Action Choreographer
-
యశ్ ‘టాక్సిక్’ కోసం రంగంలోకి ‘అవతార్’ ఫైటర్స్
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. మలయాళ నటుడు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో యశ్ సోదరి పాత్రలో నయనతార, యశ్ ప్రేయసిగా కియారా అద్వానీ నటిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల నయనతార, యశ్‌లు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు గీతూమోహన్ దాస్. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఇందుకు హాలీవుడ్లో ‘జాన్ విక్: చాఫ్టర్2, ఎఫ్ 9, అవతార్: ద వే ఆఫ్ వాటర్’ వంటి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలకు పని చేసిన జేజే ఫెర్రీ ‘టాక్సిక్’ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ముంబైలో వాలిపోయారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీకి సినిమా విడుదల కావడం లేదని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని యశ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘టాక్సిక్’ తో ΄ాటుగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా చేస్తున్నారు యశ్. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ఫైట్ మాస్టర్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు చేస్తున్న నటులు పెరుగుతున్నారు. దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు.. ఇలా అందరూ హీరోలు అయిపోతున్నారు. తాజాగా ప్రముఖ ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్ కూడా కథానాయకుడిగా ఎంట్రీకి రెడీ అయిపోయాడు. ఎం.వెట్రి దర్శకత్వం వహించనున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ కథాచిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ అధినేత జేఎం బషీర్, యంటీ సినిమాస్ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నెలో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) నిర్మాతల్లో ఒకరైన బషీర్ మాట్లాడుతూ.. నేను, నా మిత్రుడు చౌదరి కలిసి ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్ని హీరోగా పరిచయం చేస్తూ ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీయాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. అది ఇప్పటికి నెరవేరింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో పీటర్ హెయిన్ భాగమే. ఇప్పుడు ఆయన హీరోగా పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నాం. ఇకపోతే పీటర్ హెయిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం తాను ఏమేం చేయగలనో అది చేస్తానని, ఇందులో అటవీ వాసీగా యాక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. సరికొత్త యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని అన్నాడు. ఇందులో నటించడానికి తాను ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!) -
ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్‌తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్. షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించి తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నటించిన పఠాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో జవాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇందులో కోలీవుడ్ నటీనటులు, సాంకేతిక వర్గం ఎక్కువగా పని చేశారు. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఇందులో నయనతార నాయకిగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన జవాన్‌లో మరో విశేషం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ పని చేయడం. స్పిరో రజటొస్, యనిక్ బెన్, ట్రెయిన్ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్ అరసు మొదలగు ఆరుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు, బైక్, కారు ఛేజింగ్స్ జవాన్ చిత్రంలో హైలెట్ కానున్నాయని యూనిట్ సభ్యులు తెలిపాయి. (ఇదీ చదవండి: చిరంజీవిపై విషప్రయోగం.. 35 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం!) జవాన్ చిత్రం ట్రైలర్ చూస్తేనే యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. పాటలను భారీగా ఖర్చు చేసి బ్రహ్మాండంగా చిత్రీకరించారు. దీంతో జవాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 7వ తేదీన తెరపైకి రానుంది. -
జవాన్ రిస్క్
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, వెనోమ్, స్టార్ ట్రెక్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ సీన్స్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాంటి ఫైట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు షారుక్ ఖాన్. ఆ హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా చేసిన స్పీరో రజటోస్ ఆధ్వర్యంలో షారుక్ ‘జవాన్’ కోసం రిస్కీ ఫైట్స్ చేశారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన చిత్రం ‘జవాన్’. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రిస్కీ స్టంట్స్‌ని హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ స్పీరో రజటోస్ సమకూర్చారని యూనిట్ పేర్కొంది. ‘‘జవాన్’లో షారుక్ చేసిన రిస్కీ ఫైట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. స్పీరో రజటోస్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూత
సీనియర్ ఫైట్‌మాస్టర్ జూడో కేకే రత్నం (92) వృద్ధాప్యం కారణంగా గురువారం తుది శ్వాస విడిచారు. 1930 ఆగస్టు 8న జన్మించిన జూడో రత్నం 1959లో తమిళ చిత్రం ‘తామరై కుళం’ ద్వారా నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. 1966లో ‘వల్లవన్ ఒరువన్’ చిత్రంతో ఫైట్‌మాస్టర్‌గా మారారు. ఎంజీఆర్, శివాజీగణేశన్, జయశంకర్, రజనీకాంత్, కమల్‌హాసన్, విజయకాంత్ వంటి ప్రముఖ హీరోలకు ఫైట్‌మాస్టర్‌గా చేశారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 1500 చిత్రాలకుపైగా ఆయన ఫైట్ మాస్టర్‌గా చేశారు. సుందర్ సి. హీరోగా నటించిన ‘తలై నగరం’(2006) జూడో రత్నం నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి స్వగ్రామం గుడియాత్తంలో స్థిరపడ్డారాయన. ప్రస్తుతం ప్రముఖ ఫైట్ మాస్టర్లుగా కొనసాగుతున్న జాగ్వార్ తంగం, సూపర్ సుబ్బరాయన్ వంటివారు జూడో రత్నం వద్ద పనిచేశారు.