Youth Arrested For Doing Cartwheels On Railway Station Platform Bihar - Sakshi
Sakshi News home page

రైల్వే ప్లాట్‌ఫాంపై యువకుడి స్టంట్స్‌.. వాళ్ల రాకతో సీన్‌ రివర్స్‌!

Published Thu, Jul 13 2023 1:40 PM | Last Updated on Thu, Jul 13 2023 3:57 PM

Youth Arrested For Doing Cartwheels On Railway Station Platform Bihar - Sakshi

పాట్నా: ఇంటర్నెట్‌ వాడకం పెరగడంతో సోషల్‌ మీడియాలో యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోంది. ఇక నెట్టింట తమ టాలెంట్‌ను ప్రదర్శించి కొందరు రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిన ఘటనలు బోలెడు ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్‌ నుంచి ఈ ట్రెండ్‌ మరింత ఊపందుకుంది. దీంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని చిరాకు తెప్పించేలా ఉంటున్నాయి. ఇంకొంత మంది మరో అడుగు మందుకేసి ప్రమాదకరమైనవి కూడా ప్రదర్శిస్తూ ప్రజలకు ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు.

ఎందుకీ స్టంట్స్‌...
తాజాగా ఓ యువకుడు రైల్వేస్టేషన్‌లో జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు ప్రదర్శించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే,ఆ యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు అతనికి ఊహించని షాక్‌ ఇచ్చారు. ఈ ఘటన బిహార్‌లోని మాన్‌పుర్‌ జంక్షన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై రైలు ఆగి ఉంది. అంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చి జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు చేయడం చేయడం ప్రారంభించాడు. ఈ తరహా ఘటనలో ఇటీవల ఎక్కవ కావడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్పీఎఫ్‌.. అతడిని అరెస్టు చేసింది.

అనంతరం అతని వీడియో షేర్‌ చేసి.. ఈ మేరకు ట్వీట్‌ చేసింది..‘మాన్‌పుర్‌ జంక్షన్‌లో ఓ యువకుడు తన నిర్లక్ష్యపూరిత విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. స్టేషన్‌లోకి అనధికారికంగా ప్రవేశించడంతోపాటు గందరగోళం సృష్టించే యత్నం చేశాడన్న ఆరోపణలపై అతడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్ల కోసం తెగించేవారికి ఇదొక గుణపాఠంగా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అతడి ప్రవర్తనను వ్యతిరేకించినప్పటికీ.. యువకుడి అరెస్టు చేయడాన్ని తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేసి ఉండాల్సిందిగా అభిప్రాయపడ్డారు. మరికొందరు ఆర్పీఎఫ్‌ తీసుకున్న నిర్ణయం సరైందేనని కామెంట్లు పెడుతున్నారు.


 

చదవండి: Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement