![Hollywood Stunt Coordinator Spiro Razatos Gets A Shoutout From Shah Rukh Khan Over Jawan - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/25/JawanNewPoster.jpg.webp?itok=CtfVnEUj)
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, వెనోమ్, స్టార్ ట్రెక్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ సీన్స్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాంటి ఫైట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు షారుక్ ఖాన్. ఆ హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా చేసిన స్పీరో రజటోస్ ఆధ్వర్యంలో షారుక్ ‘జవాన్’ కోసం రిస్కీ ఫైట్స్ చేశారు.
షారుక్ ఖాన్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన చిత్రం ‘జవాన్’. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రిస్కీ స్టంట్స్‌ని హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ స్పీరో రజటోస్ సమకూర్చారని యూనిట్ పేర్కొంది. ‘‘జవాన్’లో షారుక్ చేసిన రిస్కీ ఫైట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. స్పీరో రజటోస్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment