యశ్‌ ‘టాక్సిక్‌’ కోసం రంగంలోకి ‘అవతార్‌’ ఫైటర్స్‌ | Yash Toxic Movie Latest Update | Sakshi
Sakshi News home page

యశ్‌ ‘టాక్సిక్‌’ కోసం రంగంలోకి ‘అవతార్‌’ ఫైటర్స్‌

Published Sun, Nov 10 2024 9:19 AM | Last Updated on Sun, Nov 10 2024 11:27 AM

Yash Toxic Movie Latest Update

‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1, కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్స్‌ తర్వాత కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌  అప్స్‌’. మలయాళ నటుడు గీతూ మోహన్‌  దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో యశ్‌ సోదరి పాత్రలో నయనతార, యశ్‌ ప్రేయసిగా కియారా అద్వానీ నటిస్తున్నారని టాక్‌. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. 

ఇటీవల నయనతార, యశ్‌లు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు గీతూమోహన్‌ దాస్‌. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఇందుకు హాలీవుడ్‌లో ‘జాన్‌ విక్‌: చాఫ్టర్‌2, ఎఫ్‌ 9, అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్‌’ వంటి భారీ బడ్జెట్‌ యాక్షన్‌  సినిమాలకు పని చేసిన జేజే ఫెర్రీ ‘టాక్సిక్‌’ సినిమాలోని యాక్షన్‌  సీక్వెన్స్‌ను డిజైన్‌  చేస్తున్నారు. 

ఇప్పటికే ఆయన ముంబైలో వాలిపోయారు. డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు తొలుత మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఆ తేదీకి సినిమా విడుదల కావడం లేదని, త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తామని యశ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘టాక్సిక్‌’ తో ΄ాటుగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా చేస్తున్నారు యశ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement