథ రెడీ చేయాలని భావిస్తున్నాడు. సింగీతం శ్రీనివాస్ ఇప్పటికే ఆదిత్య 369 సినిమాకు సీక్వల్గా ఆదిత్య 999 స్క్రీప్ట్ను సిద్దం చేశారు. దీంతో సింగీతం దర్శకత్వంలోనే బాలయ్య వందో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. పలు సందర్భాల్లో బాలయ్య కూడా అదే విషయాన్ని వెల్లడించారు. అయితే తాజాగా మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర్రావు తనయుడు పరుచూరి రవీంద్ర తన తొలి సినిమాను బాలయ్య హీరోగా డైరెక్ట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఓ జానపద కథను బాలయ్యకు వినిపించిన రవీంద్ర తన అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాడు. భారీ గ్రాఫిక్స్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు రవీంద్ర. మరి బాలకృష్ణ వందో సినిమా విషయంలో ఇలాంటి ప్రయోగానికి ఓకె చెపుతాడో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement