అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత? | Jawan Movie: Nayanthara Is Unhappy With Shah Rukh Khan And Atlee; Here's Clarity - Sakshi
Sakshi News home page

Jawan : అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?

Published Sat, Sep 9 2023 7:48 AM | Last Updated on Sat, Sep 9 2023 8:28 AM

Jawan Movie: Nayanthara Unhappy With Shah Rukh Khan, Atlee , Here Clarity - Sakshi

తమిళసినిమా: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్నది సామెత. అయితే ఇది కొందరి విషయంలో అక్షరసత్యంగా మారుతుంది. ముఖ్యంగా నటి నయనతార పరిస్థితి ఇదే. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. తాజాగా జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో ఇండియన్‌ సినిమా తారగా గుర్తింపుపొందారు. నయనతార నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఈమైపె సంచలన నటిగా ముద్రవేశారు. నటిగా రెండు దశాబ్దాలకు దగ్గరలో ఉన్న నయనతార 75 చిత్రాల మైలురాయిని అవలీలగా అధిగమించి నాటౌట్‌గా వెలుగొందుతున్నారు.

కాగా దీని గురించి ఇటీవల ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. జవాన్‌ చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదని దర్శకుడు అట్లీ, నటుడు షారుక్‌ఖాన్‌లపై అసంతృప్తిగా ఉన్నారన్నది ఆ వదంతి. అయితే జవాన్‌ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై అనూహ్యంగా వసూళ్లను కురిపిస్తోంది. ఇది ఇండియాలో ఒకరోజులో రూ.75 కోట్లు వసూళ్లు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు సాధించి గత రికార్డులను తిరగరాస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే జవాన్‌ చిత్రంలో నయనతారకు తగిన ప్రాధాన్యత ఉంది. ఆమెకు యాక్షన్‌ సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. మరో విషయం ఏమిటంటే నటుడు షారుక్‌ఖాన్‌ అంటే నయనతారకు పిచ్చి అభిమానం. ఇక అట్లి దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో కథానాయకి నయనతారనే ఆ తర్వాత బిగిల్‌ చిత్రంలో విజయ్‌ సరసన నయనతారనే నటింపజేశారు. ఇకపోతే జవాన్‌ చిత్రం సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేయడానికి నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి ముంబై వెళ్లారు. ఈ జంటను ముంబై విమానాశ్రయంలో ఫొటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కాబట్టి జవాన్‌ చిత్ర దర్శక నిర్మాతలపై నయనతార అసంతృప్తిగా ఉన్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేటతెల్లమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement