risky
-
జవాన్ రిస్క్
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, వెనోమ్, స్టార్ ట్రెక్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ సీన్స్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాంటి ఫైట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు షారుక్ ఖాన్. ఆ హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా చేసిన స్పీరో రజటోస్ ఆధ్వర్యంలో షారుక్ ‘జవాన్’ కోసం రిస్కీ ఫైట్స్ చేశారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన చిత్రం ‘జవాన్’. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రిస్కీ స్టంట్స్‌ని హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ స్పీరో రజటోస్ సమకూర్చారని యూనిట్ పేర్కొంది. ‘‘జవాన్’లో షారుక్ చేసిన రిస్కీ ఫైట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. స్పీరో రజటోస్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
యూజర్లూ బీ అలర్ట్! 2022 మోస్ట్ రిస్కీ బ్రౌజర్ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్. 2022లో అత్యంత ప్రమాదకరమైన ఇంటర్నెట్ బ్రౌజర్‌గా క్రోమ్ తేలిందట. అట్లాస్ వీపీఎన్ తాజా విశ్లేషణ ప్రకారం 10 నెలల వ్యవధిలో గూగుల్ క్రోమ్ అత్యధికంగా 303 సమస్యలను ఎదుర్కొన్నట్లు కనుగొంది. అలాగే లైఫ్ టైంలో ఈ బ్రౌజర్ మొత్తం 3,159 వల్నరబులిటీలను ఎదుర్కొందని విశ్లేషించింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) గూగుల్ క్రోమ్ తరువాత మొజిల్లా ఫైర్ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, యాపిల్ సఫారీ ఈ కోవలో నిలిచాయి. డేటా దుర్బలత్వ డేటాబేస్ (VulDB) నుండి వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. జనవరి 1 నుండి అక్టోబర్ 5 వరకు డేటాను ఇది రివ్యూ చేసింది. పరిశోధన ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు Google Chrome మాత్రమే సమస్యలక గురైంది. ముఖ్యంగా CVE-2022-3318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309, CVE-2022-3307 ఈ కొత్త భద్రతా సమస్యలు ప్రతీ డివైస్ మెమరీని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే బ్రౌజర్ వెర్షన్ 106.0.5249.61కి అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని వెల్లడించింది. 2022లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 103 భద్రతా సమస్యలను, మొజిల్లా ఫైర్ఫాక్స్ 117 సమస్యలను ఎదుర్కొంది. మైక్రోసాప్ట్ ఎడ్జ్ లాంచ్ తరువాత మొత్తం 806 వల్నరబులిటీస్ని ఫేస్ చేసింది. 2021 నుండి 62 శాతం పెరుగుదల. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ ఇటీవల వినియోగదారుల సంఖ్య ఇటీవల ఒక బిలియన్‌ను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సఫారీ రెండవ స్థానానికి చేరుకుంది. 2022లో, ఈ బ్రౌజర్ అతి తక్కువ సమస్యలొచ్చాయి. ఈ పరిశోధన సమయంలో కేవలం 26 వల్నరబులిటీస్ని మాత్రమే ఎదుర్కొంది. అయితే మొత్తంగా 1,139 దుర్బలత్వాలను ఎదుర్కోవడం గమనార్హం. చివరగా, మొత్తం లైఫ్ టైంలో 344 భద్రతా సమస్యలను ఎదుర్కొన్న ఒపెరా బ్రౌజర్‌కు ఈ కాలంలో ఎలాంటి సమస్యా రాలేదు. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా బ్రౌజర్లు ఒకే Chromium ఇంజిన్‌పై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు వాటిని ప్రభావితం చేయవచ్చని పరిశోధన వెల్లడించింది. -
శాస్త్రవేత్తలను రక్షించేందుకు సాహసం...
అనారోగ్యంతో ఉన్న ఇద్దరు సైంటిస్టుల ప్రాణాలు కాపాడేందుకు దక్షిణ ధృవానికి అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా రెండు చిన్న విమానాలు బయల్దేరాయి. అంటార్కిటికాలో శీతాకాలం నడుస్తున్న సమయంలో ఇటువంటి ప్రయోగం నిజంగా సాహసమేనని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పోలార్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ కెల్లీ ఫాల్కనర్ తెలిపారు. దక్షిణ ధృవానికి వెళ్ళిన ఇద్దరు శాస్త్రవేత్తలకు కొన్ని అనుకోని కారణాలవల్ల అనారోగ్యం సంభవించిందని, అయితే వారిప్రాణాలు రక్షించేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెల్లీ పాల్కనర్ వివరించారు. ప్రతియేటా 50 మంది శాస్త్రవేత్తల బృదం శీతాకాలానికి ముందే దక్షిణ ధృవానికి చేరుకుని అక్కడే దాదాపు ఆరునెలలు ఉంటారు. శీతాకాలం సమయంలో అక్కడినుంచీ వారు ఎట్టిపరిస్థితిలో బయటకు వచ్చే అవకాశం ఉండదని, రేడియో కాంట్రాక్టుద్వారా అమెరికా, రష్యాల్లోని కమాండింగ్ సెంటర్లకు సమాచారం పంపుతుంటారు. అయితే ఈ సీజన్ లో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనుకోకుండా అనారోగ్యం సంభవించినట్లు సమాచారం అందిందని, ప్రయోగాత్మకంగా వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పాల్కనర్ తెలిపారు. అయితే వారికి అందించే మెడికల్ హెల్ప్ కు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం గోప్యతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్, లాక్ హీడ్ మార్టిన్ లు కలసి ప్రతి సంవత్సరం దక్షిణ ధృవానికి వెళ్ళే ఈ బృందాన్ని ఎంపిక చేస్తుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము అన్ని నిర్ణయాలు సమతుల్యంగా ఉండేట్లు ప్రయత్నిస్తున్నామని పాల్కనర్ చెప్తున్నారు. ఈ సమయంలో రోగుల పరిస్థితి, విమాన సిబ్బంది భద్రత తో పాటు అముంద్సేన్ స్కాట్ లోని మిగిలిన 48 మంది శాస్త్రవేత్తల అసవసరాలను కూడ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అయితే 60 సంవత్సరాల సౌత్ పోల్ రీసెర్స్ సెంటర్ చరిత్రలో ఈ తరహా రెస్క్యూ ఆపరేషన్లు రెండు మాత్రమే జరిగాయని, ఇటువంటివి ఆసాధారణంగా ఉంటాయని, శీతాకాలంలో అత్యంత మంచుతోను, చీకటిగాను ఉన్నసమయంలో అక్కడ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ వంటి వాటికి ఎంతమాత్రం అనుకూలంగా ఉండదని అంటున్నారు. 1999 లో, ఓ డాక్టర్ తన ఛాతీభాగంలో క్యాన్సర్ కణతిని గుర్తించి, తనకు తానే శస్త్రచికిత్స చేసుకొని, అనంతరం కీమో థెరపీ చేసుకోగా, ఆమెను బయటకు తెచ్చేందుకు శీతాకాలం ముగిసే సమయంలో బృందం వెళ్ళింది. పదేళ్ళ తర్వాత 2001 ఆగస్టులో ఓ మేనేజర్ గుండెపోటుకు గురికాగా, ఓ వైమానిక బృదం రిస్క్ తీసుకొని మరీ అక్కడకు వెళ్ళి ఆయన్ను క్షేమంగా బయటకు తెచ్చింది. కాగా ప్రస్తుతం దక్షిణ ధృవంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనారోగ్యం సంభవించడంతో నేషనల్ ఫౌండేషన్ అధికారులు వారిని క్షేమంగా బయటకు తెచ్చే సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు.