అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీకి ఒక అభిమాని నుంచి వింత అనుభవం ఎదురైంది. ఫిఫా వరల్డ్‌కప్ 2022 క్వాలిఫయింగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈక్వెడార్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ అభిమాని ఒకరు ''మెస్సీ.. మెస్సీ'' అని గట్టిగా అరుస్తూ గ్రౌండ్‌లోకి చొచ్చుకొచ్చాడు. ఇది గమనించకుండా వెళ్తున్న మెస్సీకి అడ్డుగా వెళ్లి.. అతని భుజంపై చేయి వేసి ఒక్క సెల్ఫీ అంటూ అడిగాడు.
అయితే పొరపాటు ఆ అభిమాని తన చెయ్యిని మెస్సీ మెడకు చుట్టేయడంతో ఊపిరి ఆడడం కష్టంగా మారింది. దీంతో మెస్సీ కోపంతో.. ''బాస్ నేను మనిషినే.. సెల్ఫీ కోసం నన్ను ఇబ్బంది పెట్టకు'' అంటూ అతన్ని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెక్యురిటీ వచ్చి అతన్ని స్టేడియం నుంచి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 1-1తో డ్రా చేసుకుంది. కాగా అర్జెంటీనాకు క్వాలిఫయింగ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా 11 మ్యాచ్‌లు గెలిచి.. ఆరు డ్రా చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. కాగా అర్జెంటీనాతో పాటు బ్రెజిల్, ఉరుగ్వే, ఈక్వెడార్‌లు ఫిఫా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.
చదవండి: Manchester United: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎవరా ఆటగాడు?
Comments
Please login to add a commentAdd a comment