
Hyderabad Viral Video: వీసీ సజ్జనార్ మరోసారి తన మార్క్ చూపించారు. ఓ యువకుడికి సలహా ఇస్తూనే.. టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూటీపై వెళ్తున్న యువకుడు.. బస్సును వెనుక నుంచి కాలితో నెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
ఇది కాస్త వైరల్ కావడంతో.. సజ్జనార్ స్పందించారు. ప్రమాదాల బారిన పడి.. మీ తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దని సూచిస్తూ ట్వీట్ చేశారాయన. అంతేకాదు.. చట్టప్రకారం.. ఇలాంటి వారిపై చర్యల కూడా ఉంటాయని తెలిపారు.
ఇదిలా ఉంటే.. మిథానీ డిపోకు చెందిన ఓ బస్సుపై సదరు యువకుడు స్టంట్లు చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఇన్‌స్టంట్ పాపులారిటీ కోసం పాకులాడుతూ.. ప్రమాదాలు పడుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం.
తన సొంత అకౌంట్‌నుంచి.. వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి అంటూ ట్వీట్ చేశారు. ఆపై ఆర్టీసీ ఎండీ హోదాలో మరో ట్విటర్ అకౌంట్ నుంచి.. ఇలాంటి చర్యలకు కఠిన చర్యలు ఉంటాయని మరో ట్వీట్ చేశారాయన.
ఇలాంటి ఘటనలను #TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. @TSRTCHQ https://t.co/AHSQQ7xbO9
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 2, 2023
Comments
Please login to add a commentAdd a comment