త్వరలోనే నా వందో చిత్రం: బాలకృష్ణ | 100th moive to be come soon, says balakrishna | Sakshi
Sakshi News home page

త్వరలోనే నా వందో చిత్రం: బాలకృష్ణ

Published Sat, Jan 23 2016 9:48 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

త్వరలోనే నా వందో చిత్రం: బాలకృష్ణ - Sakshi

త్వరలోనే నా వందో చిత్రం: బాలకృష్ణ

కంబాలచెరువు : డిక్టేటర్ చిత్ర విజయయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరంలోని అనుశ్రీ సినిమాస్ థియేటర్‌కు ఆ చిత్రం హీరో నందమూరి బాలకృష్ణ వచ్చారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే తన వందో సినిమా ఉంటుందన్నారు. అనంతరం ఆ సినిమాలోని డైలాగులతో సందడి చేశారు. హైదరాబాద్‌లో మాదిరిగానే ఉభయగోదావరి, కృష్ణాజిల్లావాసుల కోసం బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని బాలకృష్ణను ఎంపీ మురళీమోహన్ కోరారు.
 
వైజాగ్ నుంచి రోడ్డుమార్గంలో వస్తున్న బాలకృష్ణ ముందుగా తలుపులమ్మ లోవలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ చిత్ర దర్శకులు శ్రీవాస్, సినీనటుడు పృథ్వీరాజ్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్, అనుశ్రీ సినిమాస్ అధినేత సత్యనారాయణ, చిత్ర పంపిణీదారులు చల్లా శంకర్రావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement