నా కూతురు చూసిన ఒకే ఒక్క సినిమా ఆదిపురుష్‌: నటుడు Actor Sharad Kelkar said that his daughter had watched only one of his films which is Adipurush. Sakshi
Sakshi News home page

Sharad Kelkar: నా కూతురు నా సినిమాలేవీ చూడలేదు.. ఒకరకంగా ఇదే బెటర్‌..

Published Thu, Jun 6 2024 1:15 PM | Last Updated on Thu, Jun 6 2024 2:53 PM

Sharad Kelkar Says His Daughter Kesha Watched Only Film Was Adipurush

ప్రభాస్‌ కెరీర్‌లో అత్యంత డిజాస్టర్‌ మూవీ ఆదిపురుష్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు. నిర్మొహమాటంగా తిరస్కరించారు. అయితే తన కూతురు మాత్రం ఇప్పటివరకు చూసిన ఏకైక సినిమా ఆదిపురుష్‌ అంటున్నాడు బాలీవుడ్‌ నటుడు, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌ శరద్‌ కేల్కర్‌.

ఇదే బెటర్‌
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నేను ఏయే సినిమాలు చేశాను, అసలు ఏం చేస్తున్నాననేది నా కూతురు కేశ పెద్దగా పట్టించుకోదు. అసలు నేను నటించిన సినిమాలే చూడదు. టీవీ షోలు, సినిమాలపై అంతగా ఆసక్తి చూపించదు. కాబట్టి నా వృత్తేంటో తనకు తెలియదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదే నయం. తనిలా అమాయకంగా ఉంటేనే బాగుంటుంది. సమయం వచ్చినప్పుడు నేనేంటో, నా పాపులారిటీ ఎలా ఉంటుందో తనకు నేనే పరిచయం చేస్తాను.

గొంతు గుర్తుపట్టింది
అప్పటివరకు అందరు పిల్లల్లాగే తను కూడా బాల్యాన్ని సాధారణ బాలికలా ఎంజాయ్‌ చేయాలి. తను ఇంతవరకు నా సినిమాలేవీ చూడలేదు. ఆమె చూసిన ఏకైక చిత్రం ఆదిపురుష్‌. అప్పుడప్పుడు యానిమేషన్‌ చిత్రాలు మాత్రమే చూస్తూ ఉంటుంది. ఆదిపురుష్‌ మూవీలో నా గొంతును గుర్తుపట్టి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు తను ఎదుగుతోంది కాబట్టి నెమ్మదిగా యాక్షన్‌ కామెడీ సినిమాలు కూడా చూపించడం మొదలుపెడతాను' అని చెప్పుకొచ్చాడు.

నటుడిగా, వాయిస్‌ ఆర్టిస్టుగా
శరద్‌ కేల్కర్‌ మొదట్లో సీరియల్స్‌లో నటించాడు. తర్వాత సినిమాలకు షిఫ్ట్‌ అయ్యాడు. హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. తెలుగులో సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌లో రాజా భైరవ్‌ సింగ్‌గా మెప్పించాడు. ఇటీవలే అయలాన్‌ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. పలు హాలీవుడ్‌ సినిమాల్లోని పాపులర్‌ పాత్రలకు హిందీలో డబ్బింగ్‌ చెప్పాడు. అలాగే రామ్‌చరణ్‌ (వినయ విధేయ రామ), ప్రభాస్‌ (సలార్‌, బాహుబలి 1, 2, ఆదిపురుష్‌)కు హిందీలో డబ్బింగ్‌ చెప్పాడు. దసరా హిందీ వర్షన్‌లో నానికి గొంతు అరువిచ్చాడు.

చదవండి: ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి వర్మ ఆహ్వానం.. జూన్‌ 9న లిస్ట్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement