వందో సినిమాకు కథ అందిస్తున్న బాలయ్య | Balakrishna story for aditya 999 | Sakshi
Sakshi News home page

వందో సినిమాకు కథ అందిస్తున్న బాలయ్య

Published Thu, Jan 21 2016 11:43 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

వందో సినిమాకు కథ అందిస్తున్న బాలయ్య - Sakshi

వందో సినిమాకు కథ అందిస్తున్న బాలయ్య

డిక్టేటర్ తో 99 సినిమాలు పూర్తి చేసిన బాలకృష్ణ, వందో సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమా కావటంతో ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్ ఓ వినిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య వందో సినిమాకు ఇద్దరు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తుండగా తాజాగా మరో కొత్త దర్శకుడు కూడా లైన్ లోకి వచ్చాడు.

తాజాగా మరో ఆసక్తికరమైన వార్త నందమూరి అభిమానులను ఖుషీ చేస్తోంది. తన వందో సినిమాకు తానే స్వయంగా కథ అందించాడట బాలయ్య. ఇప్పటికే బాలకృష్ణ చెప్పిన లైన్ ను డెవలప్ చేసిన సింగీతం శ్రీనివాసరావు పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఈ సినిమాకు తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫామ్ చేయకపోయినా, తన సొంత కథతోనే బాలయ్య వందో సినిమా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement