
''ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు ఉండరు''.. ఇది కేజీఎఫ్ సినిమాలో హీరో చెప్పిన ఫేమస్ డైలాగ్. ఇది అక్షరాలా నిజం.. మనకు జన్మనిచ్చిన తల్లిని మనం ఎంత ప్రేమిస్తే.. అంతే ప్రేమను తిరిగి పొందుతామని అంటుంటారు. తాజాగా ఏడుసార్లు ఫార్ములాన్ చాంపియన్(ఎఫ్ 1), మెర్సిడస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన పేరులో చిన్న మార్పు చేయనున్నట్లు తెలిపాడు. ఇకపై తన పేరు తల్లి పేరుతో కలిపి ఉంటుందని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని తెలిపాడు.
''పెళ్లవ్వగానే ఆడవాళ్ల ఇంటిపేరు మారుతుందంటారు. ఇది విన్నప్పుడల్లా నాకు వింతగా అనిపిస్తుంటుంది. ఆడవాళ్ల పేర్లు మారుతాయి తప్ప.. వారి పేర్లను మనలో ఎందుకు చేర్చమో అర్థం కాదు. అందుకే ఇప్పుడు చెబుతున్నా.. నా తల్లి పేరు కార్మెన్ లార్బలీస్టర్ హామిల్టన్. ఇకపై నా పేరులో తల్లి పేరుతో ఉంటుంది. ఇక నా పూర్తి పేరు లుయీస్ లార్బలీస్టర్ హామిల్టన్.. ఎనిమిదో టైటిల్ గెలిచే సమయంలో నా పేరులో అమ్మ పేరు కనిపిస్తుంది.
దీనికి సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిక్స్ ప్రారంభమయ్యేలోగా ఇదంతా పూర్తవుతుందని ఆశిస్తున్నా. ప్రపంచంలో తల్లికి మించి గొప్ప ఎవరు లేరు.. అందుకే పేరు మార్చుకుంటున్నా'' అని చెప్పుకొచ్చాడు. కాగా హామిల్టన్ 12 ఏళ్ల వయసులో తల్లి కార్మెన్ లార్బలీస్టర్.. తండ్రి ఆంథోని హామిల్టన్ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి లుయీస్ హామిల్టన్ తల్లి కార్మెన్‌తోనే ఉంటున్నాడు.
చదవండి: Pat Cummins: సుత్తితో క్రీజులోకి ఆసీస్ కెప్టెన్.. ఎగతాళి చేసిన పాక్ అభిమానులు
Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment