ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి భారత బాక్సింగ్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ చివరి టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. గత నెలలో జరిగిన తొలి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు తొమ్మిది కేటగిరీల్లో బరిలోకి దిగినా ఒక్కరు కూడా ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయారు. తొలి టోర్నీలో పాల్గొన్న ఐదుగురు బాక్సర్లపై (దీపక్ భోరియా, హుసాముద్దీన్, శివ థాపా, లక్ష్య చహర్, జాస్మిన్) వేటు పడింది.
దీపక్ స్థానంలో 2022 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అమిత్ పంఘాల్‌కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కింది. తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ స్థానంలో సచిన్ సివాచ్‌ను ఎంపిక చేశారు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీ మే 25 నుంచి జూన్ 2 వరకు బ్యాంకాక్‌లో జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి మహిళల విభాగంలో నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి, పరీ్వన్, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
భారత బాక్సింగ్ జట్టు:
పురుషుల విభాగం: అమిత్ పంఘాల్ (51 కేజీలు), సచిన్ సివాచ్ (57 కేజీలు), అభినాష్ జమ్వాల్ (63.5 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), అభిమన్యు (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు), నరేందర్ (ప్లస్ 92 కేజీలు). మహిళల విభాగం: అంకుశిత (60 కేజీలు), అరుంధతి (66 కేజీలు).
Comments
Please login to add a commentAdd a comment