సాక్షి, హైదరాబాద్: పబ్లిక్‌లో రీల్స్ చేయడంపై తెలంగాణ పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియోల కోసం పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టొదని తెలిపారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా.. పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కూకట్‌పల్లిలో ట్రాఫిక్ మధ్యలో డబ్బులు గాల్లోకి చల్లి వాహనదారులకు ఇబ్బంది కలిగించిన యూట్యూబర్ హర్ష అలియాస్ మహాదేవ్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.
‘తమ కెరీర్ లక్ష్యాలపై దృష్టిసారించాల్సిన యువత దారి తప్పుతుంది. సమాజానికి ప్రమాదకరంగా మారి, వారి కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెడుతుంది. ఇలాంటి దుశ్చర్యలపై పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరు. కఠిన చట్టాలు ప్రయోగించి జైలు ఊచల వెనక బందీ చేస్తారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.
యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు. pic.twitter.com/j2MEdYuiLx
— Telangana Police (@TelanganaCOPs) August 23, 2024
కాగా గురువారం కూకట్‌పల్లి యూట్యూబర్ పవర్ హర్ష అలియాస్ మహదేవ్ హల్చల్ చేశాడు. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసిరాడు. దీంతో డబ్బులను పట్టుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఇంతకముందు కూడా చాలాసార్లు ట్రాఫిక్‌లో డబ్బులు గాల్లోకి చల్లుతూ రీల్స్ పోస్ట్ చేశారు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్‌పై స్టాంట్లు కూడా చేశాడు. వీటిని సోషల్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటాడు. హర్ష వ్యవహారంపై వాహనదారులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment