
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్. షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించి తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నటించిన పఠాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో జవాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇందులో కోలీవుడ్ నటీనటులు, సాంకేతిక వర్గం ఎక్కువగా పని చేశారు. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఇందులో నయనతార నాయకిగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు.
అనిరుధ్ సంగీతాన్ని అందించిన జవాన్‌లో మరో విశేషం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ పని చేయడం. స్పిరో రజటొస్, యనిక్ బెన్, ట్రెయిన్ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్ అరసు మొదలగు ఆరుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు, బైక్, కారు ఛేజింగ్స్ జవాన్ చిత్రంలో హైలెట్ కానున్నాయని యూనిట్ సభ్యులు తెలిపాయి.
(ఇదీ చదవండి: చిరంజీవిపై విషప్రయోగం.. 35 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం!)
జవాన్ చిత్రం ట్రైలర్ చూస్తేనే యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. పాటలను భారీగా ఖర్చు చేసి బ్రహ్మాండంగా చిత్రీకరించారు. దీంతో జవాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 7వ తేదీన తెరపైకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment