ఆస్టిన్ (అమెరికా): ఈ సీజన్‌లో ఎవరికీ అందనంత వేగంతో దూసుకెళ్తున్న లూయిస్ హామిల్టన్‌కు అమెరికాలో అనూహ్యంగా నిరాశ ఎదురైంది. ఇప్పటికే తొమ్మిది రేసుల్లో విజేతగా నిలిచిన ఈ మెర్సిడెస్ డ్రైవర్ ఇక్కడ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టు కున్నాడు. దీంతో ఐదో ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం అతనికి నిరీక్షణ తప్పడం లేదు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ విజేతగా నిలిచాడు. ఐదేళ్ల తర్వాత అతనికి ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా అతను 2013లో ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో గెలిచాడు. అమెరికన్ సర్క్యూట్‌లో 56 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా రైకోనెన్ 1 గంటా 34 నిమిషాల 18.643 సెకన్లలో పూర్తి చేశాడు.
2.342 సెకన్లు వెనుకబడిన హామిల్టన్ 1:34:16.301 సె. టైమింగ్‌తో మూడో స్థానంతో తృప్తిపడ్డాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ (1:34:17.362 సె.) రెండో స్థానంలో నిలువగా, హామిల్టన్ ప్రత్యర్థి వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం పొందాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో ఈస్ట్‌బెన్ ఒకాన్ డిస్‌క్వాలిఫై కాగా, సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానం పొందాడు. తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్‌ప్రిలో ఒకవేళ వెటెల్ గెలిచినా కూడా... హామిల్టన్ టాప్–7లో నిలిస్తే చాలు ఇతనే ఐదోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరిస్తాడు. వెటెల్ గెలవకపోతే హామిల్టన్ స్థానాలతో సంబంధం లేకుండా విజేతగా నిలుస్తాడు. ప్రస్తుతం హామిల్టన్ (346 పాయింట్లు), వెటెల్ (276 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
హామిల్టన్... ఆగాగు!
Published Tue, Oct 23 2018 12:37 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment