ఐదేళ్ల క్రితమే సీక్రెట్‌గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ | Sumit Singh: I No Longer Have Any Relationship With Pushpendra Singh | Sakshi
Sakshi News home page

Sumit Singh: సీక్రెట్‌ పెళ్లి.. ఆల్‌రెడీ విడిపోయామన్న బ్యూటీ.. మరో నటుడితో డేటింగ్‌?

Jun 6 2024 2:45 PM | Updated on Jun 6 2024 2:57 PM

Sumit Singh: I No Longer Have Any Relationship With Pushpendra Singh

మేము 2018లో పెళ్లి చేసుకున్నాం. మాకు బాబు పుట్టాడు. అతడి పేరు రుద్ర. అయితే నా భర్త, నేను విడిపోయి చాలారోజులే అవుతోంది. అతడితో నాకిప్పుడు ఏ సం

సెలబ్రిటీల కెరీర్‌ కన్నా పర్సనల్‌ లైఫ్‌ మీదే అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. వారి ప్రేమ వ్యవహారాలు-పెళ్లి-విడాకులపైనే ఎక్కడలేని ఇంట్రస్ట్‌ చూపిస్తారు. అలా బుల్లితెర నటి సుమిత్‌ సింగ్‌ నటుడు షాగుణ్‌ పాండేతో డేటింగ్‌లో ఉందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు నటి డేటింగ్‌ గురించి గుసగుసలు మొదలుపెట్టారు.

నటుడితో డేటింగ్‌?
ఆ వార్త తనదాకా చేరడంతో నటి సుమిత్‌ సింగ్‌ ఈ రూమర్స్‌ను కొట్టిపారేసింది. షాగుణ్‌తో డేటింగ్‌లో లేనని క్లారిటీ ఇచ్చింది. ఇంతలో సోషల్‌ మీడియాలో నటి సుమిత్‌, దర్శకుడు పుష్పేందర్‌ సింగ్‌ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరిద్దరికీ ఐదేళ్ల క్రితమే పెళ్లయిందని తెలుస్తోంది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడట!

మేము విడిపోయాం
ఐదేళ్ల క్రితం నాటి వెడ్డింగ్‌ పిక్స్‌ లీక్‌ అవడంతో ఎట్టకేలకు తన పెళ్లిపై నోరు విప్పింది సుమిత్‌. ఆమె మాట్లాడుతూ.. 'మేము 2018లో పెళ్లి చేసుకున్నాం. మాకు బాబు పుట్టాడు. అతడి పేరు రుద్ర. అయితే నా భర్త, నేను విడిపోయి చాలారోజులే అవుతోంది. అతడితో నాకిప్పుడు ఏ సంబంధమూ లేదు. మేము కలిసుండటం లేదు. విడిపోయాం. అయినా ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు' అని అసహనం ప్రదర్శించింది.

చదవండి: నా కూతురు చూసిన ఒకే ఒక్క సినిమా ఆదిపురుష్‌: నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement