
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక తన ఆరోగ్యంపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరోవైపు ఆధ్యాత్మిక బాట పట్టింది. ఇటీవలే కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే త్వరలోనే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే?)
ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో ఉన్న సమంత వర్కవుట్ వీడియో వైరల్‌గా మారింది. అత్యంత సాహోసపేతమైన స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోను సామ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. 'క్లబ్‍లో మేం ఇలానే పార్టీ చేసుకుంటాం' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలి ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇక సినిమాల విషయాకొనిస్తే.. విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.
(ఇది చదవండి: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్!)
#SamanthaRuthPrabhu shows off how she parties and it's unlike anything you imagined 🙌🔥#Samantha #pinkvilla pic.twitter.com/5pEebwJhPv
— Pinkvilla (@pinkvilla) July 25, 2023