సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సంస్థను లాభాల పట్టించేదుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనదైన శైలిలో ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కావాల్సిన చర్యలను మొదలు పెట్టారు. ఈ సారి ఆయన సోషల్ మీడియాని ఎంచుకున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మరి హల్‌చల్ చేస్తోంది. (చదవండి: Disha Encounter: సజ్జనార్‌పై కమిషన్ ప్రశ్నల వర్షం )
సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చేసేందుకు వివిధ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ..’ అంటూ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆ డైలాగ్‌ను ఉపయోగించుకుని ఓ వీడియోను రూపొందించి నెట్టింట షేర్ చేశారు. రూటు ఏదైనా ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సజ్జనార్.
ఆ వీడియోలో.. ఓ వ్యక్తి రోడ్డు మీద పిల్లతో కలిసి మ్యూజిక్‌కు స్టెప్పులేస్తుంటాడు. ఇంతలో మరో వ్యక్తి అక్కడికి లగేజ్‌తో వస్తాడు. అతడు రోడ్డు మీద ఉన్న వ్యక్తితో తాను జీప్‌లో ఊరికి వెళ్తున్నట్టుగా చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి.. ‘పక్కనే ఆర్టీసీ బస్సు ఉంది.. క్షేమంగా వెళ్లొచ్చు.. డబ్బులు ఎక్కువ తీసుకోరు గానీ.. సుఖీభవ, సుఖీభవ’అంటూ పిల్లతో కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెడతాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది.
#ayyovadama #sukibava #sukibava అయ్యయ్యో వద్దమ్మా కానీ.. సుఖీభవ సుఖీభవ నమ్మకానికి భరోసా మన @TSRTCHQ #RTC బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, మరియు శుభప్రదం. #Dussehra #Dussehrafestival #SupportRTCJourney #Busjourney #TravelinRTCbus #TSRTC #OurRTC #OurPride @Govardhan_MLA pic.twitter.com/VfaxkxPVMH
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 12, 2021
చదవండి: VC Sajjanar: పెద్ద సంఖ్యలో ప్రశ్నలు అడగడంతో ప్రెస్‌మీట్‌లో తప్పులు చెప్పా
Comments
Please login to add a commentAdd a comment